E-Paper
Advertisement

ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిన విమానం.. ఐదుగురు మృతి, 250 విమాన సర్వీసులపై ప్రభావం

ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిన విమానం.. ఐదుగురు మృతి, 250 విమాన సర్వీసులపై ప్రభావం
Advertisement

America: అమెరికాలో మయామి అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే సమీపంలో ఓ కార్గో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఘటన సమయంలో ఆ ప్రాంతం నుంచి దట్టమైన పొగ పైకి లేవడం కనిపించింది. అన్ని రన్‌వేలు మరియు టాక్సీవేలను మూసివేశారు. ఘటన వెనుక అసలు ఏం జరిగింది?

మియామి ఎయిర్ పోర్టులో కూలిన విమానం

అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మయామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ అవుతున్నప్పుడు అమెజాన్ ప్రైమ్‌కి చెందిన ఎయిర్ కార్గో విమానం కూలిపోయింది. రన్‌వే దాటి వెళ్లి విమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. ఘటన సమయంలో సదరు విమానం.. పలు వాహనాలను ఢీ కొట్టింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున పొగ, మంటలు వ్యాప్తించాయి. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మయామి-డేడ్ కౌంటీ అధికారులు తెలిపారు. మరణించినవారు విమానంలో ఉన్నారా? విమానం ఢీ కొన్న వాహనాల్లో ఉన్నారా? అనేది ఇప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుందన్నారు.

ప్రమాదానికి గురైన అమెజాన్ ప్రైమ్‌కి చెందిన ఎయిర్ కార్గో

Advertisement

ఘటన తర్వాత కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ చిక్కుకుపోయారు. అలాగే కార్లలోని కొందరు ప్రయాణికులు చిక్కుకుపోయారని మయామి-డేడ్ రెస్క్యూ ఫైర్ చీఫ్ రే జడల్లా తెలిపారు. ఘటన సమయంలో ఆ ప్రాంత సమీపంలో ఉరుములతో కూడిన వర్షాలు, గంటకు 30 మైళ్ల వేగంతో గాలులు నమోదయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు కార్గో విమానం విమానాశ్రయ రన్‌వేను వంకరగా దాటి వాయువ్య మూలలో ఆగిపోయింది. ఈ ప్రమాదం తర్వాత ఆ విమానం తిరిగి టేకాఫ్ కావడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన తర్వాత విమానం నుండి ఇంధనం లీక్ అవ్వడాన్ని సిబ్బంది గుర్తించారు. అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.

ఐదుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు

ఈ ప్రమాదం నేపథ్యంలో నిత్యం రద్దీగా ఉండే మయామి విమానాశ్రయంలో రోజంతా విమాన కార్యకలాపాలకు తీవ్రం అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఒక్కరోజు సుమారు 250 విమానాలు ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన తర్వాత విమానాశ్రయంలోని అన్ని రన్‌వేలు, టాక్సీవేలను మూసివేయడంతో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్- FAA తెలిపింది.

Advertisement

ALSO READ: 120 కిమీ స్పీడ్ ట్రయల్ సక్సెస్.. ఇక 110 కిమీ వేగంతో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ ట్రైన్!

నార్త్ కరోలినాకు చెందిన కార్గో క్యారియర్ విమానం. ఫ్లైట్-ట్రాకింగ్ సైట్ ఫ్లైట్‌రాడార్24 ప్రకారం.. తొలుత బోయింగ్ 767 విమానాన్ని మొదట ప్రయాణికులను తీసుకువెళ్లడానికి నిర్మించారు. 2015లో దీనిని కార్గో విమానంగా మార్చడానికి ముందు రెండు దశాబ్దాలకు పైగా అనేక విమానయాన సంస్థల్లో సేవలు అందించింది. తాము ఏ దర్యాప్తుకైనా సహకరిస్తామని అమెజాన్ ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

Related News

120 కిమీ స్పీడ్ ట్రయల్ సక్సెస్.. ఇక 110 కిమీ వేగంతో పరుగులు పెట్టనున్న హైడ్రోజన్ ట్రైన్!

జస్ట్.. రూ.30 వేలకే రౌండ్ ట్రిప్.. ఈ 3 దేశాలు భలే చీప్!

నదిని క్లీన్ గా మార్చేశాడు, తన తలరాత మార్చే జాబ్ ఆఫర్ కొట్టేశాడు!

ప్రకృతి అందాల నడుమ రైలు ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన జర్నీస్ ఇవే!

హైదరాబాద్ దగ్గరల్లోనే బెస్ట్ వీకెండ్ స్పాట్స్.. ఫ్రెండ్స్ తో వెళ్తే సూపరో సూపరు!

తీరొక్క గణనాథులకు కేరాఫ్.. ధూల్ పేట్ లో అడుగు పెడితే ధూమ్ ధామే!

వినాయకుడి నిమజ్జనమే కాదు.. ఆగమనమూ రచ్చే! తెలంగాణలో వైరల్ అవుతున్న కొత్త ట్రెండ్!

Big Stories

Advertisement
×