E-Paper
Advertisement

ఒకే రోడ్డు.. 14 దేశాలు.. 48 వేల కి.మీ.. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!

ఒకే రోడ్డు.. 14 దేశాలు.. 48 వేల కి.మీ.. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!
Advertisement

World’s Longest Highway: ఒక దేశం నుంచి మరో దేశానికి కారులో వెళ్లడమే పెద్ద ప్రయాణంగా అనిపిస్తుంది. అలాంటిది ఏకంగా రెండు ఖండాలను దాటుతూ, వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తే ఎలా ఉంటుంది? ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా పేరొందిన ప్యాన్-అమెరికన్ హైవే ఇలాంటి అద్భుతమైన ప్రయాణానికి అవకాశం కల్పిస్తుంది. హైవే నెట్‌వర్క్‌ లోని పలు మార్గాలను కలిపి చూస్తే దీని పొడవు ఏకంగా 48,000 కిలోమీటర్లు. ఇంతకీ ఈ రోడ్డు ఎక్కడ ఉందంటే..

రెండు ఖండాలను కలిపే భారీ రహదారి!

ప్యాన్-అమెరికన్ హైవే ఉత్తర అమెరికాలోని అలస్కా ప్రాంతం నుంచి ప్రారంభమై దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా వరకు విస్తరించి ఉంటుంది. ఈ మార్గం అమెరికా ఖండాల్లోని అనేక దేశాలను కలుపుతుంది. కెనడా, అమెరికా, మెక్సికోతో పాటు పెరూ, చిలీ వంటి దేశాల మీదుగా సాగుతూ మొత్తం 14 దేశాలను లింక్ చేస్తుంది. అయితే, ఇది ఒకే రోడ్డుగా నిర్మించిన  మార్గం కాదు. వివిధ దేశాల్లో ఉన్న జాతీయ రహదారులు, ప్రధాన రోడ్ల నెట్‌ వర్క్‌ ను కలిపి ప్యాన్-అమెరికన్ హైవేగా పరిగణిస్తారు.

రోజుకు 500 కిలోమీటర్లు వెళ్లినా..

Advertisement

ఈ రోడ్ మీద పూర్తిగా రోడ్డు ప్రయాణంతో కవర్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. రోజుకు సుమారు 500 కిలోమీటర్ల చొప్పున ప్రయాణించినా దాదాపు రెండు నెలలు పట్టేంత దూరం ఇది. అయితే, వాస్తవ ప్రయాణంలో వాతావరణం, సరిహద్దు తనిఖీలు, రహదారి పరిస్థితులు, విశ్రాంతి లాంటి అంశాల కారణంగా మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ హైవే ప్రత్యేకత కేవలం దాని పొడవులోనే లేదు. మార్గమంతా ప్రకృతి, భౌగోళిక పరిస్థితులు విపరీతంగా మారుతూ ఉంటాయి.

మంచు పర్వతాల నుంచి ఎడారుల వరకు!

ప్యాన్-అమెరికన్ హైవేపై ప్రయాణిస్తే మంచుతో కప్పబడిన పర్వత ప్రాంతాలు, పచ్చని వర్షారణ్యాలు, పొడి ఎడారులు ఇలా ఎన్నో రకాల భూభాగాలు కనిపిస్తాయి. ఒకే ప్రయాణంలో ఇంత వైవిధ్యమైన ప్రకృతి దృశ్యాలను చూడటం ఈ రహదారి ప్రత్యేకతగా చెప్పవచ్చు.

మధ్యలో రోడ్డు లేని ప్రాంతం

Advertisement

అయితే, ఈ భారీ రహదారిలో ఒక ఆసక్తికరమైన అడ్డంకి ఉంది. పనామా, కొలంబియా మధ్య డారియన్ గ్యాప్ అనే దట్టమైన అడవి ప్రాంతం ఉంది. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ ప్రాంతంలో పూర్తి రహదారి మార్గం లేదు. దీంతో వాహనంతో ప్రయాణించే వారు ఈ భాగాన్ని రోడ్డు మీదుగా దాటలేరు. వాహనాలను మరో ప్రాంతానికి తరలించడానికి సముద్ర మార్గం, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించాల్సి వస్తుంది. ఇదే కారణంగా ప్యాన్-అమెరికన్ హైవేను పూర్తిగా కారులో ఒకే మార్గంగా దాటడం అంత సులభం కాదు.

ప్రపంచంలోని ఇతర పొడవైన హైవేలు!  

ప్యాన్-అమెరికన్ హైవే తర్వాత ఆస్ట్రేలియాలోని హైవే 1 సుమారు 14,500 కిలోమీటర్ల పొడవుతో ప్రపంచంలోని పొడవైన రహదారుల్లో ఒకటిగా ఉంది. రష్యాలోని ట్రాన్స్-సైబీరియన్ హైవే కూడా సుమారు 11,000 కిలోమీటర్ల పొడవుతో ప్రముఖ స్థానం సంపాదించింది. భారత్ లో అత్యంత పొడవైన జాతీయ రహదారి NH-44. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఈ మార్గం సుమారు 4,000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది.

Read Also: 11 రాష్ట్రాలు.. 4,000 కిలో మీటర్లు.. దేశంలో అత్యంత పొడవైన జాతీయ రహదారి ఇదే!

Tags

Related News

రైలు వాష్ రూమ్ లో యువతి, యువకుడు.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

రైలులో ప్రమాదవశాత్తు కిందపడినా ఇక పరిహారం.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

QR కోడ్ స్కాన్ చేస్తే సెకన్లలో పేమెంట్.. భారత UPI చూసి జర్మన్ మంత్రి ఆశ్చర్యం!

కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!

టాయ్ ట్రైన్‌ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

రైలు టికెట్ల కోసం పోటెత్తిన జనం.. IRCTC కొత్త రికార్డు!

కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. విశాఖ వందేభారత్‌ సహా 9 రైళ్లు రీషెడ్యూల్!

Big Stories

Advertisement
×