E-Paper
Advertisement

Viral Video: బాబోయ్.. పసి బిడ్డను స్కూటర్ డిక్కీలో పెట్టుకుని.. తల్లి షికారు, వీడియో వైరల్!

Viral Video: బాబోయ్.. పసి బిడ్డను స్కూటర్ డిక్కీలో పెట్టుకుని.. తల్లి షికారు, వీడియో వైరల్!
Advertisement

పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా పేరెంట్స్ తట్టుకోలేరు. తెలిసి బిడ్డకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలిగించరు. కానీ, తాజాగా సోషల్ మీడియోలో వైరల్ అవుతున్న వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు కలత చెందుతున్నాయి. ఇందే పత్యం? ఇదేం మాయరోగం అంటూ, ఆ తల్లిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఇంతకీ ఆమె ఏం చేసింది? ఎందుకు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

స్కూటర్ డిక్కీలో బిడ్డను పడుకోబెట్టి..

చిన్న పిల్లలను స్కూటర్ ముందు భాగంలో కూర్చో బెట్టుకుని తీసుకెళ్లడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. లేదంటే, వెనుక ఎవరైనా పట్టుకుని కూర్చోవడం గమిస్తాం. కానీ, ఓ మహిళ తన బిడ్డను ఏకంగా స్కూటర్‌ లో డిక్కీలో పడుకోబెట్టి షికారుకు వెళ్తుంది. అంతేకాదు, ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియోలో సదరు మహిళ చిన్నారిని ఇంట్లో నుంచి తీసుకొస్తుంది. స్కూటర్ డిక్కీని ఓపెన్ చేస్తుంది. అందులో మెత్తటి టవల్ పరిచి ఉంటుంది. అందులో చిన్నారని పడుకోబెడుతుంది. బిడ్డకు టోపీ కూడా పెట్టి ఉంటుంది. ఆ తర్వాత సీటు క్లోజ్ చేస్తుంది. బిడ్డ డిక్కీ లోపలే ఉండిపోతుంది. ఆ తర్వాత స్కూటర్ ను స్టార్ట్ చేసి వెళ్లిపోతుంది. ఆ స్కూటర్ మీద MP అనే రిజిస్ట్రేషన్ కోడ్ తో ప్రారంభం అవుతుంది. అంటే, ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో జరిగినట్లు అర్థం అవుతోంది.

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

ఈ వీడియోను చూసిన నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. చిన్నారి సేఫ్టీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారని డిక్కీలో ఉంచి ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరం అంటూ మండిపడుతున్నారు. ఇంజిన్ వేడికి తోడు, లోపల గాలి ఆడక చిన్నారని ప్రాణాలకే ప్రమాదం ఏర్పాటే అవకాశం ఉదంటున్నారు. సామాన్లు తీసుకెళ్లడానికి ఉపయోగించాల్సిన ప్రదేశంలో చిన్నారని ఉంచి, సీట్ క్లోజ్ చేసి షికారుకు వెళ్లడం ఏంటని మండిపడుతున్నారు.

Advertisement

సదరు మహిళ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే ఆ చిన్నారిని చంపేసేలా ఉందని మండిపడుతున్నారు.  ఇలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, మరికొంత మంది ఈ వీడియో జస్ట్ స్క్రిప్ట్ ప్రకారం చేశారని, అందులో నిజం లేదని కామెంట్స్ పెడుతున్నారు.  అయితే, వినోదం కోసం చేసినా, అది చాలా డేంజరస్ అంటున్నారు. ఇలాంటి వారి అలాంటి వీడియోలను షేర్ చేయడం వల్ల ఇతరులు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉందంటున్నారు. అలా జరగకుండా ఉండాలంటే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Read Also: బాతును కోస్తే బంగారం బయటపడింది.. దాని విలువ ఎంతో తెలుసా?

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×