E-Paper
Advertisement

Ticket Refund: రైలు మిస్ అయ్యిందా? సింపుల్ గా టికెట్ రీఫండ్ పొందండిలా!

Ticket Refund: రైలు మిస్ అయ్యిందా? సింపుల్ గా టికెట్ రీఫండ్ పొందండిలా!
Advertisement

Indian Railway TDR Fileing Rules: అనుకోని కారణాలతో కొంత మంది రైళ్లు మిస్ అవుతారు. అలాంటి వారు రీఫండ్ పొందే అవకాశం కల్పిస్తుంది ఇండియన్ రైల్వే. ఇందుకోసం టికెట్ డిపాజిట్ రిసీప్ట్(TDR) అనే విధానాన్ని అమలు చేస్తుంది. ఈ విధానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఎన్ని రోజుల్లోగా రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

TDRను ఎప్పుడు ఫైల్ చేయాలంటే?

మీరు బోర్డింగ్ స్టేషన్‌ లో రైలు ఎక్కలేకపోతే లేదంటే ప్రయాణించకపోతే, రైలు షెడ్యూల్ చేసిన గంట లోగా TDR దాఖలు చేయవచ్చు. రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం కావడం, మీరు రైలు ప్రయాణం చేయకూడదని భావిస్తే TDR ఫైల్ చేసుకోవచ్చు. పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది. మీ ఫస్ట్ రైలు ఆలస్యం కావడం వల్ల మీ కనెక్టింగ్ రైలును మిస్ అయితే, మొదటి రైలు కనెక్టింగ్ స్టేషన్‌ కు చేరుకున్న మూడు గంటల్లోపు మీరు TDRను దాఖలు చేయవచ్చు. అయితే, రెండు టికెట్లు ఒకే PNRను కలిగి ఉండాలి.  లేదంటే బుకింగ్ సమయంలో లింక్ చేయబడాలి. TDRను దాఖలు చేయడం వల్ల రీఫండ్‌ కు గ్యారెంటీ ఉండదు. జోనల్ రైల్వేలు రీఫండ్ నిబంధనల ఆధారంగా ప్రతి కేసును సమీక్షిస్తాయి. అనంతరం రీఫండ్ ఇవ్వాలో, వద్దో నిర్ణయిస్తాయి.

TDRను ఎలా ఫైల్ చేయాలంటే?

Advertisement

ఒకవేళ మీరు ఇ-టికెట్ కొనుగోలు చేస్తే..  రైల్వే అధికారిక వెబ్ సైట్ www.irctc.co.inని ఓపెన్ చేయాలి. లాగిన్ కావాలి. ముందుగా మౌ అకౌంట్ లోకి వెళ్లాలి. అనంతరం లావాదేవీలకు సంబంధించిన ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. బుకింగ్ టికెట్ హిస్టరీకి వెళ్లి PNRను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత TDR ఫైల్ చేయాలి. ఎందుకు TDR ఫైల్ చేయాల్సి వస్తుందో కారణాలు చెప్పాలి. ఆ తర్వాత సబ్ మిట్ చేయాలి. ట్రాకింగ్ కోసం TDR రిఫరెన్స్ నంబర్‌ ను సేవ్ చేసుకోవాలి. రీఫండ్ అనేది 60 నుంచి 90 రోజుల లోపు యాడ్ అవుతాయి.  ఒకవేళ కౌంటర్ లో టికెట్ తీసుకంటే బోర్డింగ్ స్టేషన్ లోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లాలి. రైలు బయల్దేరిన గంటలోకి వెళ్లాల్సి ఉంటుంది. మీ టికెట్ ను ఇచ్చి, TDR కోసం రిక్వెస్ట్ చేయాలి. మీకు రసీదు అందిస్తారు. టికెట్, TDR రసీదును గ్రూప్ జనరల్ మేనేజర్/IT, IRCTC, ఇంటర్నెట్ టికెటింగ్ సెంటర్, IRCA బిల్డింగ్, స్టేట్ ఎంట్రీ రోడ్, న్యూఢిల్లీ – 110055కు పంపించాలి. రీఫండ్‌ ఆమోదించబడితే, సుమారు 90 రోజుల్లో రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.

తాజా TDR రీఫండ్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

మిస్ అయిన రైళ్ల కోసం TDRను షెడ్యూల్ చేయబడి బయల్దేరిన గంటలోపు TDR ఫైల్ చేయాలి. మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, రైలు బయల్దేరే ముందు దాఖలు చేయాలి. ఒకవేళ మీరు రైలు బయల్దేరిన తర్వాత మీరు TDR సమర్పిస్తే రీఫండ్ రావు. రీఫండ్ కావాలంటే లింక్డ్ PNR తప్పనిసరి. మొదటి రైలు వచ్చిన మూడు గంటలలోపు TDR ఫైల్ చేయండి.

Advertisement

Read Also: తొలుత ఒకటి, తర్వాత ఎనిమిది.. వందేభారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Related News

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

Big Stories

Advertisement
×