E-Paper
Advertisement

Aircraft Hotel: 580 అడుగుల ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్ హోటల్, దుబాయ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్!

Aircraft Hotel: 580 అడుగుల ఎత్తులో ఎయిర్ క్రాఫ్ట్ హోటల్, దుబాయ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్!
Advertisement

Emirates Air Hotel Dubai: అద్భుతమైన కట్టడాలకు కేరాఫ్ గా మారిన దుబాయ్ లో మరో అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణానికి రెడీ అవుతోంది. దుబాయ్ దిగ్గజ కంపెనీ ఎమిరేట్స్ ఎయిర్ క్రాఫ్ట్ హోటల్ ను నిర్మించబోతోంది. ఎమిరేట్స్ ఎయిర్ హోటల్ పేరుతో దుబాయ్ లో భారీ లగ్జరీ హోటల్ టవర్ ను నిర్మించాలని భావిస్తోంది. ఈ కట్టడానికి సంబంధించి ఇటీవల వైరల్ అయిన కొత్త కాన్సెప్ట్ ప్రాజెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికలిగించింది. ఈ టవర్ టాప్‌ లో పూర్తి సైజ్ ఎమిరేట్స్ ఎయిర్ బస్   A380 విమానన్నిఇన్‌ స్టాల్ చేసి హోటల్ భాగంగా మార్చాలని ప్లాన్ చేశారు.

ఎమిరేట్స్ ఎయిర్ హోటల్ గురించి..  

⦿ ఎత్తు: ఎమిరేట్స్ ఎయిర్ హోటల్  580 మీటర్ల ఎత్తుతో 125 అంతస్తులను కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్స్‌ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకోనుంది.

Advertisement

⦿ ప్రాజెక్ట్ అంచనా వ్యయం: సుమారు $3 బిలియన్.. భారతీయ కరెన్సీలో రూ. 25,000 కోట్లుకు పైగా ఖర్చు అవుతుంది.

⦿ స్పెషల్ ఫీచర్: టవర్ టాప్‌లో ఉండే A380 విమానంలో కాక్‌ పిట్ బార్, డైనింగ్ ఏరియాలు, వింగ్స్ మీద గ్లాస్ బాటమ్ వాక్‌ వేలు ఉంటాయి. ప్రపంచ స్థాయి రెస్టారెంట్లు, అల్ట్రా-లగ్జరీ సూట్‌లు, స్కై బార్, విశ్రాంతి స్థలాలు ఉంటాయి. దుబాయ్ స్కైలైన్ 360° వ్యూ కనిపిస్తుంది.

Advertisement

⦿ ఇతర ఫెసిలిటీస్: ఫస్ట్ క్లాస్ స్టైల్ లౌంజ్, వింగ్ టిప్‌ లో నైట్‌ క్లబ్,  డే టైమ్‌ లో హెలిప్యాడ్, అల్ట్రా ప్రీమియం రూమ్స్,  సూట్స్ అందుబాటులో ఉంటాయి.

⦿ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి: ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కేవలం ప్రతిపాదన(ప్రపోజల్) స్టేజ్‌ లోనే ఉంది. కానీ, దుబాయ్  రికార్డ్ బ్రేకింగ్ ఆర్కిటెక్చర్ స్టైల్‌ లో త్వరలో నిర్మాణం స్టార్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Read Also: వందే భారత్ రైళ్లలో లోకల్ ఫుడ్స్, ఇక లొట్టలేసుకుంటూ తినేయొచ్చు!

మొత్తంగా దుబాయ్ లో ఎప్పటి లాగే ఈ ఎమిరేట్స్ ఎయిర్ హోటల్ మరో క్రేజీ, అద్భుతమైన ప్రాజెక్ట్ గా గుర్తింపు తెచ్చుకోబోతోంది. ఏవియేషన్ తో పాటు లగ్జరీని కలిపిన యూనిక్ ఐడియా ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోబోతోంది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. నిర్మాణం ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుంది? అనే పూర్తి వివరాలను ఎమిరేట్స్ సంస్థ ప్రకటించనుంది.

Read Also: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×