Intinti Ramayanam Today Episode September 7th : భానుమతి తన కొడుకు వస్తున్నాడు అని చాలా సంతోషంగా ఉంటుంది. తన కొడుకుతో ఎప్పుడు మాట్లాడదామని సంతోషంగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్లకి చెప్తే పలు చాలా బాధపడిపోతారు అని భానుమతికి కూడా నిజం చెప్పకుండా దాచి పెట్టాలని అనుకుంటారు. ఏంటి మీరంతా అలా అన్నారు ఎవరు చనిపోయినట్టు ఎవరైనా చనిపోయారా అని అడుగుతుంది. భానుమతి కి నిజంగానే అనుమానం మొదలైందేమో అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అవని మాత్రం అదేమీ లేదు అమ్మమ్మ గారు ఎవరికీ ఏమీ కాలేదు అని అబద్ధం చెప్తుంది. కానీ భానుమతికి మాత్రం అనుమానం ఇంకాస్త పెరుగుతుంది.. ఎందుకు అందరూ బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు ఏమైంది అని భానుమతి ఎంత అడిగినా సరే ఎవరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలిచిన చూస్తూ ఉండిపోతారు. పల్లవి మాత్రం ఇంట్లో ఈ విషయం తెలిస్తే అందరూ చచ్చిపోతారు నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటుంది..
శ్రియ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు శ్రీ నాకు చాలా బాధగా ఉంది.. మావయ్య గారు ఎప్పుడు నాకు మంచిగా ఉండాలని సలహాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇలా చనిపోయారు అంటే నేనే ఎక్కువ బాధ తట్టుకోలేకపోతున్నాను. నేను కడుపుతో ఉన్న విషయం అలాగే బాబు పుట్టిన విషయం కూడా ఆయనకు తెలియదు. నాకు పుట్టిన బాబుకి ఆయన పేరే పెట్టామని తెలిస్తే సంతోషపడతారని అనుకున్నాను. కానీ ఇప్పుడు చనిపోతారని నేను అస్సలు ఊహించలేదు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోతున్నాను అని శ్రియ బాధ పడిపోతుంది. అటు శ్రీకర్ కూడా మా నాన్నని ఎప్పుడు ఇలా ఊహించుకోలేదు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని తను కూడా చాలా బాధపడిపోతాడు. వీళ్ళిద్దరి ఎమోషనల్ సీన్స్ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది..
భానుమతి పార్వతి ఇద్దరూ కూడా రాజేంద్రప్రసాద్ వస్తాడని 1000కలతో ఎదురుచూస్తూ ఉంటారు.. నా కొడుకు వస్తున్నాడు అంటే పార్వతీ నాకు చాలా సంతోషంగా ఉంది ఇన్ని రోజులు వాడు నాకు దూరంగా ఉన్నాడు. వాడు ఎన్ని రోజుల తర్వాత వస్తున్నాడు కాబట్టి నా చేతులతోనే నేను వాడికి తినిపిస్తాను అంటూ భానుమతి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది.. అటు ఆరాధ్య కూడా తాతయ్య వస్తే తాతయ్యతో నేను ఇలా ఉంటాను అలా ఉంటాను అని చెప్తూ ఉంటుంది.. అదేవిధంగా పార్వతి కూడా ఆయనని చూడక ఒంటరిగా ఉండలేక చాలా రోజులు నరకాన్ని అనుభవించాను అని బాధ పడిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చినా మీనాక్షి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని వస్తుంది.. పార్వతీ చక్ర పొంగలి చేయమని అడిగితే మీనాక్షి చాలా బాధపడిపోతుంది. వాళ్లకి నిజం చెప్పలేక తనలో తానే నరకాన్ని అనుభవిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనాక్షి. అవని వాళ్ళు వస్తూనే మీనాక్షి తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఏడ్చేస్తుంది.
పార్వతి ఏమైంది మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఏమైనా జరిగిందా? ఎవరికైనా ఏదైనా అయదా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. పార్వతి ఏమైంది మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఏమైనా జరిగిందా? ఎవరికైనా ఏదైనా అయిందా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. తన తల్లికి నిజం తెలిస్తే తట్టుకోలేదు తండ్రిని కోల్పోయిన మాకు తల్లి కూడా మిగలదు అని అందరూ చాలా బాధపడిపోతూ ఉంటారు. పార్వతి ఆ మాట అడగగానే కమల్ కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి కాళ్లు పట్టుకుంటాడు. ఏమైంది కమల్ ఎందుకు అలా అన్నావ్ ఏం జరిగింది? మీ నాన్నని తీసుకొని వస్తారని వెళ్లారు కదా మరి అందరూ ఊరికే వచ్చారు ఎక్కడ మీ నాన్న ఎప్పుడు వస్తాడు ఇవాళ వస్తాడా లేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే భానుమతికి కూడా అనుమానం రావడంతో కమల్ నిజం చెప్పబోతాడు. కానీ అవని కమల్ని కంట్రోల్ చేసే లోపల పంపిస్తుంది.. పల్లవి మాత్రం ఈ నిజాన్ని ఎలాగైనా తన అత్తయ్యకి చెప్పి ఇంట్లో వాళ్లకి పార్వతిని కూడా దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. పార్వతికి ఎలాగైనా సరే నిజం తెలియకుండా చేయాలి అని అవని అనుకుంటుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా పార్వతిని చూసి బాధ పడిపోతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :క్రిస్మస్ బరిలో దాదా VS కింగ్ 100.. నందమూరి – అక్కినేని హీరో పోరు..