Allu Arjun Case : ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రీమియర్ల సందర్భంగా సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలాట ఘటనపై బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోని కపూర్ (Boney Kapoor) తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వివాదంలో “తప్పంతా వాళ్లదే” అంటూ ఆయన ఈ వివాదంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ బోనీ కపూర్ ఈ వివాదంలో తప్పు ఎవరిది అని తేల్చారో తెలుసుకుందాం.
సంధ్య థియేటర్ వివాదం టాలీవుడ్లో ప్రకంపన సృష్టించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రితో సినీ పెద్దల భేటీ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రోజుకో సెలబ్రిటీ ఈ విషయంపై స్పందిస్తూ ఉండడంతో ఇంకా వార్తల్లో నిలుస్తోంది. నిన్నటి దాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ వివాదంలో తప్పు ఎవరిది? అనే ప్రశ్నకు చెప్పిన సమాధానం చక్కర్లు కొట్టింది. ఆయన ఇటు అల్లు అర్జున్ కు, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇద్దరికీ సపోర్ట్ చేస్తూ న్యూట్రల్ గా మాట్లాడారు.
ఇక తాజాగా ఈ వివాదంలో గత రెండు రోజుల నుంచి ఇతర కారణాలతో వార్తలు నిలుస్తున్న నిర్మాత బోనీ కపూర్ (Boney Kapoor) తాజాగా వేలు పెట్టారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన వివాదంపై స్పందిస్తూ అల్లు అర్జున్ (Allu Arjun) ని వెనకేసుకొచ్చారు. ఈ వివాదంలో అసలు అల్లు అర్జున్ తప్ప ఏమీ లేదని, ఆయనను అనవసరంగా ఈ కేసులోకి లాగారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి వివాదంలో తప్పు ఎవరిది? ఓ మహిళ ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు? అంటే అక్కడ గుమిగూడిన జనం కారణంగానే సదరు మహిళ చనిపోయిందని అన్నారు. తాజాగా బోనీ కపూర్ చేసిన ఈ కామెంట్స్ పై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే ఈ కేసులో హీరోని ఒక్కడినే బాధించడం కరెక్ట్ కాదని చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో బోనీ కపూర్, టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ మధ్య జరిగిన డిస్కషన్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప 2’ లాంటి సినిమాలను తీసి… బాలీవుడ్ కు మూవీస్ ఎలా తీయాలో నేర్పిస్తోందని, కానీ బాలీవుడ్ మాత్రం ఇంకా ముంబైకే పరిమితమైందని ఆయన కామెంట్ చేశారు. కానీ ఈ డిస్కషన్ కు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పలువురు హిందీ ప్రముఖులు నాగ వంశీపై పైర్ అయ్యారు. దానికి ఆయన కూడా అసలు ఏం జరిగిందో వివరిస్తూనే స్ట్రాంగ్ కౌంటర్ వేశారు. ఏదేమైనా బాలీవుడ్ పై నాగ వంశీ వేసిన సెటైర్ టాలీవుడ్ లఓ కొంతమందిని ఫుల్ ఖుషి చేసింది. ఇక ఈ వివాదం ఇంకా నడుస్తుండగానే బోనీ కపూర్ తాజాగా అల్లు అర్జున్ కు సపోర్ట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు.