Train Timings Changed: భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. జమ్మూ డివిజన్ పరిధిలో నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో పాటు పలు ఎక్స్ ప్రెస్, డీఎంయూ రైళ్ల టైమింగ్స్ ను మార్చింది. ఈ మార్పులు అక్టోబర్ 20 నుంచి 25వ వరకు అమల్లోకి రానున్నాయి. కత్రా, జమ్మూ తావి, న్యూఢిల్లీ, కామాఖ్య, ఘాజీపూర్ సిటీ, పఠాన్‌కోట్ కంటోన్మెంట్ మార్గాల్లో ప్రయాణించే వారు కొత్త టైమింగ్స్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా నుంచి న్యూఢిల్లీకి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (22478) సమయాలను అక్టోబర్ 20 నుంచి సవరించారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ రైలు కత్రా నుంచి ఉదయం 5:40 గంటలకు బయలుదేరుతుంది. కెప్టెన్ తుషార్ మహాజన్ స్టేషన్ నుంచి ఉదయం 6:08 గంటలకు, జమ్మూ తావి నుంచి ఉదయం 7:08 గంటలకు, కతువా నుంచి ఉదయం 8:01 గంటలకు బయలుదేరుతుంది. ఈ మార్పుల నేపథ్యంలో వందే భారత్‌లో ప్రయాణించే వారు తమ బోర్డింగ్ స్టేషన్‌లో రైలు బయలుదేరే సమయాన్ని మరోసారి చెక్ చేసుకోవాలి.
కల్కా-కత్రా ఎక్స్ ప్రెస్ (14503) సమయాలు అక్టోబర్ 20 నుంచి మారాయి. ఈ రైలు జమ్మూ తావి నుంచి తెల్లవారుజామున 3:20 గంటలకు, కెప్టెన్ తుషార్ మహాజన్ స్టేషన్ నుంచి 4:12 గంటలకు బయలుదేరుతుంది. ఉదయం 4:47 గంటలకు కత్రాకు చేరుకుంటుంది. అలాగే కత్రా-కామాఖ్య ఎక్స్ ప్రెస్ (15656) అక్టోబర్ 21 నుంచి కొత్త టైమింగ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ రైలు కత్రా నుంచి ఉదయం 3:40 గంటలకు బయలుదేరుతుంది. కెప్టెన్ తుషార్ మహాజన్ స్టేషన్ నుంచి ఉదయం 4:06 గంటలకు బయలుదేరుతుంది.
కత్రా-ఘాజీపూర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (14612) అక్టోబర్ 22 నుంచి కొత్త షెడ్యూల్ ప్రకారం నడుస్తుంది. ఈ రైలు కత్రా నుంచి ఉదయం 3:40 గంటలకు బయలుదేరుతుంది. జబల్‌పూర్-కత్రా ఎక్స్ ప్రెస్ (11449) సమయాలు అక్టోబర్ 20 నుంచి మారాయి. ఈ రైలు జమ్మూ తావి నుంచి ఉదయం 8:30 గంటలకు, కెప్టెన్ తుషార్ మహాజన్ స్టేషన్ నుంచి ఉదయం 10:02 గంటలకు బయలుదేరి, ఉదయం 11:50 గంటలకు కత్రాకు చేరుకుంటుంది.
సబర్మతి-కత్రా ఎక్స్‌ప్రెస్ (19415) అక్టోబర్ 25 నుంచి కొత్త టైమ్‌టేబుల్‌ను ఫాలో అవుతుంది. ఇది జమ్మూ తావి నుంచి ఉదయం 4:15 గంటలకు బయలుదేరి, ఉదయం 6:25 గంటలకు కత్రాకు చేరుకుంటుంది. జమ్మూ తావి- కెప్టెన్ తుషార్ మహాజన్ డీఎంయూ రైలు (74909) అక్టోబర్ 20 నుంచి ఉదయం 8:10 గంటలకు బయలుదేరి, ఉదయం 10:10 గంటలకు డెస్టినేషన్ కు చేరుకుంటుంది. మరో డీఎంయూ సర్వీస్ (74906) ఉదయం 8 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు పఠాన్‌కోట్ కంటోన్మెంట్‌కు చేరుకుంటుంది. అయితే, ఈ రైలు సమయం ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుందనేది అధికారులు వెల్లడించలేదు. రైళ్ల సమయాలు మారుతున్నందున ప్రయాణికులు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also: వేల కిలోమీటర్ల రైలు ప్రయాణం.. అయినా, వేడివేడి భోజనం ఎలా అందిస్తారు?