E-Paper
Advertisement

షాకింగ్ రిజల్ట్స్.. కోడిగుడ్డు పెంకులతో మిక్సీ బ్లేడ్ల పదును, అదెలాగో చూసేద్దాం రండి!

షాకింగ్ రిజల్ట్స్.. కోడిగుడ్డు పెంకులతో మిక్సీ బ్లేడ్ల పదును, అదెలాగో చూసేద్దాం రండి!
Advertisement

Kitchen Hacks: సాధారణంగా వంటగదిలో మిక్సీ లేనిదే ఏ పనీ జరగదు. మసాలాలు రుబ్బాలన్నా, అప్పటికప్పుడు చట్నీ చేయాలన్నా మిక్సీ ఉండాల్సిందే. అయితే రోజూ వాడటం వల్ల కొన్ని రోజులకి మిక్సీ బ్లేడ్లు మొద్దుబారిపోతుంటాయి. అలాంటప్పుడు ఎంతసేపు తిప్పినా పదార్థాలు మెత్తగా అవ్వవు. పైగా మిక్సీ మోటార్ మీద భారం పడి పాడైపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలామంది వెంటనే బ్లేడ్లు మార్చేయాలి అనుకుంటారు కానీ, ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతోనే ఆ బ్లేడ్లను మళ్లీ పదునుగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..

కోడిగుడ్డు పెంకులను పడేయొద్దు:

సాధారణంగా కోడిగుడ్డు పెంకులను పారేస్తుంటాం కదా. కానీ వాటితో మిక్సీ బ్లేడ్లను క్లీన్ చేయొచ్చని మీకు తెలుసా? బాగా ఎండిన పెంకులను మిక్సీ జార్‌లో వేసి కాసేపు తిప్పండి. అప్పుడు ఆ పెంకుల గరుకుదనం బ్లేడ్ల మీద ఉన్న మొండి మురికిని వదిలించి, వాటిని మళ్లీ షార్ప్‌గా మారుస్తుంది. రూపాయి ఖర్చు లేని మంచి ఐడియా అంటే ఇదే మరి.

కల్లు ఉప్పుతో చురుకుదనం:

Advertisement

మిక్సీ బ్లేడ్లను పదును పెట్టడానికి మన అమ్మమ్మల కాలం నాటి చిట్కా ఇది. మిక్సీ జార్‌లో కొంచెం కల్లు ఉప్పు వేసి గ్రైండ్ చేయండి. ఉప్పు ముక్కల రాపిడికి బ్లేడ్ల అంచులు మళ్లీ పదునుగా తయారవుతాయి. నెలకు ఒక్కసారి ఇలా చేస్తే మీ మిక్సీ ఎప్పుడూ కొత్తదానిలా సూపర్‌గా పనిచేస్తుంది.

Also Read: రోజూ రుద్దే పని లేకుండా.. బాత్రూమ్ టైల్స్ మెరిసిపోవాలంటే ఇలా ట్రై చేయండి!

ఐస్ ముక్కలతో మురికి మాయం:

Advertisement

కొన్నిసార్లు బ్లేడ్ల సందుల్లో ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి అవి సరిగ్గా తిరగవు. అలాంటప్పుడు కొన్ని ఐస్ ముక్కలు వేసి మిక్సీ తిప్పండి. ఆ చల్లదనానికి, ఐస్ ముక్కల గట్టితనానికి బ్లేడ్ల సందుల్లో ఉన్న మురికి అంతా వదిలిపోతుంది. దీనివల్ల బ్లేడ్లు శుభ్రపడటమే కాకుండా వాటి పదును సామర్థ్యం కూడా పెరుగుతుంది.

జిడ్డు వదిలించే బేకింగ్ సోడా:

బ్లేడ్లు పదునుగా ఉన్నా.. ఒక్కోసారి వాటి మీద జిడ్డు, పాచి పేరుకుపోవడం వల్ల గ్రైండింగ్ సరిగ్గా అవ్వదు. ఇలాంటప్పుడు కొంచెం బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్టులా చేసి బ్లేడ్లకు పూయాలి. ఒక 5 నిమిషాల తర్వాత పాత బ్రష్‌తో రుద్దితే జిడ్డు వదిలిపోయి బ్లేడ్లు మిలమిల మెరుస్తాయి.

జార్ బ్లేడ్స్ వదులయ్యాయా?

వంట గదిలో వాడే అల్యూమినియం ఫాయిల్ ముక్కను చిన్న ఉండలా చుట్టి జార్‌లో వేయండి. మిక్సీని కొన్ని సెకన్ల పాటు రన్ చేస్తే.. ఆ ఫాయిల్ రాపిడికి బ్లేడ్ల అంచులు సెట్ అయిపోతాయి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.. మిక్సీ బ్లేడ్లు మళ్లీ కొత్తవాటిలా షార్ప్ అయిపోతాయి.

Also Read: పార్టనర్‌కు ఇన్ఫెక్షన్ ఉంటే రంగు మారే ‘స్మార్ట్ కండోమ్స్’.. ఈ కుర్రాళ్ల ఐడియా భలే బాగుందే!

Related News

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

Big Stories

Advertisement
×