E-Paper
Advertisement

అండర్ వాటర్ యాక్షన్ కోసం ఏకంగా వారణాసికే.. మహేశ్‌ – రాజమౌళి రిస్క్ మామూలుగా లేదుగా!

అండర్ వాటర్ యాక్షన్ కోసం ఏకంగా వారణాసికే.. మహేశ్‌ – రాజమౌళి రిస్క్ మామూలుగా లేదుగా!
Advertisement

Varanasi Movie : ‘వారణాసి’…మహేశ్‌ బాబు, జక్కన్న కాంబోలో వస్తున్నఈ అడ్వెంచరస్ వండర్ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే.ఇక సినిమా మొదలెట్టినప్పుడే ఇది ఇండియన్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని మురిసిపోయారు ఘట్టమమేని ఫ్యాన్స్.ఇవన్ని ఇలా ఉంటె తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అయిపొయింది.

వారణాసిలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్లు

Advertisement

విషయంలోకి వెళ్తే.. భారీ బడ్జెట్ తో వస్తున్న వారణాసిలో హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీన్లు ఉండబోతున్నాయట. ఇక ఇందులో ఉండే భారీ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లోని గగన్‌పహాడ్‌ ప్రాంతంలో ఒక ఆర్టిఫిషియల్ వాటర్ పాండ్ ని రెడీ చేశారట మేకర్స్.ఇంకేం అది నింపడానికి ఏకంగా 150 ట్యాంకర్ల నీరు కావాలంటూ వాటర్ బోర్డుకు దరఖాస్తు పెట్టేసింది కూడా.మాములుగా అయితే జక్కన్న,మహేష్ ల సినిమా కాబట్టి పర్మిషన్ ఈజీగానే వస్తుందనుకుంటాం.కానీ అక్కడే ట్విస్ట్ ఇచ్చారు జలమండలి అధికారులు.ప్రస్తుతం సమ్మర్ కారణంగా వాటర్ షార్టేజ్ ఉందని, ఈ టైమ్ లో వాటర్ ఇవ్వడం సాధ్యం కాదంటూ జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి తేల్చి చెప్పారు.ఒక రకంగా జక్కన్న టీమ్ కిది పెద్ద షాకే.

also read :జవాబుదారీతనం ఎక్కడ? నిర్మాత మండలిని ప్రశ్నిస్తూ పదవికి నట్టి కుమార్ గుడ్ బై!

Advertisement

వాటర్ సీక్వెన్స్‌ను డైరెక్ట్ గా వారణాసిలోనే షూట్

ఇక హైదరాబాద్‌లో వాటర్ షార్టేజ్ తలెత్తడంతో, మేకర్స్ ఇప్పుడు తమ ప్లాన్‌ను పూర్తిగా మార్చేసారట, ఈ అండర్ వాటర్ సీక్వెన్స్‌ను డైరెక్ట్ గా వారణాసిలోనే షూట్ చేయాలని డిసైడ్ అయిందట వారణాసి టీమ్.ఇక గంగానది తీరంలో ఉన్న న్యాచురల్ లోకేషన్లలో ఈ యాక్షన్ సీన్లు తీస్తే సినిమాకు మరింత మైలేజ్ వస్తుందని భావిస్తున్నాడట జక్కన్న.ఇక ఈ చిత్రంలో మహేష్ కి జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండటంతో, ఈ కాంబినేషన్ చూడటానికి ఫ్యాన్స్ ఎంతో కాలంగా క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘RRR’ ఆస్కార్ వేదికపై మెరవడంతో, వారణాసిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.ఇక ఇప్పటికే సినిమాని వచ్చే ఏడాది 2027, ఏప్రిల్ 7న సమ్మర్ కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసేసింది మూవీ టీమ్.

ఆ స్థాయి హిట్ చూస్తాడా

సినిమా విషయానికి వస్తే మహేశ్‌ బాబు ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుండగా ,ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెల్సిందే.మరి మా టార్గెట్ 3000 కోట్లు అంటూ మనసులో ఫిక్స్ అయిన జక్కన్న ఆ స్థాయి హిట్ చూస్తాడా లేదా అనేది 2027, ఏప్రిల్ 7నే తేలిపోవాలి.

also read :రాయచోటి నుంచి టాలీవుడ్ హీరోగా…హీరో సువిక్షిత్ ఇంటర్వ్యూ

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×