E-Paper
Advertisement

సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ ప్రెస్, ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!

సికింద్రాబాద్–అనకాపల్లి మధ్య వీక్లీ ఎక్స్‌ ప్రెస్,  ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!
Advertisement

Good News for Rail Passengers: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్- అనకాపల్లి మధ్య వీక్లీ స్పెషల్ రైలును ఇప్పుడు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ ప్రెస్ సర్వీస్‌గా మార్చేందుకు రైల్వేశాఖ గ్రీన్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన ఈ సర్వీస్ ఇకపై ప్రతివారం నడవనుంది.  ఈ రైలుకు 17043, 17044 నెంబర్లను అధికారులు కేటాయించారు.

కొత్త రైల్వే సర్వీస్ షెడ్యూల్ వివరాలు

రైలు నెం. 17043 సికింద్రాబాద్ – అనకాపల్లి వీక్లీ ఎక్స్‌ ప్రెస్ ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు అనకాపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు సర్వీసులు మే 24  నుంచి ప్రారంభమవుతాయి. తిరుగు ప్రయాణంలో రైలు నెం. 17044 అనకాపల్లి – సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్‌ ప్రెస్ ప్రతి సోమవారం సాయంత్రం 5:35 గంటలకు అనకాపల్లి నుంచి బయలుదేరి, మంగళవారం ఉదయం 8:40 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ సర్వీస్ మే 18 నుంచి అందుబాటులోకి రానుంది.

ఏ రైల్వే స్టేషన్లలో ఆగుతుందంటే?

Advertisement

ఈ రైలు మార్గ మధ్యంలో పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. చర్లపల్లి, నల్లగొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సమల్కోట్, అన్నవరం, తుని, ఎలమంచిలి లాంటి స్టేషన్ల రెండు వైపులా ఆగుతుంది. ఈ స్టేషన్లలో ప్రయాణికులకు ఎక్కే, దిగే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణించే వారికి ఈ రైలు ఎంతో ఉపయోగపడనుంది. అలాగే, విశాఖపట్నం సమీప ప్రాంతాల నుంచి తెలంగాణకు వెళ్లే ప్రయాణికులకు కూడా సౌకర్యంగా ఉంటుంది.

Advertisement

Read Also: 40 ఏళ్ల నాటి రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌కు గుడ్‌బై.. AI ఆధారిత టికెట్ సేవలు వచ్చేస్తున్నాయ్!

ఈ రైళ్లలో ఏ కోచ్ లు ఉంటాయంటే?

ఈ వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలులో ప్రయాణికుల సౌకర్యం కోసం పలు తరగతుల కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఒక ఫస్ట్ ఏసీ (1A), నాలుగు సెకండ్ ఏసీ (2A), పన్నెండు థర్డ్ ఏసీ (3AC) కోచ్‌లు ఈ రైలులో ఉంటాయి. దీని వల్ల సుదూర ప్రయాణం చేసే ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో స్పెషల్ సర్వీస్‌ను రెగ్యులర్ ఎక్స్‌ ప్రెస్‌ గా మార్చినట్లు రైల్వే అధికారులు  చెప్పారు. ఈ కొత్త సర్వీసుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రైలు కనెక్టివిటీ మరింత మెరుగవుతుందన్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ ఎం మంద్రుప్కర్ కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుని ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

Read Also: భారత్ గౌరవ్ రైలులో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. మరీ ఇంత తక్కువ ధరలోనా?

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×