E-Paper
Advertisement

The RajaSaab: థమన్‌ ‘నాచే నాచే’ సాంగ్‌ని కాపీ కొట్టాడు.. చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన సింగర్

The RajaSaab: థమన్‌ ‘నాచే నాచే’ సాంగ్‌ని కాపీ కొట్టాడు.. చెప్పు చూపించి వార్నింగ్ ఇచ్చిన సింగర్
Advertisement

The RajaSaab:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న తమన్ (Thaman) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిన్న హీరోలను మొదలుకొని స్టార్ హీరోల సినిమాల వరకు మ్యూజిక్ అందిస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. అప్పుడప్పుడు ట్యూన్స్ కాపీ కొట్టాడు అంటూ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే..అయితే ఇంతకాలం ఈ ఆరోపణలు టాలీవుడ్ వరకు మాత్రమే వినిపించేవి. కానీ ఇప్పుడు తొలిసారి ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో వివాదం చెలరేగడం సంచలనంగా మారింది. ఏకంగా సదరు సింగర్ తమన్ పై కాపీ ఆరోపణలు చేయడమే కాకుండా చెప్పు చూపించి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి ఏకంగా చెప్పు చూపించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వివాదంగా మారింది.

మళ్లీ కాపీ కొట్టిన తమన్.. ఏకంగా చెప్పు చూపించిన సింగర్..

అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా మారుతీ (Maruthi) దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన చిత్రం ది రాజా సాబ్ (The RajaSaab). భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 9న అనగా నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. నిజానికి 400 కోట్లు రాబడుతుందని టాలీవుడ్ ఎంతో ఆశాభావం వ్యక్తం చేసింది. కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసే కథ కాదని ప్రీమియర్ షో తోనే టాక్ బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో కలిసి చేసే “నాచే నాచే” పాటపై అంతర్జాతీయ స్థాయిలో వివాదం నెలకొంది. ఈ పాట ట్యూన్ కి సంబంధించి తాను 2024లోనే తాను రూపొందించిన మ్యూజిక్ బీట్ ను రాజాసాబ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాపీ చేశారని స్వీడన్ కి చెందిన ప్రముఖ డీజే వీడోజీన్ ఆరోపించారు. ప్రభాస్ నటనను అద్భుతమని కొనియాడిన అతను.. మ్యూజిక్ కాపీ చేయడం పై అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా చెప్పు చూపించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి దీనిపై తమన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Advertisement

also read:Youtuber: ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్.. మైనర్లతో అసభ్యకర వీడియోలు!

ది రాజాసాబ్ సినిమా విశేషాలు..

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, రిద్దీ కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటించారు. జరీనా వహాబ్, సంజయ్ దత్, బోమన్ ఇరానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందని క్లైమాక్స్ లో ప్రకటించారు.ఆ చిత్రానికి రాజాసాబ్ సర్కస్ 1935 అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో ప్రభాస్ జోకర్ పాత్రలో కనిపించనున్నారు.

Advertisement

Related News

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×