E-Paper
Advertisement

అదిరిపోయే రైల్వే యాప్ వచ్చేసింది.. ఇక ఇంటి నుంచే పార్సిల్ పంపుకోవచ్చు!

అదిరిపోయే రైల్వే యాప్ వచ్చేసింది.. ఇక ఇంటి నుంచే పార్సిల్ పంపుకోవచ్చు!
Advertisement

South Central Railway’s RailParcel App: ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా పార్శిల్స్ ను ఈజీగా పంపుకునేలా రైల్ పార్శిల్ యాప్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఇప్పుడు ఇంటి నుంచే పార్సిళ్లను సులభంగా పంపించుకునే అవకాశం కల్పించింది . సాధారణంగా పార్సిల్ పంపాలంటే రైల్వే స్టేషన్‌కు వెళ్లాలి. కౌంటర్ వద్ద క్యూలో నిలబడాలి. ఫారమ్‌ లు నింపాలి. కానీ కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ యాప్‌తో ఆ ఇబ్బందులన్నీ ఉండవు. మొబైల్‌ లో కొన్ని వివరాలు ఎంటర్ చేస్తే సరిపోతుంది. సిబ్బంది నేరుగా ఇంటికే వచ్చి పార్సిల్ తీసుకెళ్తారు. ఇవ్వాల్సిన చోట కూడా డోర్ డెలివరీ అందిస్తారు.

ప్రస్తుతం ఈ సర్వీసులు అందుబాటులో ఉన్న నగరాలు

ప్రస్తుతం ఈ పార్శిల్ సేవలు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఆన్‌లైన్ ద్వారా వస్తువులు అమ్మేవారు, తరచూ పార్సిళ్లు పంపాల్సినవారికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతోంది. ఈ యాప్‌ ద్వారా డోర్‌స్టెప్ పికప్ సౌకర్యం అందిస్తున్నారు. అంటే పార్సిల్ పంపేవారు యాప్‌ లో బుకింగ్ చేసిన తర్వాత లాజిస్టిక్స్ సిబ్బంది ఇంటికే వచ్చి పార్సిల్ తీసుకెళ్తారు. సమయం ఆదా అవుతుంది. వృద్ధులు, ఉద్యోగులు, బిజీగా ఉండే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది.

రియల్ టైమ్ ట్రాకింగ్ సౌకర్యం

Advertisement

ఈ యాప్ లో మరో ముఖ్యమైన ఫీచర్ రియల్ టైమ్ ట్రాకింగ్. పార్సిల్ ఎక్కడ ఉంది? ఎప్పుడు గమ్యస్థానానికి చేరుతుంది? లాంటి వివరాలను యాప్‌ లోనే చూసుకోవచ్చు. దీని వల్ల పంపేవారికి, అందుకునేవారికి స్పష్టమైన సమాచారం అందుతుంది. అలాగే పార్సిల్ భద్రతపైనా నమ్మకం పెరుగుతుంది.

ధరలు కూడా తక్కువే!

ధరల విషయంలో కూడా ఈ సర్వీసు ఆకట్టుకుంటోంది. సాధారణంగా రోడ్డు, విమాన రవాణాతో పోలిస్తే రైల్వే పార్సిల్ సేవలు తక్కువ ఖర్చుతో ఉంటాయి. అందుకే చిన్న వ్యాపారులు ఎక్కువగా ఈ విధానాన్ని ఉపయోగించే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో వేగంగా సరుకు చేరడం వ్యాపారులకు లాభదాయకంగా మారుతుంది.  చెల్లింపుల ప్రక్రియను కూడా పూర్తిగా డిజిటల్ చేశారు. UPI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లాంటి పద్ధతుల ద్వారా సేఫ్ గా పేమెంట్స్ చెయ్యొచ్చు. నగదు ఇవ్వాల్సిన అవసరం లేదు.

యాప్ ను ఎలా ఉపయోగించాలంటే?

Advertisement

రైల్ పార్శిల్ యాప్‌ను ఉపయోగించడం కూడా చాలా సులభం. ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదంటే యాపిల్ యాప్ స్టోర్ నుంచి రైల్ పార్శిల్ యాప్‌ ను డౌన్‌ లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ కావాలి. ఆ తర్వాత పంపే చిరునామా, డెలివరీ అడ్రస్, పార్సిల్ బరువు లాంటి వివరాలు నమోదు చేసి బుకింగ్ పూర్తి చేయాలి. తర్వాత సిబ్బంది ఇంటికొచ్చి పార్సిల్ తీసుకెళ్తారు. రైల్వే తీసుకొచ్చిన ఈ కొత్త సేవ పార్సిల్ పంపించే విధానాన్ని మరింత సులభతరం చేసింది.

Read Also: సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ ప్రెస్, ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×