E-Paper
Advertisement

Italy: ఇటలీ ట్రిప్ కు వెళ్తున్నారా? అక్కడ ఈ పనులు చేశారో చిక్కుల్లో పడ్డట్లే!

Italy: ఇటలీ ట్రిప్ కు వెళ్తున్నారా? అక్కడ ఈ పనులు చేశారో చిక్కుల్లో పడ్డట్లే!
Advertisement

Italy Travel Advisory: ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ ప్రదేశాల్లో ఇటలీ ఒకటి. శతాబ్దాల వారసత్వం, ఆధ్యాత్మికత ప్రదేశాలు  పర్యాటకులను ఆకట్టుకుంటాయి. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది సందర్శకులు వెళ్తుంటారు. అక్కడి ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు చూసి టూరిస్టులు ఎంజాయ్ చేస్తారు. అయితే, ఇటలీలో పర్యాటకులు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు ఉన్నాయి. సో, ఇటలీ టూర్ కు వెళ్తున్న ప్రతి ఒక్కరు ఈ విషయాలు తెలుసుకొని మసులుకోవాలి. లేదంటే, ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది.

ఇటలీలో పర్యాటకులు చేయకూడని పనులు

ఇటలీకి వెళ్లేవారు అక్కడ కొన్ని పనులు చేయకపోవడం మంచిది. ఇవి స్థానిక సంస్కృతి, నియమాలు, గౌరవాన్ని కాపాడటానికి సహాయపడతాయి.

Advertisement

⦿ చర్చిలు, మతపరమైన స్థలాల్లో తగని దుస్తులు ధరించకండి: ఈ ప్రదేశాల్లో నిండైన వస్తువులను ధరించడం మంచిది. షార్ట్స్, స్లీవ్‌ లెస్ టాప్స్ ధరించి ప్రవేశించకూడదు. అలా వెళ్తే లోపలికి రానివ్వరు.

⦿ ప్రసిద్ధ ల్యాండ్‌ మార్క్స్ దగ్గర తినకండి, కూర్చోకండి: రోమ్‌ లో స్పానిష్ స్టెప్స్, వెనిస్‌ లో వంతెనలు, స్టెప్స్‌ పై కూర్చోవడం, తినడం నిషేధం. అలా చేస్తే జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

Advertisement

⦿ టూరిస్ట్ ట్రాప్ రెస్టారెంట్లలో తినకండి: ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఉండే రెస్టారెంట్లో నాణ్యత తక్కువ ఫుడ్స్ దొరికే అవకాశం ఉంటుంది. కొద్దిగా దూరంగా వెళ్లి స్థానికులు తినే చోట్ల తినడం మంచిది.

⦿ కాపుచినోను మధ్యాహ్నం తర్వాత ఆర్డర్ చేయకండి: ఇటాలియన్లు ఉదయం మాత్రమే కాపుచినో తాగుతారు. మధ్యాహ్నం ఎస్ప్రెస్సో తాగడం మంచిది.

⦿ వాటిని ఆర్డర్ చేయకండి: స్పఘెట్టి మీట్‌బాల్స్, ఫెట్టుచిని ఆల్ఫ్రెడో ఆర్డర్ చేయకండి. ఇవి అమెరికన్ వెర్షన్లు. ఇటలీలో ఒరిజినల్స్ వి ఉండవు. టూరిస్ట్ మెనూలలో మాత్రమే ఉంటాయి.

⦿ ట్రెవీ ఫౌంటైన్: ఈ ప్రాంతాల్లో నాణేలు తప్ప ఏమీ వేయకండి. ఇది చట్టవిరుద్ధం. జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

⦿ వీధుల్లో నడుస్తూ తినకండి, తాగకండి: ఇటాలియన్లు వీధుల్లో నడుస్తూ తినడం, తాగడం చేయరు. కూర్చుని భోజనం చేయాలి. డ్రింక్స్ తీసుకోవాలి.

⦿ రెస్టారెంట్‌లో టిప్ ఇవ్వకండి: సర్వీస్ ఛార్జీ బిల్లులో ఉంటుంది. అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు.

⦿ బ్రెడ్‌ను పాస్తాతో డిప్ చేసి తినకండి: సాస్‌ను బ్రెడ్‌తో తుడుచుకోవడం ఒక్కోసారి ఓకే, కానీ చేతులతో కాకుండా ఫోర్క్‌ తో రుద్దడం మంచిది.

⦿ధరలు ఎక్కువగా ఉన్న వస్తువులు కొనకండి: ఫేక్ బ్రాండ్స్ లేదా టూరిస్ట్ సౌవెనిర్లు కొనకండి.

⦿ చెత్తను పడేయకండి: లిట్టరింగ్ నిషేధం. ఇటలీలో వేస్ట్ సార్టింగ్ తప్పనిసరి.

⦿ ఆగస్టులో హాట్‌ స్పాట్‌లకు వెళ్లకండి: చాలా దుకాణాలు మూసివేస్తాయి, టూరిస్ట్‌లు మాత్రమే ఉంటారు.

⦿ పావురాలకు ఫుడ్ వేయకండి: వెనిస్‌ లో పావురాలకు గింజలు వేయకూడదు. అలా చేస్తే భారీ జరిమానా విధించబడుతుంది.

⦿ స్విమ్ సూట్స్ వేసుకోకండి: పలు తీరప్రాంత పట్టణాలు బీచ్‌కు దూరంగా ఇసుక కోటలు నిర్మించడం,  స్విమ్‌సూట్‌లు ధరించడం నిషేధించ బడ్డాయి.

ఈ నిబంధనలు చారిత్రాత్మక ప్రాంతాలు, పబ్లిక్ ప్లేసెస్ లో భద్రత కోసం నిర్ణయించారు. ఈ నియమాలు పాటిస్తే మీ ట్రిప్ మరింత హ్యాపీగా కొనసాగుతుంది. స్థానికుల నుంచి మంచి గౌరవం లభిస్తుంది.

Read Also: 580 అడుగుల ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్ హోటల్, దుబాయ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్!

Related News

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

Big Stories

Advertisement
×