E-Paper
Advertisement

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది
Advertisement

Mythological Mystery Thriller: ప్రతీ ఊర్లో దేవాలయం అంటే చాలామందికి భక్తి, నమ్మకం, సంప్రదాయం గుర్తుకొస్తాయి. పండుగలు వచ్చినప్పుడు కుటుంబమంతా కలిసి వెళ్లడం, మొక్కులు చెల్లించుకోవడం, దేవుడిపై భారమంతా వేసి మనశ్శాంతి పొందడం మనకు అలవాటు. కానీ అదే ఆలయం చుట్టూ అధికారం కోసం పోరు మొదలై, హత్యలు జరిగి, ఊహించని రహస్యాలు బయటపడితే ? పవిత్రంగా భావించే ప్రదేశం వెనుక దాగిన అసలు కథ ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగించే చిత్రమే ‘వసుదేవసుతం’ (Vasudheva Sutham). మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఎక్కడ ? స్టోరీ ఏంటి ? అనే విషయాల్లోకి వెళ్దాం పదండి.

కథలోకి వెళ్తే…

పురుషోత్తమపురం అనే గ్రామంలోని పురాతన వాసుదేవ ఆలయం చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. ఆ ఆలయానికి చైర్మన్‌ గా ఉన్న శర్మ హత్యకు గురవుతాడు. ఈ ఘటనతో ఆలయంపై ఆధిపత్యం ఎవరు సాధించాలనే పోరు మొదలవుతుంది. ఆలయం నిర్వహణ అనేది భక్తి, సేవకు సంబంధించిన వ్యవహారంగా ఉండాలి. కానీ అక్కడ అధికారం కోసం జరిగే పోటీ వెనుక వ్యక్తిగత ప్రయోజనాలు, రహస్య ఉద్దేశాలు దాగి ఉంటాయి. శర్మ హత్య తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయి.

Advertisement

ఇదే సమయంలో హైదరాబాద్‌లో నివసించే కృశవ్ వాసుదేవ ఉత్సవాల కోసం గ్రామానికి వస్తాడు. అక్కడ హీరా బంధు మేనకోడలు భువి పరిచయమవుతుంది. వారి మధ్య ప్రేమ మొదలవుతుంది. అయితే గ్రామానికి వచ్చిన కృశవ్‌ కు అక్కడ జరుగుతున్న పరిణామాలు సాధారణంగా అనిపించవు. ఆలయ చైర్మన్ హత్య, ఆలయ అధికారంపై పోరు, గ్రామస్థులు వెళ్లడానికి కూడా భయపడే కోయిరాతల అనే రహస్య ప్రదేశం… ఒక్కో విషయం గురించి తెలుసుకోవాలనే అతని ఆసక్తిని పెంచుతాయి.

కృశవ్ ఆ రహస్యాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించే కొద్దీ ఓ షాకింగ్ విషయం బయట పడుతుంది. అతనికి కూడా దీనికి లింకు ఉన్నట్టు తేలుతుంది. అతను గతంలో జైలుకు ఎందుకు వెళ్లాడు ? అక్కడి నుంచి ఎందుకు తప్పించుకున్నాడు ? కోయిరాతలలో అసలు ఏముంది ? ఆలయంలో దాగి ఉన్న రహస్యం ఏమిటి ? ఆన్అన్ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

Advertisement

కథ మొదటి భాగంలో ఆలయ రాజకీయాలు, కృశవ్‌–భువి ప్రేమ, రహస్య ప్రదేశం చుట్టూ ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ సమయంలో వచ్చే మలుపు కథను మరో మలుపు తిప్పుతుంది. రెండో భాగంలో కృశవ్ గతం, ఆలయ రహస్యాలు, నిధి అన్వేషణ ప్రధానంగా కనిపిస్తాయి. ప్రీ క్లైమాక్స్‌లో మరో ట్విస్ట్ కథను ఊహించని మలుపు తిప్పుతుంది.

తెలుగులోనే స్ట్రీమింగ్

‘వసుదేవసుతం’ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. అయితే ఆహా (Aha)లో తెలగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మహేంద్రన్ (Mahendran), అంబికా వాణి (Ambikavani) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వైకుంఠ్ బోను (Vykunt Bonu) దర్శకత్వం వహించారు. మైమ్ గోపీ, జాన్ విజయ్, రాజీవ్ కనకాల, తులసి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. సంగీతం మణిశర్మ అందించారు. మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

Read Also: గేమ్‌ ఆడితే మెదడునే కంట్రోల్‌ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్‌ సైఫై థ్రిల్లర్‌ ఓటీటీలోకి

Tags

Related News

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!

వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×