E-Paper
Advertisement

ప్రకృతి చెక్కిన శిల్పాలు.. సూర్యాపేట గుట్టల్లో అద్భుతం.. చూసేందుకు క్యూ కట్టిన జనం!

ప్రకృతి చెక్కిన శిల్పాలు.. సూర్యాపేట గుట్టల్లో అద్భుతం.. చూసేందుకు క్యూ కట్టిన జనం!
Advertisement

Ancient Sculptures: సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాళ్ల ఆకారాలు ప్రస్తుతం స్థానికులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మండలంలోని నూర్జంపేట, గూడేపుకుంట గ్రామాల సరిహద్దుల్లో ఉన్న ఒక గుట్టపై మనుషులను పోలిన రకరకాల ఆకారాల్లో బండరాళ్లు దర్శనమిస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

అద్భుత రాతి ఆకారాలు

ఈ గుట్టలపై మనిషి తలను పోలిన ఒక పెద్ద బండరాయితో పాటు.. ప్రశాంతంగా నిద్రిస్తున్న ఒక ఋషి తల రూపాన్ని పోలిన మరో రాయి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వినూత్నంగా ఉన్న ఈ ప్రకృతి వింతను చూసేందుకు నూర్జంపేట, గూడేపుకుంట, మాచారం వంటి పొరుగు గ్రామాల ప్రజలే కాకుండా.. సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

పురావస్తుశాఖ పరిశోధనకు డిమాండ్

Advertisement

అయితే తరతరాల నుంచి ఈ రాళ్లు ఇక్కడే ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు ఈ ప్రాంతంలో సమగ్ర పరిశోధనలు జరిపితే మరిన్ని చారిత్రక రహస్యాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పేర్కొంటున్నారు. ప్రధాన రహదారికి సమీపంలోనే ఉన్న ఈ గుట్టను గుర్తించి.. ప్రభుత్వం తగిన సదుపాయాలు కల్పించి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

మేడారంలో మరో శిల్పం లభ్యం

ఇదిలా ఉంటే.. సమీపంలోని నేరేడుచర్ల మండలం మేడారం గ్రామంలోని ‘రెక్కల స్తంభం గండి’ వద్ద అరుదైన మానవ ఆకారపు శిల్పం కూడా వెలుగు చూసింది. కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్ర విభాగానికి చెందిన పీహెచ్ డీ విద్యార్థి సంగు వెంకటరెడ్డి ఈ చారిత్రక ఆధారాలను గుర్తించారు. ప్రస్తుతం ఈ శిల్పం కూడా స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

శిల్పాలకు చారిత్రక నేపథ్యం

Advertisement

పీ‌హెచ్‌డీ విద్యార్థి సంగు వెంకటరెడ్డి ఈ శిల్పాల గురించి మాట్లాడుతూ.. కీలక విషయాలను వెల్లడించారు. ఇవి క్రీ.పూ 1200 – 300 కాలానికి చెందిన మెగాలిథిక్ యుగానికి చెందినవని తెలిపారు. నాటి కాలంలో మరణించిన తమ నాయకుడి జ్ఞాపకార్థం లేదా దేవుడిగా భావించి ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి ఉంటారని వివరించారు.

Also Read: ఒకే ఒక్క టికెట్‌తో.. ఆటో + బస్సు జర్నీ.. ఆర్టీసీ ఈ-ఆటోలు వచ్చేస్తున్నాయ్!

గిరిజన సంస్కృతికి ప్రతీక

ఇదిలా ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొత్తూరు మొట్లగూడెం, భూపతిపురం, మంగపేట, కోడాకండ్ల, గలబ, దొంగతోగు, కేసారం వంటి పలు ప్రాంతాల్లోనూ ఇటువంటి ప్రాచీన శిల్పాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడ కూడా పురవాస్తుశాఖ అధికారులు పరిశోధనలు చేస్తే.. మరిన్నీ విషయాలు బయటపడొచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నేటికీ గోండులు, మరియాలు, కదంబలు వంటి గిరిజన తెగల్లో ఇటువంటి సాంప్రదాయ సమాధి ఆచారాలు కొనసాగుతుండటం విశేషం.

Also Read: ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

Related News

ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

భూమిని కాపాడుతున్న సూపర్ పవర్స్.. మనుషులు కాదండోయ్.. ఈ 6 జీవులే రియల్ హీరోస్!

రైలు మీద తెగిపడ్డ ఓవర్‌ హెడ్ వైర్లు.. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు!

మహిళా బైకర్‌ను రోడ్డుపై వెంటాడి.. ఘోరంగా ఢీకొట్టిన ఆకతాయిలు.. వైలర్ అవుతున్న వీడియో!

24 క్యారెట్ల బంగారం.. 3,83,800 డైమండ్స్.. భాగ్యనగరంలో మెరిసిపోతున్న గోల్డెన్ గణపయ్య!

యమలోకం దాటి వెళ్తే.. కోటి గాజుల గణపతి దర్శనం.. గాజువాకలో అదిరిపోయే వినాయక మండపం!

ట్రావెల్ చేసేటప్పుడు ఇల్లు గుర్తుకొస్తోందా? ఈ సింపుల్ టిప్స్ ట్రై చేయండి

ఇండోనేషియా To జపాన్.. భారత్ కంటే ముందే ఇతర దేశాల్లో గణపతి పూజ జరిగిందా?

Big Stories

Advertisement
×