IRCTC Kazakhstan Tour Package: IRCTC ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశీ టూర్ ప్యాకేజీలను తీసుకొస్తుంది. దుబాయ్, మలేషియా, సింగపూర్, నేపాల్ సహా పలు ప్రాంతాలకు ఎయిర్ ట్రావెల్ ద్వారా తీసుకెళ్తుంది. అందులో భాగంగానే తాజాగా కజకిస్తాన్ టూర్ ప్యాకేజీని పరిచయం చేసింది. ఇంతకీ ఈ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కజకిస్తాన్ యూరేషియాలో ఉన్న ఓ దేశం. ఇది వైశాల్యం పరంగా ప్రపంచంలో 9వ అతిపెద్ద దేశం. ఆసియాలో విశాలమైన ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ దేశం, గతంలో సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత, ఈ దేశం తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. కజకిస్తాన్ తన అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఈ దేశం తూర్పున ఉన్న ఆల్టై పర్వతాల నుంచి పశ్చిమాన ఉన్న కాస్పియన్ సముద్ర తీరం వరకు విస్తరించి ఉంది. ఒకవేళ మీకు కూడా కజకిస్తాన్‌ను సందర్శించాలనుకుంటే, IRCTC బెస్ట్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది.
IRCTC కజకిస్తాన్ టూర్ ప్యాకేజీలో భాగంగా పలు వసతులను కల్పిస్తుంది. ఈ పర్యటన మొత్తం 5 రాత్రులు, 6 పగళ్ల పాటు కొనసాగుతుంది. టూర్ లో హోటల్ వసతి, భోజన సదుపాయాలు అందిస్తుంది.
ఈ యాత్ర దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి కొనసాగుతోంది. ఈ పర్యటన కోసం రూ. 106,999 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కజకిస్తాన్ లోని అల్మాటీ, కోక్ టోబే కొండ, ఫస్ట్ పార్క్, రిపబ్లిక్ స్క్వేర్, స్టేట్ ఒపెరా, బ్యాలెట్ థియేటర్, అకాడమీ ఆఫ్ సైన్సెస్ మ్యూజియం, అబే స్క్వేర్, ప్యాలెస్ ఆఫ్ ది రిపబ్లిక్, జెంకోవ్ కేథడ్రల్, బ్లాక్ కాన్యన్, కోల్సే సరస్సు, కజఖ్ స్విట్జర్లాండ్, కోల్సే, షింబులక్, పాన్ఫిలోవ్, అర్బాట్ ను చూసే అవకాశం కల్పిస్తారు.
Read Also: మైసూరు To కోయంబత్తూరు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ఎయిర్ టూర్ ట్రై చేయండి!
IRCTC కజకిస్తాన్ టూర్ ప్యాకేజీని తీసుకోవాలనుకునే పర్యాటకులు ఇండియన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ లేదంటే యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు. లేదంటే, రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లలోనూ బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ముందుగా వచ్చిన వారికి ప్రయారిటీ అనే పద్దతిలో టూరిస్టులకు అవకాశం కల్పిస్తామని IRCTC అధికారులు వెల్లడించారు. ఈ టూర్ కు పరిమిత సంఖ్యలో టూరిస్టులను తీసుకెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు https://www.irctctourism.com/pacakage_description?packageCode=NDO31 ను చూడాలని అధికారులు వెల్లడించారు.
Read Also: తక్కువ ఖర్చుతో లడాఖ్ టూర్ ప్యాకేజీ, IRCTC సూపర్ ఆఫర్!