E-Paper
Advertisement

రైల్లోనే ఫైవ్‌స్టార్ హోటల్ ఎక్స్ పీరియెన్స్.. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ బాత్రూమ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైల్లోనే ఫైవ్‌స్టార్ హోటల్ ఎక్స్ పీరియెన్స్..  ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ బాత్రూమ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Advertisement

Inside the Palace on Wheels: భారతీయ రైలు ప్రయాణం అనగానే చాలా మందికి కిటికీ పక్కన కూర్చుని ప్రకృతి అందాలను చూడటం, సుదూర ప్రయాణాల్లో మధుర జ్ఞాపకాలను ఆస్వాదించడం గుర్తుకొస్తాయి. కానీ, ఓ రైలు మాత్రం ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడం మాత్రమే కాదని నిరూపిస్తోంది. విలాసవంతమైన గదులు, అత్యాధునిక సౌకర్యాలు, రాజభవనాన్ని తలపించే అలంకరణలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ రైలు పేరు ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. తాజాగా ఈ రైలులోని విలాసవంతమైన బాత్రూమ్‌లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజభవనాన్ని తలపించే రైలు ప్రయాణం

రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి ప్యాలెస్ ఆన్ వీల్స్ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. ఉదయ్‌పూర్, జైపూర్, జోధ్‌పూర్ సహా పలు ప్రాంతాలను కలుపుతూ సాగే ఈ పర్యటన మొత్తం ఎనిమిది పగళ్లు, ఏడు రాత్రుల పాటు కొనసాగుతుంది. సాధారణ రైళ్లకు భిన్నంగా ఇందులో ప్రయాణికులకు రాజకుటుంబీకుల స్థాయిలో సౌకర్యాలు అందిస్తారు.

ఫైవ్‌ స్టార్ హోటల్‌ను తలపించే బాత్రూమ్

Advertisement

ఈ రైలుకు సంబంధించిన వీడియోను దాని సేల్స్ డైరెక్టర్ భవానీ సింగ్ రావు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సూపర్ డీలక్స్ క్యాబిన్‌లోని బాత్రూమ్‌ను చూస్తే ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఉన్నామా? అనే భావన కలుగుతుంది. గ్రే కలర్  ఇంటీరియర్స్, అందంగా అమర్చిన టైల్స్, పెద్ద అద్దాలు, మృదువైన లైటింగ్ ఆకట్టుకుంటాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం టవల్స్, హెయిర్ డ్రైయర్ లాంటి వస్తువులను కూడా అందుబాటులో ఉంచారు. క్యాబిన్‌ లోకి అడుగుపెడితే వుడ్ ఫర్నిచర్, చిన్న డెస్క్, కుర్చీ కనిపిస్తాయి. కిటికీ పక్కన ఏర్పాటు చేసిన పెద్ద మంచం, సాంప్రదాయంగా అలంకరించిన పైకప్పు కోచ్ కు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చాయి.

ప్రెసిడెన్షియల్ సూట్‌లో మరిన్ని సౌకర్యాలు

ఈ రైలులోని ప్రెసిడెన్షియల్ సూట్ మరింత విలాసవంతంగా ఉంటుంది. ఇందులో బాత్‌టబ్, షవర్‌ తో కూడిన ప్రత్యేక బాత్రూమ్ ఉన్నాయి. వియత్నామీస్ మార్బుల్‌ తో రూపొందించిన నేల, కింగ్‌సైజ్ బెడ్, ప్రత్యేక లాంజ్ ఏరియా ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. వినోదం కోసం ఎల్‌ఈడీ టీవీ కూడా ఉంటుంది. పైకప్పుపై అద్దపు ముక్కలతో రూపొందించిన సాంప్రదాయ థిక్రీ కళాకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

నాలుగు రకాల క్యాబిన్లు.. 24 గంటల సర్వీసులు

Advertisement

ప్యాలెస్ ఆన్ వీల్స్‌లో డీలక్స్, సూపర్ డీలక్స్, సూట్, ప్రెసిడెన్షియల్ సూట్ అనే నాలుగు రకాల క్యాబిన్లు ఉన్నాయి. ఏసీ, ఇంటర్నెట్, అవసరమైనప్పుడు వైద్య సహాయం, 24 గంటల బట్లర్ సేవలు అందుబాటులో ఉంటాయి. టాయిలెట్రీస్, లాంజ్‌వేర్‌తో పాటు రోజువారీ క్లీనింగ్ సర్వీసులు కల్పిస్తారు. ప్యాలెస్ ఆన్ వీల్స్‌ లో ప్రయాణం అంటే గమ్యస్థానాలను చూడటమే కాదు.. ప్రయాణంలోనే రాజభవనం లాంటి విలాసాన్ని ఆస్వాదించడం కూడా!

Read Also: రైళ్లలో పెద్ద సౌండ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా? అయితే, ఇక షాక్ తప్పదు!

Tags

Related News

రోడ్డు అనుకుని బిల్‌బోర్డు వైపు దూసుకెళ్లిన ట్రక్కు.. వామ్మో.. ఇదేం వింత ప్రమాదం?

బాబోయ్.. బ్రా ధర రూ. 474 కోట్లా? ఇంతకీ అంత ఖరీదు ఎందుకు బ్రో?

దసరా, దీపావళి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫారిన్ లో టాప్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

రైళ్లలో పెద్ద సౌండ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా? అయితే, ఇక షాక్ తప్పదు!

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

Big Stories

Advertisement
×