E-Paper
Advertisement

Jagan vs Adinarayana: జగన్ పై ఆదినారాయణ రెడ్డి ఫైర్

Jagan vs Adinarayana: జగన్ పై ఆదినారాయణ రెడ్డి ఫైర్
Advertisement

Jagan vs Adinarayana:  వైఎస్ కుటుంబంపై ముఖ్యంగా జగన్‌పై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ఒక ఎత్తెతే… జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చేస్తున్న ఆరోపణలు మరో ఎత్తు అంటున్నారు ..కూటమిలో ఉన్న బీజేపీ ఒక వైపు మెతక వైఖరితో గత ప్రభుత్వంపై అతి సున్నితంగా దాడి చేస్తుంటే.. ఆ జిల్లా బీజేపీ నేత మాత్రం వైయస్ కుటుంబమే టార్గెట్‌గా రోజు సంచలన కామెంట్స్ చేస్తున్నారు .. ఒకప్పుడు వైయస్ అండ దండలతో రాజకుయ ఆరంగ్రేట్రం ఆ నేత ఇప్పుడు ఆ కుటుంబాన్నే ఎందుకు అంతలా టార్గెట్ చేయాల్సివచ్చింది?

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే ఆదినారాయణ

ఆదినారాయణ రెడ్డి… కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే.. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా.. కాంగ్రెస్ నుంచి దివంగత సీఎం వైఎస్ అండదండలతో 2004 లో మొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. జమ్మలమడుగు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయం. దశాబ్దాలుగా అక్కడ దేవగుడి, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య రాజకీయ పోరు రగులుతూనే ఉంది.. 2014లో వైసీపీ తరపున టికెట్ దక్కించుకొని గెలిచిన ఆది వెంటనే టీడీపీ గూటికి చేరి మంత్రి పదవి దక్కించుకోవడంతో , అప్పటివరకు పొన్నపురెడ్డి కుటుంబం తో రాజకీయ వైరం ఆది వర్సెస్ వైఎస్‌ కుటుంబంగా మారింది.

వైఎస్ జగన్ పై మాటల దాడి చేస్తున్న ఆది

Advertisement

మంత్రి పదవి దక్కించుకున్న ఆది సమయం దొరికితే చాలు వైఎస్ జగన్ పై మాటల దాడి చేస్తూనే ఉన్నారు. 2019 లో వైసీపీ అధికారం లోకి రావడంతో ఆది‌కి ఇక గడ్డుకాలమే అని అందరూ భావించినా ఆయన మాష్టర్ ప్లాన్ రచించి బీజేపీ గూటికి చేరి వైసీపీ రాజకీయ దాడి నుంచి బయట పడగలిగారు. గత ఐదేళ్లు బీజేపీ ముసుగులో సైలెంట్ గా ఉన్నా, కూటమి అధికారం లోకి వచ్చిన వెంటనే వైసీపీపై మళ్ళీ మాటల యుద్దం మొదలెట్టేశారట..

2029 ఎన్నికల నాటికి జగన్‌కు చెక్ పడతానంటున్న ఆది

కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ‌లో జగన్ అనుకూల వర్గం ఒకవైపు, జగన్ వ్యతిరేక వర్గం ఒక వైపు అనే ప్రచారం ఉంది. దానిపై బీజేపీ లోనే చర్చ జరుగుతున్నా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం తన అజెండా రాబోయే 2029 ఎన్నికల లోపు వైఎస్ కుటుంబానికి చెక్ పెట్టడమే అంటున్నారు. టీడీనీ అగ్రనాయకులు జగన్ పై ఇప్పటికీ కొంత మెతక వైకరి ప్రదర్శిస్తున్నా ఆది మాత్రం ఘాటు వ్యాఖ్యలతో రాజకీయ దూమారం రేపుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిక్ష తో ఎమ్మెల్యే గా గెలిచిన ఆది… ఆ కుటుంబం పై ఆరోపణలు చేయడానికి సిగ్గు లేదా వైసీపీ ఎదురు దాడి చేస్తోంది.

ఆదినారాయణకి అండగా టీడీపీ

Advertisement

ఎమ్మెల్యే ఆది రాజకీయ ఆరోపణల కంటే వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. వైఎస్ వివేకా హత్య కేసులో మొదటి ఆరోపణలు ఎదుర్కొంది ఆదినారాయణ రెడ్డే. అందుకే నేడు డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారనే చర్చ నడుస్తోందట. వివేకా హత్య కేసులో వైయస్ సునీత కు ఆది డైరెక్ట్ గా మద్దతు తెలిపి పులివెందులోని వివేకా ఇంటికి వచ్చి మరీ సునీత తో చర్చించడం, జగన్ కుటుంబం తో విరోధానికి మరింత ఆజ్యం పోసింది. జగన్‌పై పోరాటం చేస్తున్న ఆదికి బీజేపీ నుంచి మద్దతు లేకపోయినా టిడిపి మాత్రం ఆదికి అండగా ఉంటోంది.

ఆది వర్సెస్ జగన్ రాజకీయం

ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధించడంలో తన రాజకీయ చతురత ప్రదర్శించిన ఆదినారాయణరెడ్డి పులివెందులలో జగన్ కు ఎదురుగాలి వీస్తోందన్న ప్రచారానికి ఊతమిచ్చారు. అదే ఇప్పడు ఆది పై వైసీపీ ఎదురు దాడికి కారణంగా బావిస్తున్నారట.. ఆ క్రమంలో రాబోయే ఎన్నికల్లో జమ్మలమడుగు రాజకీయం పాత ఫ్యాక్షన్ రాజకీయానికి మళ్ళీ పురుడు పోస్తుందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోందట.. మరి రాబోయే రోజులు ఆది వర్సెస్ జగన్ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .

Story By Apparao, Big Tv

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×