E-Paper
Advertisement

Medicinal Plants: ఆయుర్వేద వైద్యం పై.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం

Medicinal Plants: ఆయుర్వేద వైద్యం పై.. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం
Advertisement

Medicinal Plants: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో ఆయుర్వేదం వైద్యానికి కూడా మరింత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈమేరకు మెడిసినల్ ప్లాంట్స్ ఉత్పత్తిని పెంచాలని నిర్ణయం తీసుకున్నది. మెడిసినల్ ప్లాంట్స్ పెంచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఇటీవల ప్రభుత్వం ఆయుష్​ శాఖను సూచించింది. అంతేగాక ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం చేయాలని సూచించింది. దీంతో ఓ కమిటీ కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి రీసెర్చ్ చేసేందుకు రెడీ అయింది. ఆయా రాష్ట్రాల్లో ఆయుర్వేద వైద్యంలో సత్ఫలితాలను ఇస్తున్న మొక్కలపై స్టడీ చేయనున్నారు. అనంతరం ఆ మొక్కల సాగుపై పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి ప్రభుత్వాన్ని ఇవ్వనున్నారు.

మెడిసిన్ ప్లాంట్స్ సాగు..

ప్రభుత్వం అప్రూవల్ అనంతరం ప్లాంటేషన్ ప్రాసెస్ మొదలు పెడతామని ఆయుష్​ విభాగానికి చెందిన ఓ ఆఫీసర్ తెలిపారు. తెలంగాణ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు ఆధ్వర్యంలో కల్టివేషన్ చేయనునున్నారు. ఇప్పటికే రీసెర్చ్ నిమిత్తం అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి ఇళ్లలో మెడిసిన్ ప్లాంట్స్ సాగు చేస్తున్నారు. దీన్ని మరింత విస్తరించేందుకు అన్ని ప్రాంతాల్లో సుమారు 1500 మంది రైతులు, 2500 మంది అగ్రికల్చర్ స్టూడెంట్లకు బాధ్యతలు అప్పగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈమేరకు ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: SSB Recruitment: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ పాసైతే చాలు

గ్రామాల్లోనూ సాగు..?

ప్రపంచం మొత్తం ఆయుర్వేదం వైపు చూస్తున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా మెడిసినల్ ప్లాంట్లు పెంచేందుకు ఆయుష్ శాఖ ఏర్పాట్లు చేసుకోవాలని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతిపాదనల మీటింగ్‌లో అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో మెడిసినల్ ప్లాంట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేగాక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే క్రమంలోనూ మెడిసినల్ ప్లాంట్లను క్రోడీకరించాలన్నారు. దీంతో అధికారులు ఆ చర్యలను చేపట్టనున్నారు. దాదాపు 24 ఎకరాల్లో టినోస్ పారా, బైసైన్ మెడికా, అర్చిడారమ్, అశ్వగంథలతో పాటు కేరళ, తమిళనాడులో ఉపయోగిస్తున్నతదితర కీలక మొక్కలను కూడా సాగుకు ప్రోత్సహించనున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రకృతి సిద్ధమైన వైద్యానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రభుత్వం ఔషధ మొక్కల సాగు, పరిశోధనలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు.

యాక్షన్ ప్లాన్ ఇలా..

Advertisement

మెడిసినల్ ప్లాంట్‌లలో నాణ్యమైన ఔషధ మొక్కల ను రైతులకు తక్కువ ధరకే అందించేలా విడతల వారీగా నర్సరీల ఏర్పాటు చేయనున్నారు. సబ్సిడీ విధానంలో మొక్కలు పంపిణీ చేసే ప్రాసెస్ కూడా జరగనున్నది. అంతేగాక ఎంపిక చేసిన ప్రాంతాల్లో రీసెర్చ్ హబ్‌లను ఏర్పాటు చేసి, నేల స్వభావాన్ని బట్టి ఏ రకమైన మొక్కలు వేయాలో ముందే ఆయుష్​, అగ్రికల్చర్ ఆఫీసర్లు సంయుక్తంగా సూచించనున్నారు. దీంతో పాటు సాగు చేసిన ఆయుర్వేద మొక్కలను మందుల తయారీ కంపెనీలకు నేరుగా విక్రయించేలా బై-బ్యాక్ ఒప్పందాలను కూడా ప్రోత్సహించేలా సర్కార్ చర్యలు చేపట్టనున్నది. వాస్తవానికి సంప్రదాయ పంటల కంటే ఔషధ మొక్కల సాగు ద్వారా రైతులకు అధిక ఆదాయం లభించే అవకాశం ఉంది. దీంతో రైతులు మొగ్గు చూపే ఛాన్స్ ఉన్నదని ఆఫీసర్లు వివరిస్తున్నారు. తద్వారా స్వచ్ఛమైన మూలికలు అందుబాటులోకి రావడం వల్ల ఆయుర్వేద, యునాని వైద్యం మరింత బలోపేతం అవుతుందని ఆయుష్​ విభాగపు ఆఫీసర్లు తెలిపారు.

Also Read: Romantic Drama OTT: కావాల్సినప్పుడు కాంట్రాక్ట్ భార్యగా వచ్చే అమ్మాయి… జడ్జితో కూడా వదలకుండా…

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×