E-Paper
Advertisement

FREE ITEMS: ఎవరైనా ఆ వస్తువులు ఉచితంగా ఇచ్చినా అస్సలు తీసుకోకూడదట

FREE ITEMS: ఎవరైనా ఆ వస్తువులు ఉచితంగా ఇచ్చినా అస్సలు తీసుకోకూడదట
Advertisement

FREE ITEMS: ఎవరైనా కొన్ని వస్తువులు ఫ్రీగా ఇచ్చినా అసలు తీసుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. ఆలా ఇచ్చిన వస్తువులు తీసుకుంటే వారికున్న కర్మలు మీకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నవారు. ఇంతకీ ఏ వస్తువులు దానంగా ఇస్తే తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

చీపురు: ఎవరైనా చీపురు ఫ్రీగా ఇస్తానంటే మాత్రం అసలు తీసుకోకూడదట. చీపురు తీసుకోవడం వల్ల ఎంతటి ధనవంతులైన త్వరలోనే పేదవారిగా మారిపోతారట. కోట్ల ఆస్థులున్నా.. అన్నీ కరిగిపోయి బికారులు అయిపోతారట.

Advertisement

గొడుగు: ఎవరైనా ఉచితంగా మీకు గొడుగు ఇస్తుంటే.. వద్దని చెప్పాలట మొహమాటానికైనా కూడా గొడుగును ఫ్రీగా తీసుకొవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు. గొడుగు ఫ్రీగా తీసుకోవడం వల్ల ఆ వ్యక్తికి ధన నష్టం జరుగుతుందట. ఎంత సంపాదించే వ్యక్తి అయినా అంతా పోగొట్టుకునే పరిస్థితి వస్తుందట.

నూనె: మీకు ఎవరైనా నూనెను దానంగా ఇస్తుంటే అసలు తీసుకోకూడదట. నూనె అనేది దురదృష్టానికి సింబల్‌ లాంటిదట. నూనె ఫ్రీగా తీసుకుంటే మీకు దురదృష్టం పట్టుకుంటుందట. త్వరలోనే మీరు దురదృష్టంతో బాధపడతారట.

Advertisement

ఉప్పు: మీకు తెలిసివారైనా.. తెలియని వారైనా మీకు ఉప్పు ఉచితంగా ఇస్తుంటే మాత్రం మొహమాటం లేకుండా వద్దని చెప్పాలట. ఉప్పు అనేది అప్పులకు సంకేతమట. ఎవరి నుంచైనా ఉప్పు ఉచితంగా తీసుకుంటే ఆ వ్యక్తి త్వరలోనే అప్పుల పాలైపోతాడట.

నువ్వులు: నువ్వులు అనేవి శనిదేవుడికి ఇష్టమైనవి. అలాంటి నువ్వులను మీకు ఎవరైనా ఫ్రీగా ఇస్తుంటే తీసుకోకూడదట.. ఎందుకంటే ఫ్రీగా మీరు తీసుకునేది నువ్వులు కాదు వాటి వెనకాల ఉన్న శనిదేవుడిని. ఎవరైనా ఏరికోరి శనిని వెంట తెచ్చుకుంటారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు పండితులు.

సూది: సూది ఎవరైనా మీకు ఉచితంగా ఇస్తామంటే మాత్రం మీరు నిర్మోహమాటంగా వద్దని చెప్పాలట. సూది అనేది గొడవలకు సింబాలిక్‌ అట. సూది తీసుకోవడం అంటే గొడవలకు మీరే రెడ్‌ కార్పేట్‌ పరవడం లాంటిదట.

నగలు: చాలా మంది నగలు ఇస్తామంటే ఎగబడి తీసుకుంటుంటారు. కానీ అలా ఎప్పుడూ తీసుకోకూడదట. నగలు అనేవి దోషాలకు ప్రతీకలట. నగలు తీసుకున్నారంటే ఇచ్చిన వారి దోషాలు మీరు తీసుకున్నట్టేనని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా చేసిన తప్పులను దోషాలకు పరిహారంగా నగలు ఇవ్వమని చెప్పగానే.. నగలు ఇస్తుంటారని అలా నగలు తీసుకోవడం కరెక్టు కాదని పండితులు సూచిస్తున్నారు.

దువ్వెన: దువ్వెన అనారోగ్యానికి సంకేతమట. ఎవరైనా మీకు దువ్వెన ఉచితంగా ఇస్తానంటే మాత్రం మీరు మొహమాటం లేకుండా వద్దని చెప్పమని పండితులు సూచిస్తున్నారు. దువ్వెన తీసుకోవడం అంటే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టేనట.

చెప్పులు: ఎవరైనా మీకు చెప్పులు ఉచితంగా ఇస్తానంటే అసలు తీసుకోకూడదట. చెప్పులు తీసుకోవడం వల్ల శనిదోషాలు అంటుకుంటాయట. ఇంకా వాళ్లు కొద్ది రోజులు వాడిన చెప్పులు కనక తీసుకుంటే వాళ్ల కర్మలు మొత్తం మీకు ట్రాన్స్‌ఫర్‌ అయ్యే అవకాశం ఉంటుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ప్రేమలో ఫెయిల్ అవుతుంటారట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×