E-Paper
Advertisement

IRCTC Tatkal-booking: తత్కాల్ బుకింగ్ లో మళ్లీ సమస్య, రైల్వేపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!

IRCTC Tatkal-booking: తత్కాల్ బుకింగ్ లో మళ్లీ సమస్య, రైల్వేపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు!
Advertisement

Indian Railway: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) యాప్ తో పాటు వెబ్ సైట్ లో ఇవాళ తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసుకోవాలనుకునే వారికి మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. టికెట్స్ బుకింగ్ సమయంలో ఎర్రర్ రావడంతో టికెట్స్ పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో యూజర్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచుగా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నా, పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అవుతున్నారు.

రైల్వేపై నెటిజన్ల ఆగ్రహం

“IRCTC తత్కాల్ బుకింగ్ బ్రోకర్ల కోసం నడుపుతున్నట్లుగా ఉంది. ప్రతిసారి తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఇలాంటి సమస్యే ఎదురవుతుంది. ఎప్పుడూ టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్నా, ఇలాంటి పరిస్థితే ఎదురైతే, ఈ సర్వీస్ నడపడం వృథా. తత్కాల్ బుకింగ్ అనేది బ్రోకర్ల కోసం జరిగే ఓ డ్రామా” అని నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “నేను తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఇలాంటి సమస్య ఎదురవుతుంది. మళ్లీ మళ్లీ ఎర్రర్ వస్తోంది. ఇంతకీ IRCTCలో ఏం జరుగుతుంది?” అని మరొక వినియోగదారుడు క్వశ్చన్ చేశాడు.

Advertisement

“@irctc_app అనేది ఒక జోక్. రైల్ వన్ యాప్ కూడా ఒక జోక్. మొత్తం వ్యవస్థ చాలా చెత్తగా ఉంది. ఒక వ్యక్తి వేచి ఉండి, సమయానికి యాప్ లో టికెట్ కోసం ప్రయత్నించినా, టికెట్ బుక్ కాకపోతే పడే ఇబ్బంది దారుణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, స్వీయ వేధింపుకు గురవుతాయి. ఇంకా చెప్పాలంటే రైల్వే వినియోగదారులను హింసిస్తుంది.@IRCTCofficial వేస్ట్” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

Advertisement

“30 నిమిషాలు కష్టపడితే ఒక్క టికెట్ కూడా బుక్ చేసుకోలేకపోయాను. ఎందుకు? ఎందుకంటే సిస్టమ్ ప్రతి అడుగులోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. చివరికి టికెట్ లేకుండానే యాప్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. @RailMinIndia అద్భుతం. కానీ, తత్కాల్ బుకింగ్ వృధా. మొత్తం ఆ వ్యవస్థ వృథా” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ డిసెంబర్ 4న IRCTC వెబ్‌సైట్ ఏప్రిల్, అక్టోబర్ 2025 మధ్య 99.98% సమయం పని చేసిందని చెప్పారు. తాజాగా ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి తత్కాల్ బుకింగ్ సమయాల్లో IRCTC అంతరాయం సాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో IRCTC వెబ్‌సైట్, యాప్‌ని ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోలేకపోతే, సమీపంలోని రైల్వే PRS కౌంటర్‌ కు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

డిసెంబర్ 26 నుంచి ఛార్జీల పెంపు  

ఈ సంవత్సరం ప్రారంభంలో, తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు అన్ని IRCTC ఖాతాలకు ఆధార్ ధృవీకరణను తప్పనిసరి చేసింది. నిజమైన వినియోగదారులకు అవసరమైన కన్ఫార్మ్ టిక్కెట్లను పొందడానికి సహాయపడుతుందని తెలిపింది. అదే సమయంలో డిసెంబర్ 26 నుండి అన్ని తరగతులలో ప్రయాణీకుల రైలు ఛార్జీలను పెంచుతామని భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ సంవత్సరం జూలై తర్వాత రైల్వేలు ఛార్జీలను పెంచడం ఇది రెండవసారి. కిలోమీటరుకు ఒకటి నుంచి రెండు పైసల వరకు ఛార్జీల పెంపుదల ఉంటుందని తెలిపింది.

Read Also: దూసుకెళ్తున్న IRCTC షేర్ ధర, కారణం ఏంటో తెలుసా?

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×