Hyderabad Rail Alert: హైదరాబాద్ లో రైలు ప్రయాణికులకు కాసేపు ఇబ్బందులు పడ్డారు. మౌలాలి సమీపంలో ఓవర్ హెడ్ విద్యుత్ తీగల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సికింద్రాబాద్–లాలాగూడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన సెప్టెంబర్ 13న రాత్రి సమయంలో చోటుచేసుకుంది. సుమారు 10.38 గంటల సమయంలో ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్‌మెంట్ (OHE)లో సమస్య ఏర్పడినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఈ మార్గంలో వెళ్తున్న ఓ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలుపై విద్యుత్ వైర్లు తెగి పడటంతో పెద్ద శబ్దం వినిపించింది. దీంతో ముందుజాగ్రత్తగా రైలును నిలిపివేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు, సాంకేతిక సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమస్య ఏర్పడిన ప్రాంతాన్ని పరిశీలించి మరమ్మతు పనులు చేపట్టారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను సరిచేసేందుకు అవసరమైన చర్యలను వేగంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని రైళ్లు నిలిచిపోయాయి. తక్కువ సమయంలోనే సమస్యను పరిష్కరించడంతో ఆయా రైళ్లు మళ్లీ యథావిధిగా ప్రయాణించాయి.
OHEలో ఏర్పడిన లోపాన్ని సరిచేసిన తర్వాత ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తిరిగి కొనసాగించారు. అప్, డౌన్ లైన్లలో సేవలు సాధారణంగా నడిచేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఘటన కారణంగా పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు నిలిచిపోలేదని, స్వల్ప వ్యవధిలోనే సేవలను పునరుద్ధరించినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటన ప్రభావం 12795 నంబర్ విజయవాడ–లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌పై కూడా పడింది. OHE సమస్య ఏర్పడిన సమయంలో ఈ రైలు ఆ సెక్షన్‌లోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం రైలును సికింద్రాబాద్ వైపు తరలించే చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఎక్కువ సమయం ఇబ్బంది కలగకుండా రైల్వే సిబ్బంది పరిస్థితిని వేగంగా చక్కదిద్దారు.
Clarification regarding Overhead Electrical Equipment (OHE) failure between secunderabad and Lalaguda stations at 22.38 hours.
Both up and down trains are in operation and running normally.
On reporting of tripping, the railway officials swung into action for restoration.
No…
— South Central Railway (@SCRailwayIndia) September 14, 2026
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు, రైల్వే సిబ్బందికి గాయాలు కూడా కాలేదన్నారు. కేవలం ఓవర్‌హెడ్ విద్యుత్ వ్యవస్థలో ఏర్పడిన లోపం కారణంగానే కొద్దిసేపు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఘటనకు దారితీసిన కారణాలపై రైల్వే సిబ్బంది పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: వందే భారత్ vs రాజధాని ఎక్స్ ప్రెస్.. ప్రయాణికులకు ఏ రైలు బెటర్.. పూర్తి వివరాలు ఇవిగో!