E-Paper
Advertisement

Vande Bharat Bed Sheets: వందే భారత్ స్లీపర్‌ లో కొత్త బెడ్ షీట్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Vande Bharat Bed Sheets: వందే భారత్ స్లీపర్‌ లో కొత్త బెడ్ షీట్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

Colourful Bed Sheets in Vande Bharat Sleeper: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. పాత పద్దతులకు స్వస్తి పలికి కొత్త విధానాలు అవలంభిస్తోంది. అందులో భాగంగానే.. ఇప్పటి వరకు రైళ్లలో అందించిన తెలుపు రంగు బెడ్ షీట్ల స్థానంలో కొత్త బెడ్ షీట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలిసారి ఈ బెడ్ షీట్లను వందేభారత్ స్లీపర్ రైళ్లలో పరిచయం చేసింది. ఇప్పటి వరకు ఉన్న బెడ్ షీట్లకు పూర్తి విరుద్ధంగా రంగు రంగుల్లో ఆకట్టుకుంటున్నాయి. ఇందుకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వందేభారత్ స్లీపర్ లో రంగురంగుల బెడ్ షీట్లు

నిజానికి ఏసీ క్లాస్ టిక్కెట్ బుక్ చేసుకున్న వారికి దిండ్లు, బెడ్ షీట్లు, దుప్పట్లు ఉచితంగా అందిస్తారు. ప్రయాణీకులకు వారి ఛార్జీలో భాగంగా బెడ్ లినెన్ ఇస్తారు. చాలా కాలంగా ఈ లినెన్‌లు పూర్తిగా వైట్ కలర్ లో ఉంటాయి. కానీ ఇండియన్ రైల్వే ఈ విధానానికి స్వస్తి పలికింది. ఇప్పుడు కలర్ బెడ్ షీట్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 27న ఇన్‌ స్టాగ్రామ్ యూజర్ ఓండ్రిలా దత్తా కొత్త వందే భారత్ స్లీపర్ లో ప్రయాణించారు. ఆమె కొత్త బెడ్ షీట్స్ కు సంబంధించి వీడియోను షేర్ చేసింది.  ఇప్పటి వరకు తెలుపు రంగు బెడ్ షీట్ కప్పుకుంటే శవానికి దుప్పటి కప్పటినట్లు ఉండేదని, ఇకపై అలా ఉండబోదని చెప్పుకొచ్చింది. వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ ప్రెస్ లోని ప్రయాణీకులు రంగుల బెడ్ షీట్లను కప్పుకున్నట్లు చూపించింది.

నెటిజన్లు ఏమంటున్నారంటే?

రైళ్లలో కొత్త బెడ్ షీట్లను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. కొత్త బెడ్ షీట్లు చూస్తుంటే హాయిగా అనిపిస్తుందని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. గతంతో పోల్చితే కొత్త బెడ్ షీట్లు చాలా బాగున్నాయని మరో యువకుడు కామెంట్ చేశాడు. మరికొంత మంది.. గతంలో మాదిరిగా ఈ బెడ్ షీట్లను దొంగిలించకండి అని ప్రయాణీకులకు సూచించారు. “ఏసీ కంపార్ట్ మెంట్లలో అందించే బెడ్ షీట్లు, దుప్పట్లు, దిండ్లు మీతో పాటు తీసుకెళ్లకండి. మీరు తీసుకెళ్తే. వాటికి అయ్యే ఖర్చును రైల్వే సిబ్బంది జేబుల్లోనుంచి చెల్లించాల్సి ఉంటుంది. వారికి ఆర్థికంగా నష్టం కలిగిస్తుంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. ఈ బెడ్ షీట్లను వందేభారత్ స్లీపర్ రైళ్లతో పాటు అన్ని ఏసీ కోచ్ కు విస్తరించాలని మరో నెటిజన్ భారతీయ రైల్వేను రిక్వెస్ట్ చేశాడు.

వందే భారత్ స్లీపర్ లో విమానం తరహా ఫుడ్ సర్వీస్

అటు వందేభారత్ స్లీపర్ లో ఫుడ్ సర్వీసింగ్ పైగా ప్రయాణీకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అచ్చం విమానం తరహాలోనే పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టిం వైరల్ అయ్యింది. క్యాటరింగ్ సిబ్బంది చక్కగా యూనిఫామ్ వేసుకుని, చేతులకు గ్లౌవ్స్ పెట్టుకుని, హెయిర్ నెట్, మాస్క్ ధరించి సీల్ చేసిన ఫుడ్ ప్రయాణీకులకు అందిస్తూ కనిపించాడు. అద్భుతమైన ఫుడ్ సర్వీస్ విధానాన్ని నెటిజన్లు సైతం ప్రశంసించారు.

Read Also: వందేభారత్ స్లీపర్ లో ఫ్లైట్ రేంజ్ ఫుడ్ సర్వీస్, ప్యాసింజర్స్ ఫిదా!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×