E-Paper
Advertisement

Women Mangalsutra mistakes: మహిళలు మంగళసూత్రం విషయంలో ఆ పొరపాట్లు అసలు చేయకూడదట

Women Mangalsutra mistakes: మహిళలు మంగళసూత్రం విషయంలో ఆ పొరపాట్లు అసలు చేయకూడదట
Advertisement

Women Mangalsutra mistakes: మహిళలు తమ మెడలో ధరించిన మంగళసూత్రం విషయంలో అసలు ఆ పోరపాట్లు చేయకూడదట. కొంత మంది సరదాకో లేక ఏమవుతుందిలే అనే అలసత్వంతోనే ఆ పొరపాట్లు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవడమేనని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరి తాళి మరొకరు వేసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. అయితే తాళి విషయంలో మహిళలు చేసే ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం..

ఇతరులకు కనిపించకూడదు:

ఆడవారు మెడలో ఉన్న మంగళసూత్రం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి పెళ్లి అయి భర్త మెడలో తాళి కట్టాక.. అప్పటి నుంచి ఇక ఆ తాళి ఎవ్వరికి కనిపించకూడదట. కనిపించకుండా చూసుకునే బాధ్యత భార్యే తీసుకోవాలట. ఎప్పుడూ మంగళసూత్రం ఆడవారి హృదయానికి తగులుతున్నట్టు ఉంచుకోవాలట. దీని అర్థం భర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడమట. ఒకవేళ మంగళసూత్రం బయటకు వచ్చి వేరే వాళ్లు చూస్తే.. దాని వల్ల ఆమె భర్తకు దిష్టి తగులుతుందట. భర్త ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మహిళలు తమ మంగళసూత్రాన్ని బయటకు కనిపించే విధంగా ధరించకూడదని పురాణాల్లో ఉన్నట్టు పండితులు చెప్తున్నారు.

సూది లేదా పిన్నులు గుచ్చకూడదు:

Advertisement

చాలా మంది మహిళలు తమ మెడలోని మంగళసూత్రానికి పిన్నీసులు.. లేదంటే బట్టలు కుట్టుకునే సూదులు లాంటివి గుచ్చుకుంటారు. మరికొందరైతే తాళం చెవి కూడా మంగళసూత్రానికే గుచ్చుకుంటుంటారు. ఇలా చేయడం చాలా దోషమని పండితులు హెచ్చరిస్తున్నారు. దోషమే కాదు పాపం అని కూడా చెప్తుంటారు. ఇలా చేయడం వల్ల తాళికి ఉన్న పవిత్రత పోతుందట. అలాగే మంగళకరమైన సూత్రానికి ఇనుప వస్తువులు తగిలించడం కూడా దోషానికి కారణం అవుతుందట. దీంతో భర్తకు నెగెటివ్‌ ఎనర్జీ పెరిగిపోయి భర్త సంపాదన తగ్గిపోవడం.. లేదా..? వ్యాపారంలో నష్టాలు రావడం.. చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవడం లాంటివి జరుగుతాయట. కాబట్టి మహిళలు ఎట్టి పరిస్థితుల్లో తమ మెడలోని మంగళసూత్రానికి ఇనుప వస్తువులు.. మరే ఇతర వస్తువులు గుచ్చకూడదని సూచిస్తున్నారు పండితులు.

ఒకరి తాళి మీరు వేసుకోవడం, మీ తాళి వేరొకరికి ఇవ్వడం:

చాలా మంది ఆడవాళ్లు కొన్ని సందర్భాలలో ఒకరి తాళి ఒకరు మార్చుకుంటుంటారు. ఒకరి మరోకరు వేసుకోవడం చేస్తుంటారు.. కొన్ని సందర్బాలలో తాళి డిజైన్‌ బాగుందనో.. లేదా ఇంకో కారణం చేతనో… ఒక్కసారన్నా వేరేవాళ్ల తాళి మెడలో వేసుకోవడం లేదా మీ తాళి వేరే వాళ్లు వేసుకుని చూడటం  లాంటి పనులు చేస్తుంటారు. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరి తాళి మరొకరు వేసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీ సౌభాగ్యం వేరొకరికి వెళ్తుందట. అలాగే మీరు వేరే వాళ్లది వేసుకుంటే వారి దరిద్రం మీకు అంటుకుంటుందట. లేనిపోని అనర్థాలు జరిగే అవకాశం కూడా ఉంటందని పండితులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మీరు వేసుకునే బట్టలే మీకు ధనయోగం ఇస్తాయట – ఏ రోజు ఏ బట్టలు వేసుకోవాలో తెలుసా..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×