Gold Price Today: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రభావం బులియన్ మార్కెట్‌పై పడింది. ఈ నేపథ్యంలో మదుపరులు బంగారం వైపు ఫోకస్ చేశారు. ఫలితంగా గడిచిన మూడురోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు, శుక్రవారం మార్కెట్లో పెరిగాయి. అయితే వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతోంది.
పసిడి ప్రియులకు షాక్-అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే ఉంచింది. బుధవారం జరిగిన సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఫెడ్ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లు పెంచేకంటే ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కంట్రోల్ లోకి తీసుకురావడమే లక్ష్యమని ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో వడ్డీ రేట్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై బులియన్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. ఫలితంగా మదుపరులు బంగారం వైపు మొగ్గు చూపడంతో ధరలు ఎగిసి పడ్డాయి. దీనికితోడు అమెరికా సైన్యం ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగింది.
అమాంతంగా పెరిగిన ధరలు ఈ ఉద్రిక్తతల వల్ల మార్కెట్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. బంగారంపై మదుపరులు మొగ్గుచూపారు. కామెక్స్‌లో ఉదయం ట్రేడింగ్ సమయంలో స్పాట్ బంగారం 0.61 శాతం పెరిగి ఔన్సుకు 4,060.90 డాలర్లపైన ట్రేడింగ్ జరుగుతోంది. వెండి 0.06 శాతం పెరిగి ఔన్సుకు 58.12 డాలర్లపైనే కొనసాగుతోంది. దేశీయ MCX స్పాట్ బంగారం జూలై 28 సెషన్‌ను 10 గ్రాములకు రూ. 1,41,764 వద్ద ముగించింది.
తెలుగు రాష్ట్రాల్లో ధరల మాటేంటి?దేశంలోని అన్ని నగరాల్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. నిన్నటితో పోలిస్తే కాసింత పెరిగింది. తెలుగు రాష్ట్రాల మార్కెట్ విషయానికి వద్దాం. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ. 82 పెరిగింది. దీంతో రూ. 14,433 కొనసాగుతోంది. 8 గ్రాముల బంగారం ధర రూ. 656 పెరిగింది. రూ. 1,15,464 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల బంగారం ధర రూ. 820 పెరిగి రూ. 1,44,330 కొనసాగుతోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,330 కొనసాగుతోంది.
ఒక గ్రాము 22 క్యారట్ల బంగారం ధర రూ. 75 పెరిగింది. ప్రస్తుతం రూ. 13,230 వద్ద ఉంది. 8 గ్రాముల బంగారం ధర రూ. 600 పెరిగి రూ. 1,05,840 కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల బంగారం ధర విషయానికి వద్దాం. రూ. 750 పెరిగి రూ. 1,32,300 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,300 ఉంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు-న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 142,170 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ 142,420గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 142,530 కొనసాగుతోంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 142,360 వద్ద కొనసాగుతోంది. ఇకపై బంగారం ధరలు పెరిగే సూచనలు ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో కిలోకు రూ 215,702 వద్దకు చేరింది. అంతకు ముందు ట్రేడింగ్ లో రూ. 217,479 వద్ద ముగిసింది. ఒక్కసారి కిలోకు రూ. 1,777 మేర పడిపోయింది.