New Vande Bharat Sleeper Train: సుదూర రైలు ప్రయాణికుల కోసం మరో కొత్త వందేభారత్ స్లీపర్ సర్వీసు అందుబాటులోకి రానుంది. బెంగళూరు నుంచి ముంబైకి ప్రయాణించే వారి కోసం మరో వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్నారు. నవంబర్ 1న ఈ రైలును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న ప్రకటించారు. ఈ రైలు దేశంలోని రెండు కీలక నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైలు ప్రయాణానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. అయితే, కొత్త సర్వీసుతో జస్ట్ 16 గంటల్లోనే ప్రయాణాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
బెంగళూరు-ముంబై మధ్య ప్రయాణాలు కొనసాగించే వారికి ఈ రైలు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రయాణికులు రాత్రివేళ ప్రయాణించి మరుసటి రోజు గమ్యస్థానానికి చేరుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత రైలు ప్రయాణంతో పోల్చితే ఏకంగా 8 గంటల పాటు ప్రయాణ సమయం తగ్గనుంది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి. సోమన్న సోషల్ మీడియా వేదికగా ఈ రైలు ప్రారంభానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బెంగళూరు నుంచి ముంబైకి 16 గంటల్లో ప్రయాణించేలా ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ రైలు తన తొలి ప్రయాణాన్ని బెంగళూరు నుంచే ప్రారంభిస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 ఏసీ కోచ్‌లు ఉంటాయి. వీటి ద్వారా 823 మంది ప్రయాణికులు జర్నీ చేసే అవకాశం ఉంటుంది. సుదూర ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చేలా ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) సాంకేతికత ఆధారంగా BEML ఈ రైలును అభివృద్ధి చేసింది. ఆరెంజ్, గ్రే కలర్ తో రూపొందించిన ఈ రైలు అత్యాధునిక సాంకేతికతతో కూడిన స్లీపర్ సర్వీసుగా ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
బెంగళూరు నుంచి ముంబైకి వెళ్లే ఈ రైలు మార్గమధ్యంలో పలు ప్రధాన స్టేషన్లలో ఆగనుంది. కలబురగి, సోలాపూర్, పూణే, కళ్యాణ్ మీదుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT)కు చేరుకోనుంది. ఈ స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులకు కూడా కొత్త సర్వీసు మరింత లాభం కలిగించనుంది. అయితే పూర్తి స్టాపేజీలు, రాకపోకల సమయాల వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
ఈ రైలులో ప్రయాణించాలనుకునేవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో IRCTC అధికారిక వెబ్‌సైట్‌తో పాటు రైల్ కనెక్ట్, రైల్ వన్ యాప్‌ల ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో టికెట్ల కోసం సమీప రైల్వే స్టేషన్‌లోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్ కు వెళ్లొచ్చు. అయితే టికెట్ బుకింగ్ ప్రారంభ తేదీ, ఛార్జీలు, పూర్తి టైమ్‌టేబుల్ లాంటి వివరాలను ముందుగా తెలుసుకోవడం మంచిది.
I𝐧𝐝𝐢𝐚’𝐬 𝐫𝐚𝐢𝐥 𝐫𝐞𝐯𝐨𝐥𝐮𝐭𝐢𝐨𝐧 𝐢𝐬 𝐬𝐡𝐢𝐟𝐭𝐢𝐧𝐠 𝐢𝐧𝐭𝐨 𝐚 𝐡𝐢𝐠𝐡𝐞𝐫 𝐠𝐞𝐚𝐫! 🇮🇳🚆
Launching on 1 November 2026, India’s second Vande Bharat Sleeper train will connect Mumbai and Bengaluru in just 16 hours, cutting travel time by up to 8 hours!
• 16 fully… pic.twitter.com/GAh0WsZtru
— V. Somanna (@VSOMANNA_BJP) October 22, 2026
Read Also: ప్రయాణికులకు అలర్ట్.. వందే భారత్ సహా పలు రైళ్ల టైమ్ మారింది!