E-Paper
Advertisement

BRS Party: స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్..!

BRS Party: స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్..!
Advertisement

BRS Party: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ పై అవిశ్వాసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. న్యాయనిపుణులతో బీఆర్ఎస్ పార్టీ సంప్రదింపులు చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే స్పీకర్ మాత్రం సుధీర్ఘ విచారణ అనంతరం కాంగ్రెస్‌లో చేరినట్లు సరైన ఆధారాలు లేవని, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలేనని తీర్పు ఇచ్చారు. దీంతో గులాబీ పార్టీ స్పీకర్ పై ఆగ్రహంతో ఉంది. చట్ట ప్రకారం వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అందులో భాగంగానే స్పీకర్ పై అవిశ్వాసం పెట్టాలని, పంతం నెగ్గించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు సీనియర్ న్యాయనిపుణులతో చర్చించినట్లు సమాచారం. ఎప్పుడు అసెంబ్లీలో ఈ తీర్మానం పెట్టాలనేదానిపై సమాలోచన చేస్తున్నట్లు సమాచారం.

సభ్యుల మద్దతు అవసరం

ఇది ఇలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన చట్టమేప్రస్తుతం కొనసాగిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు అవుతున్నప్పటికీ గత శాసనసభ చట్టంను అనుసరించే సభ వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ చట్టం ప్రకారం స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 50 మంది శాసనసభ్యుల మద్దతు ఉండాలి. అప్పుడే స్పీకర్ పై తీర్మానం నెగ్గుతుంది. లేకుంటే అది వీగిపోతుంది. కానీ ప్రస్తుతం తెలంగాణ శాసనసభలో 119 మంది సభ్యులే ఉన్నారు. అందులో 1/3 ప్రకారం 40మంది ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీకి సభలో ఉన్న బలం 27 మంది మాత్రమే. సభ రికార్డుల ప్రకారం 37 మంది సభ్యులు ఉన్నారు. అయితే తీర్మానం పెడితే ఆ పది మంది మద్దతు తెలుపుతారా? లేదా? అనేది మరోవైపు చర్చకు దారితీసింది. ఇంకా సభ్యుల మద్దతు అవసరం ఉంది. బీజేపీకి 8 మంది, ఎంఐఎంకు 7 సభ్యులు ఉన్నారు. అయితే వీరిలో ఏ పార్టీకి మద్దతును బీఆర్ఎస్ కోరబోతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఈ రెండు పార్టీలపై సైతం గులాబీ నేతలు తనదైనశైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మద్దతు కోరినా వారు ఇస్తారా? లేదా? అనేది సైతం చర్చనీయాంశమైంది.

Advertisement

Also Read: Air India Shock: ఉచిత టికెట్లు ఇష్యూ.. షాకైన ఎయిరిండియా, ఆ ఉద్యోగులపై చర్యలు

ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నం?

స్పీకర్ పై అవిశ్వాసం గెలిచేంత బలం లేకపోయినా కేవలం ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నంను బీఆర్ఎస్ చేస్తున్నట్లు సమాచారం. తీర్మానం పెట్టి ఓటింగ్ కు వెళ్తే ఒక రోజూ మొత్తం మీడియాలో ఉండొచ్చని.. స్పీకర్ తీసుకున్న నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నామని ప్రజలకు సందేశం ఇవ్వొచ్చు అని భావిస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ స్పీకర్ పై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే అవిశ్వాస తీర్మానం పెట్టిందో అదే విధంగా అసెంబ్లీలో బీఆర్ఎస్ వ్యవహరించేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రజల్లో ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. స్పీకర్ సభలో, పార్టీ ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు ప్రచారం చేసినా వారిపై చర్యలు తీసుకోలేదని..పక్షపాతంతో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మేధావులు, న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంతకు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానంను పెడతారా? లేకుంటే సభలో బలం లేదని వెనక్కి తగ్గుతారా? అనేది చూడాలి.

Advertisement

Also Read: Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. ప్రభుత్వం చర్చించే అతి కీలకమైన అంశాలివే..?

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×