E-Paper
Advertisement

Tanyka: 275 మిలియన్ సంవత్సరాల నాటి విచిత్రమైన జీవి, సజీవ శిలాజం టానికా గురించి మీకు తెలుసా?

Tanyka: 275 మిలియన్ సంవత్సరాల నాటి విచిత్రమైన జీవి, సజీవ శిలాజం టానికా గురించి మీకు తెలుసా?
Advertisement

Scientists Discover Tanyka: ఈశాన్య బ్రెజిల్‌ లో సముద్ర పరిశోధకులు విచిత్ర జీవి శిలాజాలను గుర్తించారు. ఇది విజ్ఞాన శాస్త్రానికి తెలిసిన తొలి సకశేరుకాలకు భిన్నమైన జాతిగా అంచనా వేస్తున్నారు. ఈ జీవికి టానికా ఆమ్నికోలా అని పేరు పెట్టారు. ఈ జీవి భూమిపై డైనోసార్లు ఆవిర్భవించడానికి పది లక్షల సంవత్సరాల ముందు  పెర్మియన్ కాలంలో నివిసించినట్లుగా భావిస్తున్నారు.

పక్కకు వంగిన దంతాలతో వంకర దవడ

ఈ వింత జీవిలో అసాధారణ విషయం ఏమిటంటే.. వంకరగా ఉన్న కింది దవడ. చాలా సకశేరుకాలలో లాగా దంతాలు పైకి కాకుండా.. దీనికి పక్కకు అమర్చబడి ఉన్నాయి. దవడ లోపలి ఉపరితలం డెంటికిల్స్ అని పిలువబడే చిన్న దంతాల లాంటి నిర్మాణాలతో కప్పబడి ఉండేది. ఇది గరుకైన నమిలే ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. పదునైన దంతాలతో జీవులను నమలడానికి బదులుగా, ఈ జీవి ఆహారాన్ని రుబ్బే విధానాన్ని ఉపయోగించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తొలి నాలుగు పాదాల జీవులలో ఈ రకమైన ఆహార సేకరణ విధానం అత్యంత అరుదు.

ఈ విచిత్ర జీవి అధ్యయనం గురించి.. 

Advertisement

“టానికా భూమ్మీద మనుగడ సాగించిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది మనకు తెలియని ఒక పురాతన వంశానికి చెందినది. ఇది నిజంగా చాలా విచిత్రమైన జంతువు కూడా” అని జేసన్ పార్డో అన్నారు. ఆయన ఈ అధ్యయనాన్ని లీడ్ చేస్తున్నారు. పార్డో చికాగోలోని ఫీల్డ్ మ్యూజియంలో పరిశోధనా సహాయకుడిగా కొనసాగుతున్నారు. ఇవి మంచినీటి ఆవరణ వ్యవస్థలలో జీవించి ఉంటాయని వెల్లడించారు. ఈజీవి పురాతన గోండ్వానాకు చెందిన జలచర జంతువుగా ఆయన అభిప్రాయపడ్డారు. పరిశోధకులు శిలాజంగా మారిన తొమ్మిది కింది దవడ ఎముకలను కనుగొన్నారు. ఒక్కొక్కటి సుమారు 15 సెంటీమీటర్ల పొడవు ఉంది.

టానికా ఏమి తిని ఉంటుంది?

ఈ జంతువు చిన్న జలచర అకశేరుకాలు, శైవలాలు, మొక్కల పదార్థాలను తిని ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.  పక్కకు వంగిన దంతాలు, చిన్న కణుపులతో కప్పబడిన దవడ, ఆహారాన్ని కొరకడానికి బదులుగా గీరడానికి లేదంటే  నలపడానికి వీలు కల్పించే ఒక సహజమైన రుబ్బే పలకలా పనిచేసి ఉండవచ్చన్నారు.

Advertisement

Read Also: భౌగోళిక అద్భుతం ఖేష్మ్.. హోర్ముజ్‌ ను నియంత్రించే భూగర్భ క్షిపణి నగరంగా ఎలా మారింది?

275 మిలియన్ సంవత్సరాల క్రితం భూమిపై జీవం

సుమారు 275 మిలియన్ సంవత్సరాల క్రితం పెర్మియన్ కాలంలో టానికా జీవించి ఉండేదని భావిస్తున్నారు. భూమి ఇప్పుడున్న పరిస్థితులతో పోల్చితే అప్పట్లో చాలా భిన్నంగా కనిపించేది. గ్రహం చాలా భూభాగం పాంగేయా అనే బృహత్ ఖండంగా కలిసి ఉండేది. ఆ సమయంలో సరీసృపాలు, ఉభయచరాలు, క్షీరదాల తొలి జీవులు ఆ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేవి. అప్పట్లో ఇంకా డైనోసార్లు పరిణామం చెందలేదు. టానికా ఆమ్నికోలా లాంటి జాతులతో సహా అనేక వింత జలచరాలు నదులు, సరస్సులలో జీవించాయి.

Read Also: ఈ దేశం వారంలో 3 రోజులు మాత్రమే కనిపిస్తుంది, మిగతా రోజులు మాయం.. ఎందుకంటే?

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×