మనసుకు నచ్చిన వారితో ఏకాంతంగా గడపాలంటే? ఇప్పుడున్న యువతకు తెలిసిన బెస్ట్ ఆప్షన్ ఓయో రూమ్స్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఓయో రూమ్స్ బుకింగ్ లో దేశంలోనే టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే, ఓయో ఒక్కటే కాదు, పెళ్లికాని జంటలు ఏకాంతంగా గడిపేందుకు మరికొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ ఉండు అంకుల్
దేశంలో యువ జంటలు ఏకాంతంగా గడిపేందుకు ఉండు అంకుల్ హోటల్స్ చాలా బెస్ట్. దేశ వ్యాప్తంగా ఈ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. పెళ్లి కాని జంటలు హ్యాపీగా ఈ హోటల్ గదులను బుక్ చేసుకుని స్టే చేసే అవకాశం ఉంది. ఉండు అంకుల్ దేశంలోని 40కి పైగా నగరాల్లో హోటల్స్ ను కలిగి ఉంది. రోజు రోజుకు ఈ హోటల్స్ మరింత విస్తరిస్తున్నాయి.
⦿ ఫ్యాబ్ హోటల్స్
ఫ్యాబ్స్ హోటల్స్ కూడా పెళ్లి కాని యువత ఎంజాయ్ చేసేందుకు చక్కటి ఆప్షన్ గా చెప్పుకోవచ్చు. ఈ హోటల్స్ యువ జంటలకు చాలా సేఫ్ గా ఉంటుంది. ఈ యాప్ ద్వారా హోటల్ రూమ్స్ ఈజీగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇతర హోటల్స్ తో పోల్చితే వీటి యాక్సెసిబిలిటీ చాలా సింఫుల్ గా ఉంటుంది. దేశంలోని పలు నగరాల్లో ఈ హోటల్ గదులు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ మనసుకు నచ్చిన వారితో టూర్ కు వెళ్లిన సమయంలో ఈ హోటల్ గదులను బుక్ చేసుకోవడం మంచింది.
⦿ OYO గదులు
పెళ్లి కాని జంటలు సురక్షితంగా, సులభంగా హోటల్ లో బస చేసేందుకు OYO చాలా ఫేమస్. ఈ ఓయో చైన్ లో అత్యధిక హోటల్స్ ఉన్నాయి. పెళ్లికాని జంటలకు ఈజీ యాక్సెసిబిలిటీ ఉంటుంది.
⦿ బ్రీవిస్టే
కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ లో బ్రీవిస్టే ఒకటి. ముఖ్యంగా పెళ్లికాని జంటలు ఇందులో సౌకర్యవంతంగా స్టే చేసే అవకాశం ఉంటుంది. ఈ హోటల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఈ హోటల్స్ కూడా దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి.
⦿ మిస్టే
ఇది కూడా పెళ్లికాని జంటలు స్టే చేసేందుకు అనుకూలమైన హోటల్స్ సౌకర్యాన్ని కలిగిస్తుంది. కొద్ది గంటల పాటు స్టే చేసేందుకు ఈ హోటల్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన బస చేసే అవకాశం ఉంటుంది.
⦿ లవ్ స్టే
పెళ్లి కాని జంటలు బస చేసేందుకు బెస్ట్ హోటల్ లవ్ స్టే. ఈజీగా ఈ హోటల్స్ ను బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో పాటు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్టే చేసే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పెళ్లికాని జంటలు సురక్షితంగా గడిపవచ్చు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ హోటల్స్ ఉన్నాయి.
⦿ ట్రీబో హోటల్స్
తొలుత ట్రావెలర్స్ కోసం ఈ హోటల్ చైన్ ను ప్రారంభించినప్పటికీ, ఇది ఆ తర్వాత పెళ్లికాని యువత ఏకాంతంగా గడిపే అవకాశం కల్పిస్తున్నారు. మోరల్ పోలీసింగ్ అనేది పెళ్లికాని జంటలకు ఇబ్బంది కలిగిస్తుంది. అయితే, ఈ హోటల్స్ అలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంది. పలు నగరాల్లో ఈ హోటల్స్ అందుబాటులో ఉన్నాయి.
Read Also: సంక్రాంతి వేళ సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్, హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు