Shubman Gill: భారత క్రికెట్ జట్టు యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ తన ఆటతోనే కాదు తన వ్యక్తిగత జీవితంతో కూడా అప్పుడప్పుడు {Shubman Gill} వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అతడు క్రికెట్ ప్రపంచంలో ఫేమస్ అయితే, అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూతురి ద్వారా తరచూ సోషల్ మీడియాలో ఇతని {Shubman Gill} గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మరోసారి వార్తలలో నిలిచాడు గిల్.
Also Read: Jay shah Kavya Maran: కావ్యా పాపతో ICC బాస్ రొమాన్స్.. ఫోటోలు వైరల్ !
కానీ ఈసారి ఓ పెద్ద స్కామ్ లో ఇరుక్కొని {Shubman Gill} వార్తల్లోకెక్కాడు. తాజాగా గుజరాత్ లో ఓ భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. పోంజీ స్కామ్ తరహాలో ఈ కుంభకోణం జరిగినట్లు సమాచారం. గుజరాత్ లో బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపి మోసం చేశాడు ఈ కేసులోని ప్రధాన నిందితుడు భూపేంద్ర సింగ్ ఝాలా. బీజే ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజే గ్రూప్ పేరుతో వేలాది మంది నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశాడు.
రూ. 450 కోట్లకు పైగా ఈ కుంభకోణం జరిగినట్లు సమాచారం. అయితే ఈ కుంభకోణానికి పాల్పడ్డ భూపేంద్ర సింగ్ గత నెల రోజుల నుండి పరారీలో ఉండగా పక్కా సమాచారంతో సిఐడి బృందాలు నిందితుడిని మోహ్సానా జిల్లా దావ్డాలోని ఫామ్ హౌస్ లో పట్టుకున్నారు. నిందితుడు భూపేంద్ర సింగ్ వద్ద నుండి విలాసవంతమైన కార్లు, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇక మరోవైపు భూపేంద్ర సింగ్ స్థానిక కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం దానిని తీరస్కరించింది. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. విచారణలో భూపేంద్ర సింగ్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్లు {Shubman Gill} శుభమన్ గిల్, మోహిత్ శర్మ లకు గుజరాత్ సిఐడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు జారీ చేయనున్నారు.
Also Read: Shubman Gill – Rohit Sharma: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్, పంత్ లేకుండా చివరి టెస్ట్ !
450 కోట్లకు పైగా కుంభకోణానికి సంబంధించిన ఈ కేసులో వీరిని {Shubman Gill} విచారించేందుకు సిఐడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపనున్నట్టు తెలుస్తోంది. వీరంతా గత ఐపీఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిధ్యం వహించారు. మీరు మాత్రమే కాదు వీరితోపాటు రాహుల్ తెవాటియ, ఆర్ సాయి సుదర్శన్ లకు కూడా సిఐడి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపనున్నారు. పెట్టుబడుల విషయంలో ఈ నలుగురు క్రికెటర్లను పోలీసులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఈ వార్త విన్న క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం గిల్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాలో ఉన్నాడు. సిఐడి సమన్లు అందితే గిల్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.