E-Paper
Advertisement

ప్రపంచానికే తెలియని వింత లోకం.. గాలిలో తేలియాడే ఈ గ్రామం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచానికే తెలియని వింత లోకం.. గాలిలో తేలియాడే ఈ గ్రామం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Advertisement

Sky Houses: మీరు ఎప్పుడైనా మీ ఇంటి బాల్కనీలో నిలబడి ‘అబ్బా.. వ్యూ అదిరిపోయింది’ అని మురిసిపోయారా? అయితే ఇండోనేషియాలోని ‘కొరోవాయ్’ మనుషుల గురించి వింటే మీ గుండె జారి గొంతులోకి రావడం ఖాయం! మనకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడానికి లిఫ్ట్ కావాలి, కానీ వీళ్ళు ఏకంగా ఆకాశంలో తేలియాడే ఇళ్లలో కాపురం ఉంటారు. నిజం చెప్పాలంటే, గాలిపటం ఎగరేయడానికి వీరు బయటకు వెళ్లక్కర్లేదు, కిటికీ తెరిస్తే చాలు మేఘాలు వచ్చి హాయ్ చెప్తుంటాయి.

ఎత్తైన కోటలు.. ఆకాశంలో ఇళ్లు!

Advertisement

ఇండోనేషియాలోని పపువా అడవుల్లో నివసించే కొరోవాయ్ తెగ ప్రజలు ప్రపంచంలోనే అత్యంత వింతైన ‘స్కై స్క్రాపర్స్’ కడతారు. వీరు నేల మీద ఉండటానికి అస్సలు ఇష్టపడరు. భూమికి దాదాపు 100 నుండి 115 అడుగుల ఎత్తులో, అంటే ఒక పది అంతస్తుల భవనం ఎత్తులో ఉండే చెట్ల పైభాగంలో ఇళ్లను నిర్మిస్తారు. మనం ఐదు నిమిషాలు కరెంట్ లేకపోతేనే అల్లాడిపోతాం, కానీ వీళ్ళు ఆ ఎత్తులో గాలిలో ఊగుతూ ఎంచక్కా జీవిస్తారు.

ఈ తిప్పలన్నీ ఎందుకో తెలుసా?

Advertisement

వీరు ఇంత ఎత్తులో ఇళ్లు కట్టుకోవడానికి వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. అడవిలో ఉండే క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక చక్కని మార్గం. అలాగే ఆ అడవుల్లో వచ్చే ఆకస్మిక వరదల నుంచి రక్షణ పొందడానికి , దోమల బెడద లేకుండా ఉండటానికి ఈ ఐడియా భలే పనిచేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, శత్రువుల కంట పడకుండా ఉండటానికి వీరికి ఈ ఎత్తైన ఇళ్లే సేఫ్ జోన్. మరీ వింతైన విషయం ఏంటంటే.. దెయ్యాల నుంచి తప్పించుకోవడానికి కూడా ఇంత ఎత్తులో ఉంటారట!

ఇంజనీరింగ్ అద్భుతం

వీరి ఇళ్ల నిర్మాణం చూస్తే మోడ్రన్ ఇంజనీర్లు కూడా షాక్ అవ్వాల్సిందే. సిమెంటు, ఇటుకలు, ఐరన్ లాంటివి వాడకుండా కేవలం వెదురు, చెక్కలు, చెట్ల బెరడు , ఆకులతోనే అంత ఎత్తులో దృఢమైన ఇళ్లను నిర్మిస్తారు. ఆ చెట్టు పైకి ఎక్కడానికి కేవలం ఒక కర్ర మీద గాట్లు పెట్టి నిచ్చెనలా వాడతారు. అది చూస్తేనే మనకు కళ్లు తిరుగుతాయి, కానీ వీళ్లు మాత్రం పసిపిల్లలను ఎత్తుకుని, సామాన్లు పట్టుకుని కోతిలా చిటికెలో ఎక్కేస్తారు.

చివరగా ఒక్క మాట.. వీరి ఇళ్లు ఎంత బాగుంటాయో, అంత రిస్క్ కూడా ఉంటాయి. బలమైన గాలి వీచినప్పుడు ఆ ఇల్లు ఊగుతుంటే, అందులో కూర్చుని భోజనం చేయడం అంటే మామూలు విషయం కాదు. మనకు ఇల్లు కట్టాలంటే లోన్లు, ప్లాన్లు కావాలి.. కానీ వీరికి మాత్రం ఒక గట్టి చెట్టు, కొన్ని అడవి ఆకులు ఉంటే చాలు, ఆకాశంలోనే రాజభవనం సిద్ధం!

Also Read: ఇంటర్నేషనల్ ట్రావెల్‌కు వరం.. ఈ కార్డ్, అసలు ఇది ఎలా పనిచేస్తుంది?

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×