Best Time to Book Flight Tickets: విమాన ప్రయాణం చాలా ఖరీదైనది. అమెరికా లాంటి దేశాలకు వెళ్లి రావాలంటే సుమారు రూ. 2.5 లక్షలకు పైగా ఖర్చు అవుతుంది. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల తక్కువ ధరకే టికెట్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఏకంగా సగానికి పైగా తగ్గింపు ధరను పొందవచ్చు. అయితే, ఇందుకు చేయాల్సింది సరైన టైమ్ లో టికెట్లు బుక్ చేయడం. ఇంతకీ, ఏ టైమ్ లో టికెట్లు బుక్ చేస్తే, తక్కువ ధరకు లభిస్తాయంటే..
తెల్లవారుజామున 2:37 గంటలకు ఫ్లైట్ బుక్ చేసుకుంటే.. వీలైనంత వరకు తక్కువ ధరకు టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. సాధారణ ధరతో పోల్చితే 60% తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. నిజానికి విమాన టికెట్ ధరలు అనేవి డైనమిక్ గా ఉంటాయి. అంటే, డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, టికెట్ ధరలు పెరుగుతాయి. అయితే, సాధారణంగా మనుషులు తెల్లవారుజామున 2:37 గంటలకు నిద్రపోతారు. ఉదయం 2:30 – 3:00 గంటల మధ్య విమాన టికెట్ సెర్చింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. డిమాండ్ తగ్గినప్పుడు ధరలు ఆటోమేటిక్ గా తక్కువగా ఉంటాయి.
చాలా విమాన సంస్థలు అర్ధరాత్రి తర్వాత, ఉదయం ట్రాఫిక్ ముందు పాత ధరలు స్పష్టంగా ఉంటాయి. :37 గంటలకు కొత్తవి లోడ్ అవుతాయి. ఆ చిన్న గ్యాప్ లో తక్కువ ధరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. “నేను పడుకునే ముందు టికెట్ ధరలు చూశాను. చాలా చౌకగా ఉన్నాయి. తెల్లవారి లేచి చూసే సరికి ధరలు బాగా పెరిగాయి” అని ఓ ప్రయాణీకుడు వెల్లడించాడు. ఉదయం 2:37 గంటలకు కార్పొరేట్ బుకింగ్ వ్యవస్థలు నెమ్మదిగా ఉంటాయి. ఆ సమయంలో టికెట్లు కొనుగోలు చేయడం వల్ల చౌకగా టికెట్లు అందుబాటులో ఉ టాయి. అయితే, తెల్లవారుజామున 2:37 అనేది మ్యాజిక్ కాదు. ధరల అస్థిరత అత్యధికంగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. తక్కువ ధరకు టికెట్లు పొందాలనుకునే వ్యక్తులు, కొత్త రేట్లు లోడ్ అయ్యే సమయంలో బుక్ చేసుకోవడం మంచిది. ఆ సమయంలో చౌకగా టికెట్లు లభిస్తాయి.
Read Also: యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?
కొన్నిసార్లు ఆయా విమానయాన సంస్థలు టికెట్ల కొనుగోలుపై ఆఫర్లు అందిస్తుంటాయి. పరిమిత సమయంలో ఈ ఆఫర్లు ఉంటాయి. ఆ సమయంలో కొనుగోలు చేయడం వల్ల టికెట్లు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తక్కువ ధరకు టికెట్లు పొందాలంటే ప్రత్యేక ఆఫర్ల సమయంలో టికెట్లు తీసుకోవాలి. లేదంటే కొత్త రేట్లు లోడ్ అయ్యే తెల్లవారుజామున టికెట్లు బుక్ చేయడం వల్ల తక్కువ ధరకు పొందే అవకాశం ఉంటుంది.
నోట్: ఈ ఆఫర్లు కొన్నిసార్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వివిధ సోర్స్ ద్వారా ఈ వివరాలను ఇక్కడ అందించామని గమనించగలరు.
Read Also: కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ పర్యాటకానికి మరింత బూస్టింగ్.. IRCTC కీలక ఒప్పందం!