E-Paper
Advertisement

హైదరాబాద్‌ కు వచ్చిన జపాన్.. మిస్ అయితే మళ్లీ దొరకదు!

హైదరాబాద్‌ కు వచ్చిన జపాన్.. మిస్ అయితే మళ్లీ దొరకదు!
Advertisement

Japan Comes to Hyderabad: జపాన్ సంస్కృతి, సంప్రదాయాలు విదేశీయులను బాగా ఆకట్టుకుంటాయి. అందుకే, ఏటా లక్షలాది మంది మంది జపాన్ లో పర్యటిస్తూ అక్కడి ఫుడ్ టేస్ట్ చేయడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంజాయ్ చేయడం, వినోదాన్ని పొందుతూ ఆహ్లాదంగా గడుపుతారు. అయితే, జపాన్ వెళ్లాలంటే, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అలాంటి వారి కోసం ఇప్పుడు జపానే ఏకంగా హైదరాబాద్ కు వచ్చేసింది. నమ్మడం లేదా? అయితే, మీరు అర్జంట్ గా కూకట్ పల్లికి వెళ్లాల్సిందే.

నెక్సస్ మాల్‌ లో ‘హలో జపాన్’ ఫెస్టివల్  

ఈ వీకెండ్ లో హైదరాబాద్ వాసులకు జపాన్ సంస్కృతిని దగ్గరగా చూసే అరుదైన అవకాశం లభించనుంది. జూలై 25, 26 తేదీల్లో కూకట్‌ పల్లిలోని నెక్సస్ హైదరాబాద్ మాల్‌ లో ‘హలో జపాన్’ పేరుతో ప్రత్యేక ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జపాన్‌ కు వెళ్లాలనే ఆసక్తి ఉన్నవారు, ఆ దేశ సంస్కృతి, ఆహారం, వినోదం గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ కార్యక్రమం మంచి ఎక్స్ పీరియెన్స్ అందించనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు ప్రవేశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. కుటుంబ సభ్యులు, పిల్లలు, యానిమేషన్ అభిమానులు, ఫుడ్ లవర్స్‌ తో పాటు అన్ని వయసుల వాళ్లు ఈ వేడుకను ఆస్వాదించవచ్చు.

స్పెషల్ అట్రాక్షన్ గా జపనీస్ ఫుడ్ జోన్

Advertisement

ఈ ఫెస్టివల్ లో ప్రధాన ఆకర్షణ జపనీస్ ఫుడ్ జోన్. ఇక్కడ జపాన్‌ కు చెందిన ప్రసిద్ధ వంటకాలను రుచి చూసే అవకాశం ఉంటుంది. తాజాగా తయారుచేసే సుషీ, మాచా స్వీట్లు, మరెన్నో సంప్రదాయ జపనీస్ వంటకాలు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. జపాన్ రుచులను ఒకే చోట అనుభవించాలని భావించే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.

ఎంటర్ టైన్ మెంట్ ఈవెంట్స్ కూడా..

ఫుడ్ తో పాటు జపాన్ సంస్కృతిని పరిచయం చేసే పలు కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇంటరాక్టివ్ వర్క్‌ షాప్‌ల ద్వారా జపనీస్ కళలు, సంప్రదాయాలు, లైఫ్ స్టైల్ మీద అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శనలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. జపాన్ సంస్కృతి వైవిధ్యాన్ని దగ్గరగా చూసే అవకాశం ఈ కార్యక్రమంలో లభిస్తుంది.

షాపింగ్ లవర్స్ కోసం జపనీస్ ఫ్లీ మార్కెట్‌

Advertisement

షాపింగ్ ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా జపనీస్ ఫ్లీ మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో జపాన్ స్ఫూర్తితో రూపొందించిన బహుమతులు, అలంకరణ వస్తువులు, కలెక్షన్ ఐటమ్స్, హస్తకళ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకమైన జ్ఞాపికలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి వేదికగా నిలవనుంది.

మాల్ అంతా జపాన్ అందాలతో సందడి!

మాల్ మొత్తం జపాన్ వాతావరణాన్ని గుర్తు చేసేలా అలంకరించనున్నారు. చెర్రీ బ్లోసమ్ థీమ్ డెకరేషన్లు, ఆకట్టుకునే ఇన్‌స్టాలేషన్‌లు, ఫోటోలకు అనువైన ప్రత్యేక సెటప్‌లు సందర్శకులను ఆకట్టుకోనున్నాయి. అలాగే జపనీస్ థీమ్‌ తో రూపొందించిన ఫోటో బూత్‌లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అందమైన ఫొటోలు దిగే అవకాశం కూడా ఉంటుంది.ఈ ఫెస్టివల్ లో మరో ప్రత్యేక ఆకర్షణ కామెన్ రైడర్. జపాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సూపర్ హీరో పాత్రను ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఉంటుంది. 1971లో మొదలైన కామెన్ రైడర్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. పిల్లలతో పాటు పెద్దలు, యానిమే అభిమానులు కూడా ఈ హీరోతో ఫొటోలు దిగుతూ ప్రత్యేక అనుభూతిని పొందవచ్చు.

పిల్లల కోసం కూడా పలు సరదా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కొత్త సంస్కృతిని ఆటలు, వినోద కార్యక్రమాల ద్వారా వారికి పరిచయం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఒకరోజంతా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది.

Read Also: రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?

Related News

ఏసీ కోచ్‌లో రెండు బెడ్ షీట్లు ఎందుకు ఇస్తారు? అసలు కారణం ఇదే!

రాగాలు పలికే రాళ్లు.. నల్లగొండలోని ఈ వింత ప్రదేశం గురించి తెలుసా?

ఇదేందయ్యా ఇది.. ఇక్కడ కారు నడిపితే, ఆకాశంలో తేలినట్లే.. నెవర్ బిఫోర్ రోడ్డు!

గోల్డెన్ కలర్ పాముల సామ్రాజ్యం.. అందమైన ఆ దీవి మనుషుల పాలిట డెత్ ట్రాప్‌గా ఎలా మారింది?

953 కిటికీలతో పురాతన టెక్నాలజీ రాజభవనం.. శ్రీ కృష్ణుడి మకుటంలాంటి ఆకారం..విదేశీ పర్యటకుల ఫేవరెట్

మౌంట్ ఎవరెస్ట్‌ పై వందల మృతదేహాలు.. వాటిని ఎందుకు తీసుకురారు?

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. లగేజీ బుకింగ్ ఇక మరింత ఈజీ!

Big Stories

Advertisement
×