E-Paper
Advertisement

Best selling Smartphones: ప్రపంచంలో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఫోన్లు ఇవే.. అగ్రస్థానంలో క్లాసిక్ ఫోన్

Best selling Smartphones: ప్రపంచంలో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ ఫోన్లు ఇవే.. అగ్రస్థానంలో క్లాసిక్ ఫోన్
Advertisement

World Best selling Smartphones| స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అన్ని బ్రాండ్స్ కొత్త మోడళ్లు లాంచ్ చేస్తున్నాయి. పాత మోడళ్లు త్వరగా పాతబడిపోతాయి. కానీ కొన్ని ఫోన్లు మినహాయింపు. అవి చరిత్ర సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ జాబితాలో అలాంటి ప్రసిద్ధ స్మార్ట్‌ఫోన్ల గురించి చూద్దాం.

నోకియా 1100: ఇప్పటికీ వన్నె తగ్గలేదు

నోకియా 1100 అన్నిటికీ రారాజు. 2003లో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల కంటే ఎక్కువ అమ్ముడయ్యాయి. సాధారణ డిజైన్, అద్భుతమైన మన్నిక దీని బలం. టార్చ్ లైట్, మెసేజింగ్ ఉన్నాయి. దీని కవర్ కేసు ధృడంగా ఉంటుంది. సామాన్యంగా పగలదు. పేద దేశాల్లో కోట్ల మందికి మొదటి మొబైల్ ఇదే. వర్షంలో తడిచినా, పడిపోయినా పనిచేస్తుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల పాత నోకియా ఫోన్లు కనిపిస్తాయి.

ఐఫోన్ 6 సిరీస్: పెద్ద స్క్రీన్ ప్రారంభం

Advertisement

2014లో ఆపిల్ కంపెనీ.. ఐఫోన్ 6 సిరీస్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మార్కెట్‌లో అప్పుడు సంచలనం. మొదటిసారి పెద్ద డిస్‌ప్లే కలిగిన ఐఫోన్ వచ్చింది. యువకులు ఆకర్షితులయ్యారు. మంచి కెమెరా, వేగవంతమైన ప్రాసెసర్, ప్రీమియం డిజైన్ ఉన్నాయి. ఈ ఫోన్ ద్వారానే ఆపిల్ కంపెనీ “షాట్ ఆన్ ఐఫోన్” క్యాంపెయిన్ పాపులారిటీ పెంచింది. ఈ ఫోన్ ఇప్పటివరకు 22 కోట్ల కంటే ఎక్కువ యూనిట్లు సేల్ అయ్యాయి. ఇప్పటివరకు అమ్ముడైన ఐఫోన్ మోడళ్లలో ఇదే టాప్.

నోకియా 1110: బడ్జెట్ రాజు

నోకియా 1110 మరో బెస్ట్ సెల్లింగ్ ఫోన్. డెవలపింగ్ దేశాల్లో బాగా అమ్ముడయ్యింది. నమ్మకమైన, సాధారణ ఫోన్ కావాలనుకునేవారికి పర్ఫెక్ట్. కాల్స్, మెసేజెస్, అలారం ఉన్నాయి. కెమెరా, ఇంటర్నెట్ లేవు. బ్యాటరీ లైఫ్ అద్భుతం. ఒకసారి ఛార్జ్ చేస్తే కొన్ని రోజుల పాటు నడుస్తుంది. బడ్జెట్ కస్టమర్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

ఐఫోన్ 11: బెస్ట్ సెల్లర్ కొత్త ఐఫోన్

Advertisement

2019లో వచ్చిన ఆపిల్ ఐఫోన్ 11 ప్రపంచంలో టాప్ సెల్లింగ్ ఫోన్. పవర్‌ఫుల్ చిప్, మెరుగైన కెమెరా కారణం. ఫేస్ ఐడీ, మంచి బ్యాటరీ లైఫ్ ఆకర్షణలు. ఉత్తర అమెరికా, యూరప్, ఇండియా మార్కెట్లలో బాగా పాపులర్. 2022 ప్రారంభం నాటికి 15.9 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఖరీదైన ఫీచర్లను తక్కువ ధరలో ఇచ్చింది.

శామ్‌సంగ్ గెలాక్సీ S4: ఫ్లాగ్‌షిప్ పవర్‌హౌస్

శామ్‌సంగ్ గెలాక్సీ S4 బెస్ట్ సెల్లింగ్ ఫ్లాగ్‌షిప్. 2013లో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. అమోలెడ్ డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఒక కాలంలో ప్రపంచంలోనే అత్యధిక అమ్మకాలు సాధించింది. పోటీ పెరిగినా, శామ్‌సంగ్‌కు బలమైన స్థానం తెచ్చింది.

ఈ ఫోన్లు మొబైల్ చరిత్రలో మరచిపోలేనివి. నోకియా సింపుల్ యూజ్‌తో, ఆపిల్ ప్రీమియం క్వాలిటీతో, శామ్‌సంగ్ అద్భుత టెక్నాలజీతో రాణించాయి. ఇప్పుడు కొత్త మోడళ్లు వస్తున్నా, ఈ పాత ఫోన్లు రికార్డులు బద్దలు కొట్టాయి.

Also Read: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×