E-Paper
Advertisement

IRCTC Air Tour Package: మైసూరు To కోయంబత్తూరు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ఎయిర్ టూర్ ట్రై చేయండి!

IRCTC Air Tour Package: మైసూరు To కోయంబత్తూరు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? IRCTC ఎయిర్ టూర్ ట్రై చేయండి!
Advertisement

IRCTC Tour Majestic Southern: మార్చి 2026 టూర్ ప్యాకేజీలలో భాగంగా IRCTC మరో క్రేజీ టూర్ ప్లాన్ ను రివీల్ చేసింది. లక్నో నుంచి మెజెస్టిక్ సదరన్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ యాత్ర మైసూరు నుంచి కోయంబత్తూరు వరకు కొనసాగనుంది. విమానం ద్వారా ఈ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీ ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల పాటు కొనసాగనుంది. ఏప్రిల్ 25న ప్రారంభమయ్యే ఈ యాత్ర మే 2 వరకు ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా మైసూరు, కూర్గ్, ఊటీ, కోయంబత్తూరును ఎక్స్ ప్లోర్ చేసే అవకాశం ఉంటుంది.

మెజెస్టిక్ సదరన్ ప్యాకేజీని టూర్ విశేషాలు

ఈ పర్యటనలో ప్రయాణికుల కోసం లక్నో నుంచి బెంగళూరుకు, కోయంబత్తూరు నుంచి లక్నోకు విమానంలో వెళ్లే అవకాశం ఉంటుందని IRCTC చీఫ్ రీజినల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా తెలిపారు. ఫుడ్, డ్రింక్స్, త్రీ స్టార్ హోటల్‌ లో  వసతి అందించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో భాగంగా బెంగళూరు నుంచి మైసూరు వరకు శ్రీరంగపట్న ఆలయం, మైసూరులోని మైసూరు ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, చాముండి ఆలయం, కూర్గ్‌ లోని గోల్డెన్ టెంపుల్, దుబారే ఎలిఫెంట్ క్యాంప్, భగమండల ఆలయం, అబ్బే ఫాల్స్,  ఓంకారేశ్వర స్వామి ఆలయం, కూర్గ్ నుంచి ఊటీ వరకు పైన్ అడవుల పర్యటన, ఊటీలోని బొటానికల్ గార్డెన్స్, ఊటీ సరస్సు, రోజ్ గార్డెన్, టీ మ్యూజియం, దొడ్డబెట్ట శిఖరం, కోయంబత్తూరులోని ఆదియోగి శివ విగ్రహాన్ని సందర్శించుకునే అవకాశం ఉంటుంది.

మెజెస్టిక్ సదరన్ ప్యాకేజీని ఛార్జ్ వివరాలు

Advertisement

మెజెస్టిక్ సదరన్ ప్యాకేజీలో టూర్ కు వెళ్లాలనుకునే వాళ్లు ఒక్క వ్యక్తికి రూ. 71,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి బస చేస్తే.. ఒక్కొక్కరు రూ.54,500 చెల్లించాల్సి ఉంటుంది. ముగ్గురు కలిసి బస చేస్తే.. ఒక్కొక్కరికి రూ. 51,500 చెల్లించాలి. తల్లిదండ్రులతో బస చేసే ప్రతి బిడ్డకు రూ. 43,200 చెల్లించాలి. ఒకవేళ మంచం అవసరం లేకుండా అయితే, రూ.38,900 చెల్లించాల్సి ఉంటుంది.

Read Also: ఐఆర్సీటీసీ స్పెషల్ ఆఫర్, జస్ట్ రూ. 30 వేలల్లో క్రేజీ టూర్ ప్యాకేజీలు!

ముందుగా బుక్ చేసుకున్నవారికి అవకాశం

Advertisement

ఈ టూర్ కు సంబంధించి పరిమిత సంఖ్యలో టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి, ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి ముందుగా అవకాశం కల్పిస్తారు. ట్రిప్ బుకింగ్స్ ను టూరిజం భవన్‌ లోని IRCTC కార్యాలయంలో లేదంటే, IRCTC వెబ్‌ సైట్ irctctourism.comలో ఆన్‌ లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ కు సంబంధించిన సమాచారం, బుకింగ్ కోసం, ఈ మొబైల్ నంబర్లను సంప్రదించాలని (8287930912/9236391909/8287930902) IRCTC అధికారులు సూచించారు.

Read Also: తక్కువ ఖర్చుతో లడాఖ్ టూర్ ప్యాకేజీ, IRCTC సూపర్ ఆఫర్!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×