E-Paper
Advertisement

Chiranjeevi: కూతురి ద్వారా మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. చిన్నారికి ఆర్థిక సాయం!

Chiranjeevi: కూతురి ద్వారా మాట నిలబెట్టుకున్న మెగాస్టార్.. చిన్నారికి ఆర్థిక సాయం!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడమే కాకుండా తన మంచి మనసుతో ఎంతో మందికి సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్ ద్వారా ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన ఈయన.. అటు వ్యక్తిగతంగా కూడా అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ గొప్ప పేరు దక్కించుకున్నారు. ఎంతోమంది సెలబ్రిటీలకు, అభిమానులకు ఆర్థిక సహాయం అందించి.. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలిచిన చిరంజీవి.. సామాన్య ప్రజలకు కూడా సహాయం చేస్తూ.. మరింత ఎత్తుకు ఎదిగిపోయారు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక చిన్నారికి తన కూతురు సుస్మిత కొణిదెల చేతుల మీదుగా సహాయం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.

గొప్ప మనసు చాటుకున్న చిరంజీవి..

విషయంలోకి వెళ్తే.. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా సరిగమప లిటిల్ ఛాంప్స్ షో ఏ రేంజ్ లో ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ షో ద్వారా సింగర్ గా అందరికీ పరిచయమైన వరుణవి (Varunavi) కి చిరంజీవి తన వంతు సహాయం చేశారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న అనగా సంక్రాంతి సందర్భంగా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా ప్రమోషన్స్ చిత్ర బృందం బిజీగా ఉంది. ఇదిలా ఉండగా మరొకవైపు సరిగమప లిటిల్ ఛాంప్స్ షోలో సింగర్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణవిని చిరంజీవితో మాట్లాడిస్తానని అనిల్ రావిపూడి మాట ఇచ్చారు. ఇక ఆ మాట మేరకు చిరంజీవిని కలిసేలా చేశారు. అందులో భాగంగానే చిరంజీవి వరుణవిని కలిసి తనను ఒడిలో కూర్చోబెట్టుకొని.. ముద్దుగా మాట్లాడే వరుణవి మాటలు వినడమే కాకుండా ఆమె పాడిన పాటలు విని మురిసిపోయారు. ఇదే సందర్భంగా పుట్టుకతో అంధురాలైన వరుణవికీ తన వంతు సహాయం చేస్తానని చెప్పి ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు చిరంజీవి

చిన్నారికి భారీ సాయం..

విషయంలోకి వెళ్తే.. సరిగమప లిటిల్ ఛాంప్స్ లేటెస్ట్ సీజన్ గ్రాండ్ ఫినాలేకి చిరంజీవి కూతురు ప్రముఖ నిర్మాత సుస్మిత హాజరయింది. ఈ సందర్భంగా ఆమె తన చేతుల మీదుగా ఐదు లక్షల రూపాయల చెక్కును వరుణవి ఫ్యామిలీకి ఇప్పించారు చిరంజీవి. అంతేకాదు తన తండ్రి చిరంజీవి పంపిన డబ్బును వరుణవి పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేయబోతున్నట్లు సుస్మిత స్పష్టం చేసింది. మరో కన్న తండ్రి కూతురి కోసం తన కూతురి చేతుల మీదుగా ఈ బహుమతిని చిరంజీవి పంపించారు అంటూ అనిల్ రావిపూడి తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు కూడా చిరంజీవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజు ఎప్పటికీ రాజే అంటూ కొనియాడుతున్నారు.

also read:The RajaSaab: థమన్‌ ‘నాచే నాచే’ సాంగ్‌ని కాపీ కొట్టాడు.. చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన సింగర్

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×