ప్రస్తుతం భారత్ లో రూ. 10 లక్షల లోపు ఫ్యామిలీ బోలెడు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ధరలో మంచి భద్రత, సౌకర్యంతో పాటు ఆధునిక ఫీచర్లతో లభిస్తున్నాయి. పాపులర్ బ్రాండ్లు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్స్, సన్ రూఫ్ లు, 360 డిగ్రీ కెమెరాలు, ఆరు ఎయిర్ బ్యాగ్‌లు సహా పలు ప్రీమియం ఫీచర్లను సరసమైన మోడళ్లలో అందిస్తున్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా పంచ్, టాటా టియాగో, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, హ్యుందాయ్ ఎక్స్ టర్ లాంటి క్రేజీ కార్లు లభిస్తున్నాయి. ఈ కార్లు మంచి ప్లేస్, నమ్మకం, అధునాతన సాంకేతికతతో చిన్న కుటుంబాలకు అనుకూలంగా ఉన్నాయి.
మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రారంభ ధర రూ. 5.79 లక్షలు. ఈ మోడల్ లో వెనుక AC వెంట్, వైర్ లెస్ ఛార్జర్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే, బూమరాంగ్ DRLలతో కూడిన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ లు, గ్లోసీ బ్లాక్ గ్రిల్ ఉన్నాయి. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ ప్లే కూడా ఉన్నాయి.
టాటా పంచ్ రూ. 5.60 లక్షల నుంచి లభిస్తుంది. ఇది వైర్ లెస్ కనెక్టివిటీతో 10 అంగుళాల HD ఇన్ఫోటైన్‌మెంట్ తో వస్తుంది. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, వైర్ లెస్ ఛార్జింగ్ ను కలిగి ఉంటుంది. పంచ్ లో LED టెయిల్ లాంప్‌లు, LED హెడ్ ల్యాంప్‌లు, DRLలు ఉన్నాయి.
ఈ లిస్టులో ఉన్న మరో మోడల్ టాటా టియాగో. దీని ధర రూ. 5.60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ టాటా మోడల్ 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, A, C టైప్ ఛార్జింగ్ పోర్ట్ లు, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ ను కలిగి ఉంది. ఇందులో LED హెడ్ ల్యాంప్‌లు, డ్యూయల్ టోన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ఉన్నాయి.
ఈ మారుతి సుజుకి మోడల్ రూ. 4.99 లక్షల నుంచి అందుబాటులో ఉంది. వ్యాగన్ ఆర్ ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, డైనమిక్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ ఎక్స్టీరియర్ ను కలిగి ఉంది. ఇది స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్,ఆటో గేర్ షిఫ్ట్ టెక్నాలజీని అందిస్తుంది.
Read Also: ఫస్ట్ డే 10 వేల బుకింగ్స్, టాటా హారియర్ EV దుమ్మురేపుతోందిగా!
హ్యుందాయ్ ఎక్స్ టర్ రూ. 5.64 లక్షల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. ఇది వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, డిజిటల్ డిస్ ప్లేతో ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ తో వస్తుంది. ఇందులో ఫుట్ వెల్ లైటింగ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జర్ కూడా ఉన్నాయి.
Read Also: టాటా సియెర్రా To మారుతి సుజుకి ఇ విటారా.. త్వరలో లాంచ్ కాబోతున్న క్రేజీ ఈవీలు!