E-Paper
Advertisement

RailOne App Offer: రైల్వే ప్రయాణికులకు పండగ ఆఫర్.. ట్రైన్ టికెట్లపై 3 శాతం రాయితీ.. ఇలా చేస్తేనే..

RailOne App Offer: రైల్వే ప్రయాణికులకు పండగ ఆఫర్.. ట్రైన్ టికెట్లపై 3 శాతం రాయితీ.. ఇలా చేస్తేనే..
Advertisement

RailOne App Offer: నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఎక్కువ మంది ముందుగా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకుంటారు. అత్యవసర ప్రయాణాలుంటే.. జనరల్ టికెట్లను స్టేషన్లలో పొందుతారు. జనరల్ టిక్కెటింగ్ వ్యవస్థను ఆఫ్ లైన్ నుంచి ఆన్ లైన్ కు మార్చేందుకు రైల్వే శాఖ యాప్ లు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిల్లో రైల్ వన్(RailOne) యాప్ ఒకటి. రైల్వే సేవలను ఒకే టిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి తీసుకొచ్చేందుకు రైల్ వన్ యాప్ అందుబాటులోకి తెచ్చారు.

అన్ని సేవలు ఒకే యాప్ లో

రైల్ వన్ యాప్ లో టికెట్ బుకింగ్, రియల్-టైమ్ ట్రైన్ ట్రాకింగ్, ఫుడ్ ఆర్డర్‌లు, కస్టమర్ సపోర్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ వినియోగాన్ని పెంచడానికి భారతీయ రైల్వే అన్‌రిజర్వ్డ్ టికెట్లపై 3 శాతం రాయితీ ప్రకటించింది. జనరల్ టికెట్ల ధరలో 3 శాతం వరకు తగ్గించి సామాన్యుల రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేసింది. రైల్వేకు చెందిన ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్, UTSonMobile వంటి డిజిటల్ టికెటింగ్ యాప్ లను ప్రయాణికులు ఎక్కువగా ఉపయోగిస్తుంచారు. వీటితో పాటు రైల్వే సేవలను మరింత సులభతరం చేసేందుకు రైల్ వన్ అందుబాటులోకి తెచ్చింది.

Advertisement

రైల్ వన్.. వివిధ రైల్వే సేవల ఇంటర్ ఫేస్ యాప్. ఇందులో జనరల్ టికెట్లు, PNR స్టేటస్, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, ఆహార డెలివరీ లేదా ఫిర్యాదుల కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఇప్పటకే ఉన్న ఐఆర్సీటీసీ వివరాల ద్వారా ఇందులో లాగిన్ అవ్వొచ్చు. రైల్‌వన్ Android, iOS ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

రైల్ వన్ యాప్ 3% డిస్కౌంట్

రైల్ వన్ యాప్ లో జనరల్ టికెట్ బుకింగ్ ను పెంచేందుకు..3% డిస్కౌంట్ ను అందిస్తోంది రైల్వే శాఖ. ఈ ఆఫర్ జనవరి 14 నుంచి జూలై 14 వరకు అందుబాటులో ఉంటుంది. RailOne ద్వారా నేరుగా బుక్ చేసుకున్న టికెట్లకు ఇది వర్తిస్తుంది. యాప్ వాలెట్ తో జనరల్ టికెట్లు కొనుగోలు చేస్తే క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు ఉంటాయి.

రైల్‌వన్‌లో 3% డిస్కౌంట్ ఎలా పొందాలి

Advertisement

1. RailOne యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి
2. ఐఆర్సీటీసీ వివరాలతో సైన్ ఇన్ చేయండి. లేదా కొత్త వారైతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్‌తో ఓటీపీ ఎంటర్ చేసి సులభంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.
3. ప్రొఫైల్ వివరాలను పూర్తి చేయండి. మీ పేరు, కాంటాక్ట్ వివరాలు యాడ్ చేసుకోండి. ఇది బుకింగ్‌ను సులభతరం చేస్తుంది.
4. మీ ప్రయాణం, టికెట్ రకాన్ని ఎంచుకోండి. అన్‌రిజర్వ్డ్ టికెట్ ను ఎంచుకుని, ప్రయాణ తేదీతో పాటు ఎక్కడి నుంచి ఎక్కడికో స్టేషన్‌లను నమోదు చేయండి.
5. ఆన్ లైన్ పేమెంట్ చేయండి. యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. 3 శాతం డిస్కౌంట్ యాప్ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది.
6. బుకింగ్ పూర్తి చేసి టికెట్‌ను సేవ్ చేసుకోండి. ప్రయాణ సమయంలో టీసీకి ఈ ఫోన్ లో టికెట్ చూపిస్తే సరిపోతుంది.

Read Also :  తత్కాల్ బుకింగ్ లో మళ్లీ సమస్య, రైల్వేపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×