E-Paper
Advertisement

Hyderabad Metro: మెట్రో ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్, ఇక లగేజీ అక్కడే పెట్టేసుకోవచ్చు!

Hyderabad Metro: మెట్రో ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్, ఇక లగేజీ అక్కడే పెట్టేసుకోవచ్చు!
Advertisement

Hyderabad Metro Smart Lockers: ప్రయాణీకులకు మెరుగైన ట్రావెల్ ఎక్స్ పీరియెన్స్ ను అందించేలా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. లగేజీతో ఇబ్బందులు పడకుండా అద్భుతమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. టక్కీస్ అనే కంపెనీతో కలిసి మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లను ఏర్పాటు చేసింది. తొలి దశలో భాగంగా ఏడు స్టేషన్లలో ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

హ్యాండ్స్ ఫ్రీ ట్రావెల్ కోసం కీలక నిర్ణయం!

మెట్రో ప్రయాణం చేసే సమయంలో చాలా మంది బ్యాగులు, ఇతర సంచులతో ఇబ్బంది పడుతుంటారు. వాటిని భుజానికి తగిలించుకుని మెట్రోల్లో తిరిగితే చిరాకు అనిపించినా, తప్పని పరిస్థితుల్లో మోసుకెళ్లారు. ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదనే హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. తమ సామాన్లను మెట్రో స్టేషన్లలో సేఫ్ గా పెట్టుకుని జర్నీ చేసే వెసులుబాటు కల్పిస్తోంది. ఇందుకోసం తాజాగా స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సింపుల్ గా లాకర్లను ఉపయోగించుకోవచ్చు!

Advertisement

మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్మార్ట్ లాకర్లను ప్రయాణీకులు సులభంగా ఉపయోగించుకోవచ్చిన టక్కీస్ కంపెనీ వెల్లడించింది. జస్ట్ 30 సెకెన్లలో తమ సామన్లను భద్రపరుచుకోవచ్చని చెప్పింది. సామాను సైజును బట్టి లాకర్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఎంతసేపు ఉంచాలనుకుంటున్నారో అంచనా వేసుకుని ఆన్ లైన్ పేమెంట్ చేసెయ్యొచ్చు. లాకర్ ప్యానెల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి, తమ సామాన్ల లోపల భద్రపరుచుకోవాలి. ఈ లాకర్లలో వివిధ రకాల వ్యక్తిగత వస్తువులు, హెల్మెట్లు, సామాన్లు, బ్యాక్‌ ప్యాక్‌లు,  షాపింగ్ బ్యాగులను పెట్టుకోవచ్చు. లాకర్ ప్యానెల్ మీద ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి.. సామాను సైజును బట్టి లాకర్ పరిమాణాన్ని ఎంచుకోవాలి. ఎంతసేపు దాచుకుంటున్నారో టైం సెలెక్ట్ చేసుకొని డిజిటల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

స్మార్ట్ లాకర్ సౌకర్యం ఉన్న మెట్రో స్టేషన్లు

⦿ మియాపూర్

Advertisement

⦿ అమీర్‌పేట్

⦿ పంజాగుట్ట

⦿ ఎల్బీ నగర్

⦿ ఉప్పల్

⦿ పరేడ్ గ్రౌండ్

⦿ హైటెక్ సిటీ

టక్కిట్ స్మార్ట్ లాకర్లు ఈ ఏడు హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి వచ్చాయి.  ప్రయాణికులు మూడు సాధారణ, డిజిటల్ స్టెప్స్ ద్వారా లాకర్లను యాక్సెస్ చేయవచ్చు.

ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యం కోసం

తాజాగా ఉప్పల్  స్టేషన్‌ లో స్మార్ట్ లాకర్ సర్వీసులను ప్రారంభించిన ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈఓ కే.వి.బి. రెడ్డి..  ప్రయాణికులకు రోజువారీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. తొలి విడుదలతో భాగంగా రద్దీ ఎక్కువగా ఉండే ఏడు మెట్రో స్టేషన్లలో ఈ స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో అన్ని స్టేషన్లకు విస్తరిస్తామన్నారు.

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×