E-Paper
Advertisement

పుతిన్ ‘రష్యా వన్’ vs జిన్‌పింగ్ బోయింగ్ 747.. ఎవరి విమానం ఖరీదైనదో తెలుసా?

పుతిన్ ‘రష్యా వన్’ vs జిన్‌పింగ్ బోయింగ్ 747.. ఎవరి విమానం ఖరీదైనదో తెలుసా?
Advertisement

Putin vs Xi Jinping Presidential Planes: ప్రపంచంలోని అగ్రశ్రేణి దేశాల అధినేతలు సాధారణ ప్రయాణికులు ఉపయోగించే విమానాల్లో ప్రయాణించరు. వారి విమానాల్లో భద్రత, కమ్యూనికేషన్ వ్యవస్థలు, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సదుపాయాలు అత్యంత కీలకంగా ఉంటాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఉపయోగించే విమానాలు దీనికి మంచి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. అయితే, ఈ ఇద్దరి విమానాల ప్రత్యేకతలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

పుతిన్ కోసం రష్యా వన్

వ్లాదిమిర్ పుతిన్ ప్రధానంగా రష్యాలో తయారైన ఇల్యూషిన్ Il-96-300PU విమానాన్ని ఉపయోగిస్తారు. ఇది Il-96-300 ఆధారంగా ప్రత్యేకంగా మార్పులు చేసిన విమానం. సాధారణ ప్రయాణికుల విమానంతో పోలిస్తే ఇందులో అధునాతన భద్రతా, కమ్యూనికేషన్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ విమానం కేవలం ప్రయాణానికి మాత్రమే పరిమితం కాదు. అవసరమైనప్పుడు గాల్లో నుంచే ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేలా ఎయిర్‌ బోర్న్ కమాండ్ సెంటర్‌ గా రూపొందించారు. అత్యంత భద్రమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ రక్షణ సదుపాయాలు ఇందులో ఉంటాయి. విమానం లోపలి భాగాన్ని కూడా సాధారణ ఎయిర్‌ లైనర్ల మాదిరిగా కాకుండా విలాసవంతంగా తీర్చిదిద్దారు.

Advertisement

పుతిన్ విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు భద్రత విషయంలో మరో ఆసక్తికరమైన విధానాన్ని రష్యా అనుసరిస్తుంది. ఒకే రకమైన పలు విమానాలను సిద్ధంగా ఉంచుతారు. చివరి క్షణం వరకు అధ్యక్షుడు ఏ విమానంలో ప్రయాణిస్తారో స్పష్టంగా తెలియకుండా ఉండేలా ఈ ఏర్పాట్లు చేస్తారు. దీని ఉద్దేశం భద్రతను మరింత పెంచడమే. ఈ విమానం విలువ సుమారు 500 మిలియన్ డాలర్లుగా కొన్ని నివేదికలు అంచనా వేస్తున్నాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.4,200 కోట్లకు పైగాగా ఉంటుంది.

జిన్‌పింగ్‌కు బోయింగ్ 747

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రయాణించే విధానం కొంత భిన్నంగా ఉంటుంది. ఆయన కోసం రష్యా తరహాలో ఒక ప్రత్యేక మోడల్ అధ్యక్ష విమానాన్ని శాశ్వతంగా నిర్వహించడం కంటే, చైనా అవసరానికి అనుగుణంగా కమర్షియల్ విమానాలను మార్చుకుంటుంది. జిన్‌పింగ్ విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఎయిర్ చైనా ఫ్లీట్‌లోని ఎంపిక చేసిన బోయింగ్ 747 విమానాలను ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. వీటిలో సాధారణ ప్రయాణికుల సీట్లను తొలగించి, అధ్యక్షుడి ప్రయాణానికి అనుగుణంగా ప్రత్యేక గదులు, ఆఫీస్, విశ్రాంతి ప్రదేశాలను ఏర్పాటు చేస్తారు. విమానం లోపల అత్యంత ముఖ్యమైన మార్పుల్లో సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థలు ఒకటి. అంతర్జాతీయ పర్యటనలో ఉన్నప్పటికీ కీలకమైన ప్రభుత్వ సమాచారాన్ని భద్రంగా నిర్వహించడానికి వీలుగా ఈ ఏర్పాట్లు ఉంటాయి.

Advertisement

బోయింగ్ 747 అనే కమర్షియల్ విమాన మోడల్ ఆధారంగా చేసుకున్నప్పటికీ, అధ్యక్షుడి ప్రయాణానికి ఉపయోగించే సమయంలో ఇది సాధారణ ఎయిర్‌లైనర్‌గా ఉండదు. అవసరమైన భద్రతా, కమ్యూనికేషన్, ప్రత్యేక ఇంటీరియర్ మార్పులతో ప్రత్యేక విఐపీ విమానంగా మారుతుంది. ఈ విమానానికి సంబంధించిన అంచనాలు సుమారు 250 మిలియన్ డాలర్ల వరకు ఉంటాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.2,100 కోట్లకు పైగా ఉంటుంది.

ఇద్దరి విమానాల మధ్య అసలు తేడా ఇదే!

పుతిన్, జిన్‌పింగ్ ఇద్దరి విమానాల్లోనూ అత్యాధునిక కమ్యూనికేషన్, భద్రతా సదుపాయాలు ఉన్నప్పటికీ వాటి విధానం వేరు. పుతిన్ కోసం రష్యా ప్రత్యేకంగా రూపొందించిన Il-96-300PU విమానాలను ఉపయోగిస్తుండగా, జిన్‌పింగ్ కోసం చైనా ఎయిర్ చైనా బోయింగ్ 747 విమానాలను అవసరానికి అనుగుణంగా మార్పులు చేసి ఉపయోగిస్తుంది. రష్యా ప్రత్యేక అధ్యక్ష విమాన దళంపై ఆధారపడితే, చైనా కమర్షియల్ విమానాలను అవసరానికి తగ్గట్టుగా మార్చుకునే విధానాన్ని అనుసరిస్తోంది.

Read Also: పుతిన్ ఆరస్ vs జిన్‌ పింగ్ హాంగ్‌ కీ L5.. ఎవరి కారు ఎక్కువ పవర్‌ ఫుల్?

Tags

Related News

ఆరేళ్ల తర్వాత భారత్‌కు చైనా విమానాలు.. సెప్టెంబర్ 21 నుంచి గ్వాంగ్‌జౌ–ఢిల్లీ సర్వీసులు షురూ!

చాక్లెట్ పిరమిడ్లు.. మ్యాట్రియోష్కా బొమ్మలు.. బ్రిక్స్ అతిథులకు ఢిల్లీ హోటళ్లలో రాయల్ ట్రీట్!

జాబ్ వెతకడానికి ఇకపై నేరుగా దుబాయ్ వెళ్లిపోవచ్చు.. కొత్త వీసా ఇదిగో.. స్పాన్సర్ అవసరం లేదు

ఒకే రోడ్డు.. 14 దేశాలు.. 48 వేల కి.మీ.. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!

రైలు వాష్ రూమ్ లో యువతి, యువకుడు.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

రైలులో ప్రమాదవశాత్తు కిందపడినా ఇక పరిహారం.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

QR కోడ్ స్కాన్ చేస్తే సెకన్లలో పేమెంట్.. భారత UPI చూసి జర్మన్ మంత్రి ఆశ్చర్యం!

Big Stories

Advertisement
×