E-Paper
Advertisement

నేషనల్ అవార్డు విమర్శలపై ధనుష్ సంచలన వ్యాఖ్యలు!

నేషనల్ అవార్డు విమర్శలపై ధనుష్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Dhanush:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush)ఒకవైపు హీరోగా, మరొకవైపు దర్శకుడిగా, నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యల వల్ల విమర్శలు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ధనుష్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో 2 నేషనల్ అవార్డులతో సత్తా చాటారు. ముఖ్యంగా ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలో నటనకు గానూ ధనుష్ కి స్పెషల్ మెన్షన్ అవార్డు లభించగా.. మరొకటి ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాయన్’ కు ఉత్తమ తమిళ చిత్రంగా నేషనల్ అవార్డు లభించింది. ఇకపోతే రాయన్ సినిమాకు నేషనల్ అవార్డు ప్రకటించడం పై చాలా మంది పెదవి విరిచారు. మహారాజా , సత్యం సుందరం లాంటి సినిమాలను పక్కనపెట్టి.. రాయన్ మూవీను ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

నేషనల్ అవార్డు విమర్శలపై స్పందించిన ధనుష్..

అంతటితో ఆగకుండా మిగతా హీరోల సినిమాలతో పోల్చుతూ ప్రశ్నించారు. అందులో భాగంగానే తంగలాన్ చిత్రంలో విక్రమ్ కంటే కెప్టెన్ మిల్లర్ లో ధనుష్ గొప్పగా నటించారా? అంటూ వాదించారు. ఇలా తనకు రెండు నేషనల్ అవార్డులు లభించడం పై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలకు ధనుష్ తాజాగా స్పందించారు. జూలై 26వ తేదీన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధనుష్ బహిరంగంగా నేషనల్ అవార్డుల వివాదంపై మాట్లాడారు.

రాయన్ కంటే గొప్ప చిత్రాలు వున్నాయి..

Advertisement

ధనుష్ మాట్లాడుతూ..” 2024లో నా దర్శకత్వంలో రూపొందిన రాయన్ కంటే కూడా బలమైన చిత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ ఒకే ఏడాది ఒక తమిళ్ నటుడు ఏకంగా 2 నేషనల్ అవార్డ్స్ ను ఇంటికి తీసుకొచ్చాడు అనే విషయాన్ని కూడా విమర్శకులు అభినందించాలి. గతంలో నేను నటించిన ఎన్నో సినిమాలకు నేషనల్ అవార్డు వస్తాయని అన్నారు. కానీ వాటికి రాలేదు. రాయన్ చిత్రానికి నాకు నేషనల్ అవార్డు లభించింది. ఆ సంవత్సరంలో కచ్చితంగా ఆ సినిమా కంటే మెరుగైన చిత్రాలు ఉన్నాయి. అభిమానులు ఈ సినిమాపై తమ ప్రేమను వ్యక్తపరిచారు. అయితే నేను వారిని పూర్తిగా గౌరవిస్తున్నాను. నిజానికి నేను చాలా కాలం క్రితం నటించిన ‘అధు ఒరు కన కాలం’ సినిమాకి తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుందని అన్నారు. ఆ సమయంలో నేను చాలా చిన్నవాడిని.

ALSO READ:మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. ఫ్యాన్స్ అసహనం!

విమర్శించకండి.. సెలెబ్రేట్ చేసుకోండి..

Advertisement

కాబట్టి నేను కూడా నేషనల్ అవార్డు ఆశించాను. కానీ రాలేదు. ఆ తర్వాత కర్ణన్, వడ చెన్నై, మాయక్కం ఎన్న , మరియాన్ , రాంఝానా ఇలా ఎన్నో మంచి మంచి సినిమాలకు నేషనల్ అవార్డు వస్తుందని నేను ఆశించాను. కానీ రాలేదు.. నిజానికి మీరు ఎంత కష్టపడినా సరే కొన్ని విషయాలు వాటంతటవే జరిగిపోతాయి. ఇప్పుడు నా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. నాకు అవకాశం లభించింది. సినిమా ఎలా వచ్చింది అనే దానితో సంబంధం లేదు. నేను దానికోసం చాలా కష్టపడ్డాను. ఒక తమిళ వ్యక్తిగా నేను రెండు నేషనల్ అవార్డులు అందుకున్నాను. దానిని అంత తేలికగా తీసి పారేయకండి.. ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోండి” అంటూ ధనుష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి

Related News

పొలిమేర3 లోకి అడుగుపెడుతున్న యాక్షన్ కింగ్.. వీడియో వైరల్!

మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. ఫ్యాన్స్ అసహనం!

నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?

జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారా.. చెన్నై లవ్ స్టోరీ టీమ్ పై నెటిజన్స్ ఫైర్!

సినిమా తీయాలి.. గివ్ అవేలు ఇవ్వాలి.. ఏమీ టైం సర్ ఇది.. ఏమీ ప్రమోషన్!

రూ.కోటి విలువ చేసే టికెట్లు ఫ్రీగా పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!

గౌతమ్ హీరోగా ఇండస్ట్రీ ఎంట్రీ అప్పుడే.. జయకృష్ణ క్లారిటీ!

Big Stories

Advertisement
×