E-Paper
Advertisement

దుబాయ్ వెళ్తే రూ.80 వేలు రివార్డులు గెలుచుకోవచ్చు.. ట్విస్ట్ ఏమిటంటే?

దుబాయ్ వెళ్తే రూ.80 వేలు రివార్డులు గెలుచుకోవచ్చు.. ట్విస్ట్ ఏమిటంటే?
Advertisement

Dubai Invite Program 2026: మీరు దుబాయ్ వెళ్తే రూ.80 వేలు వరకు రివార్డు పొందొచ్చు. ట్విస్ట్ ఏమిటంటే ఆ రివార్డు మీకు కాదు.. మిమ్మల్ని అక్కడ ఆహ్వానించిన కుటుంబ సభ్యులకు లేదా మీ స్నేహితులకి లభిస్తుంది.

దుబాయ్ ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న విదేశీ కుటుంబాల కోసం కొత్త పర్యాటక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘దుబాయ్ ఇన్వైట్’ (Dubai Invite) పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను దుబాయ్‌ కి ఆహ్వానించే అర్హులైన నివాసితులకు అద్భుతమైన బహుమతులు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం 2026 జూలై 20 నుంచి అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. ఈ సమయంలో దుబాయ్‌లో నివసిస్తున్న వారు తమ బంధువులు, స్నేహితులను నగరాన్ని సందర్శించేందుకు ఆహ్వానిస్తే, నిబంధనలకు అనుగుణంగా బహుమతులు పొందే అవకాశం కల్పిస్తుంది.

3,000 దుబాయ్ దినార్స్ బహుమతి

Advertisement

దుబాయ్ లో ఉన్నవారికి ఆహ్వానం మేరకు వచ్చిన అతిథులు దుబాయ్‌ను సందర్శించిన తర్వాత, ఆహ్వానించిన వ్యక్తికి AED 3,000(సుమారు రూ. 78,590) కంటే ఎక్కువ విలువైన రివార్డులు అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ బహుమతుల్లో విలాసవంతమైన హోటళ్లలో బస చేసే అవకాశం, ప్రముఖ రెస్టారెంట్లలో ప్రత్యేక భోజనం, ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఉచితంగా, రాయితీ టికెట్లు, షాపింగ్ ఆఫర్లు, లైఫ్‌స్టైల్ వోచర్లు లాంటి బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.

ఎందుకోసం ఈ కొత్త పథకం?

ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం దుబాయ్ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించడం. అదే సమయంలో అక్కడ నివసిస్తున్న వారికి తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను దుబాయ్‌కు తీసుకురావడానికి అదనపు ప్రోత్సాహాన్ని కల్పించడం కూడా దీని లక్ష్యం. ఇలా చేయడం ద్వారా మరింత మంది పర్యాటకులు దుబాయ్‌ను సందర్శించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు

Advertisement

దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక నగరాల్లో ఒకటిగా కొనసాగుతోంది. బుర్జ్ ఖలీఫా, పామ్ జుమైరా, దుబాయ్ మాల్, డెజర్ట్ సఫారీ, అద్భుతమైన బీచ్‌లు లాంటి ఎన్నో అద్భుతమైన ఆకర్షణలు ఉన్నాయి. ప్రతి ఏడాది లక్షలాది మంది పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ‘దుబాయ్ ఇన్వైట్’ కార్యక్రమం ద్వారా అక్కడి నివాసితులు తమ బంధువులను ఆహ్వానించి, నగర విశిష్టతను చూపించే అవకాశంతో పాటు విలువైన బహుమతులు కూడా పొందనున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే సంబంధిత అర్హత నిబంధనలు, నమోదు ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలి. అన్ని నిబంధనలను పాటించిన వారికి మాత్రమే ఈ రివార్డులు వర్తిస్తాయి. మొత్తానికి, దుబాయ్‌లో నివసిస్తున్న వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపే అవకాశం లభిస్తే, మరోవైపు వేల దిర్హామ్‌ల విలువైన బహుమతులు కూడా పొందే అవకాశం ఉంది. ఈ కొత్త కార్యక్రమం దుబాయ్‌లోని ప్రవాసులు, స్థానికుల్లో మంచి ఆసక్తిని కలిగిస్తోంది.

Read Also: భారత్ లో ఎడమ వైపు, అమెరికాలో కుడివైపు.. వాహనాలు నడిపే విధానంలో ఎందుకీ తేడా?

Related News

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!

నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

నల్లగొండలో హైటెక్ బస్టాండ్.. ఏకంగా రూ. 54 కోట్లతో నిర్మాణం!

హోస్టెస్, వైఫై, టాయిలెట్.. ఈ ఆర్టీసీ బస్సును చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Big Stories

Advertisement
×