E-Paper
Advertisement

సెల్ఫీ దిగండి.. ఫ్రైజ్ గెలవండి.. సౌత్ సెంట్రల్ రైల్వే బంపర్ ఆఫర్!

సెల్ఫీ దిగండి.. ఫ్రైజ్ గెలవండి.. సౌత్ సెంట్రల్ రైల్వే బంపర్ ఆఫర్!
Advertisement

Selfie with Hitech City Railway Station: హైదరాబాద్‌ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ స్టేషన్‌ ను ఈ నెల 17న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రజల కోసం ఒక ఆసక్తికరమైన కాంపిటీషన్ నిర్వహిస్తోంది. ‘సెల్ఫీ విత్ స్టేషన్’ పేరుతో ప్రత్యేక పోటీ నిర్వహిస్తూ విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నట్లు ప్రకటించింది.

పోటీలో ఎలా పాల్గొనాలి?

ఈ పోటీలో పాల్గొనాలంటే కొత్తగా నిర్మించిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ దగ్గర ఒక అందమైన సెల్ఫీ దిగాలి. ఆ తర్వాత ఆ ఫోటోను welfaresectionsc@gmail.com అనే ఈమెయిల్‌ కు పంపాలి. అంతే కాకుండా అదే సెల్ఫీని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి, దక్షిణ మధ్య రైల్వే సూచించిన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ను తప్పనిసరిగా ట్యాగ్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో @scrailwayindia, @scdivision_123 ఖాతాలను ట్యాగ్ చేయాలి. ఎక్స్ లో @SCRailwayIndia, @drmsecunderabad హ్యాండిల్స్‌ ను యాడ్ చేయాలి. ఫేస్‌బుక్‌లో South Central Railway – S.C.R అండ్ DRM Secunderabad అధికారిక పేజీలను ట్యాగ్ చేయాలి. ఈ నిబంధనలు పాటించిన ఎంట్రీలనే పోటీకి పరిగణనలోకి తీసుకుంటారు.

Advertisement

పోటీ ఎప్పటి వరకు అంటే?   

ఈ సెల్ఫీ పోటీలో పాల్గొనడానికి జూలై 15, 2026 చివరి తేదీగా రైల్వే అధికారులు ప్రకటించారు. ఆసక్తి ఉన్న వారు టైమ్ ముగిసేలోపు తమ సెల్ఫీలను పంపించాలి. కొత్త హైటెక్ సిటీ స్టేషన్ అందాలను కెమెరాలో బంధించి, బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

విద్యార్థులకు ప్రత్యేక పోటీలు

Advertisement

అటు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా జంట నగరాల పరిధిలోని పాఠశాల విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక పోటీలు నిర్వహించారు. ఇందులో వ్యాసరచన, డ్రాయింగ్, పెయింటింగ్ పోటీలను నిర్వహించి విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించారు. ఈ పోటీల్లో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. “నా నగరంలో అభివృద్ధి చెందిన రైల్వే స్టేషన్ ఎలా ఉండాలి?”, “అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో నా పాత్ర” లాంటి అంశాలపై విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో జంట నగరాల్లోని ఆరు ప్రముఖ పాఠశాలల నుంచి మొత్తం 292 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రతి పాఠశాల నుంచి వ్యాసరచన, డ్రాయింగ్, పెయింటింగ్ విభాగాల్లో ముగ్గురు చొప్పున విజేతలను ఎంపిక చేయనున్నారు. మొత్తం 36 మంది విజేతలు జూలై 17న జరిగే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందుకోనున్నారు.

Read Also: ప్రధాని చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం.. డేట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ!

Related News

విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు!

విశాఖ స్పెషల్.. వాల్తేరు, గాజువాక, అసీల్‌మెట్ట ప్రాంతాలకు.. ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసా?

ఏడు రంగుల కొండ.. ప్రకృతి సృష్టించిన అద్భుతం.. ఎలా ఏర్పడిందో తెలుసా?

రంగుల నది.. విభిన్న వర్ణాలతో స్వర్గాన్ని తలపించే ఈ ప్రాంతం ఎక్కడుందంటే?

హైదరాబాద్–తిరుపతి విమానాలకు ఫుల్ డిమాండ్.. చుక్కల్లోకి టికెట్ ధరలు!

అక్కడ అడవులు నడుస్తాయట.. ఇదేం చిత్రం భయ్యా!

ఆ ఊళ్లకు అస్సలు రోడ్లు ఉండవు.. అయినా అక్కడి లైఫ్ భలే హ్యాపీ!

Big Stories

Advertisement
×