E-Paper
Advertisement

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ కాలింగ్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్లు అదుర్స్!

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ కాలింగ్ స్మార్ట్‌వాచ్.. ఫీచర్లు అదుర్స్!
Advertisement

Fire-Boltt Ninja Call Pro Plus: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైమ్ చూసే వస్తువు కాదు. అదొక స్టైల్ స్టేట్‌మెంట్. ముఖ్యంగా బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో.. అదిరిపోయే ఫీచర్లు ఆశించే వారి కోసం Fire-Boltt Ninja Call Pro Plus మార్కెట్లో సూపర్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. భారీ డిస్‌ప్లే, క్రిస్టల్ క్లియర్ బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్, హెల్త్ ట్రాకర్లతో వస్తున్న ఈ వాచ్ యువతను బాగా ఆకట్టుకుంటోంది. అసలు ఈ స్మార్ట్‌వాచ్‌లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి, దీని ధర ఎంత, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.83 ఇంచ్ లార్జ్ డిస్‌ప్లే:

మొదటి చూపులోనే ఈ వాచ్ మిమ్మల్ని ఫ్యాన్ చేసేస్తుంది. ఇందులో 1.83 ఇంచ్ (46.5mm) HD డిస్‌ప్లే ఇచ్చారు. స్క్రీన్ చాలా పెద్దదిగా ఉండటం వల్ల నోటిఫికేషన్లు చదవడానికి, మెసేజ్‌లు చూడటానికి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. 240 x 284 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో కలర్స్ కూడా చాలా బ్రైట్‌గా, రిచ్‌గా కనిపిస్తాయి. దీని స్క్వేర్ డయల్ డిజైన్ చేతికి పెట్టుకుంటే.. యాపిల్ వాచ్ లుక్‌ని గుర్తుచేస్తుంది.

స్మార్ట్ బ్లూటూత్ కాలింగ్:

Advertisement

ఈ వాచ్‌కి ఉన్న మెయిన్ హైలైట్ దీని బ్లూటూత్ కాలింగ్ ఫీచర్. ఇందులో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్ ,స్పీకర్ ఉన్నాయి. బైక్ నడుపుతున్నప్పుడు లేదా ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉన్నప్పుడు ఫోన్ జేబులోంచి తీయకుండానే నేరుగా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడొచ్చు. డయల్ ప్యాడ్, రీసెంట్ కాల్స్ హిస్టరీ, కాంటాక్ట్స్ సేవ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీని వాయిస్ క్వాలిటీ చాలా క్లియర్‌గా ఉంటుంది.

ఫిట్‌నెస్ ఫ్రీక్స్ కోసం 120+ స్పోర్ట్స్ మోడ్స్:

మీరు హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా ? అయితే ఈ వాచ్ మీకు పర్ఫెక్ట్ పార్ట్‌నర్. ఇందులో 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. మీరు రన్నింగ్ చేసినా, సైక్లింగ్ చేసినా, క్రికెట్ ఆడినా.. మీ బాడీ ఎంత క్యాలరీల ఫ్యాట్ కరిగించిందో ఇది ట్రాక్ చేస్తుంది. దీనితో పాటు..

Advertisement

SpO2 మానిటర్: రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని చెక్ చేస్తుంది.

హార్ట్ రేట్ ట్రాకర్: 24 గంటలు మీ గుండె వేగాన్ని గమనిస్తుంది.

స్లీప్ మానిటరింగ్: మీ నిద్ర నాణ్యతను అంచనా వేస్తుంది.

బ్యాటరీ లైఫ్ & ఇతర ఫీచర్లు:

ఒక్కసారి ఛార్జ్ చేస్తే నార్మల్ యూసేజ్‌లో ఈ వాచ్ హ్యాపీగా 5 నుంచి 6 రోజుల పాటు వస్తుంది. ఒకవేళ బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడితే 2 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఇది IP67 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది కాబట్టి చెమట పట్టినా, చిన్నపాటి వర్షంలో తడిచినా ఏమీ కాదు. అలాగే బోర్ కొట్టినప్పుడు ఆడుకోవడానికి ఇందులో ఇన్-బిల్ట్ గేమ్స్ కూడా ఉన్నాయి! ఏఐ వాయిస్ అసిస్టెంట్ (Google/Siri)సపోర్ట్ కూడా ఉండటం విశేషం.

రూ. 1,500 లోపు బడ్జెట్‌లో మంచి బ్రాండెడ్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ కావాలనుకునే.. కాలేజీ స్టూడెంట్స్ , ఆఫీస్ గోయర్స్ కోసం Fire-Boltt Ninja Call Pro Plus ఒక బెస్ట్ ఆప్షన్.

Tags

Related News

రూ.1037కే మిక్సీ గ్రైండరా? ఫ్లిప్‌కార్ట్ ఇస్తున్న ఈ క్రేజీ ఆఫర్ అసలు మిస్ కావద్దు!

క్షణాల్లోనే ఈజీగా కేకులు,పిజ్జాలు రెడీ.. పిజియన్ ఓటీజీ స్పెషల్స్ ఇవే!

రూ.7890కే 7 కేజీ వాషింగ్ మెషీన్..డోంట్ మిస్

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్..ఫాస్ట్‌ట్రాక్ ఆప్టిమస్ ప్రో స్పెషల్స్ ఇవే!

స్టైలిష్ లుక్,బిగ్ బ్యాటరీతో ఫైర్-బోల్ట్ హరికేన్ స్మార్ట్‌వాచ్ విడుదల!

ఫిలిప్స్ నుంచి అదిరిపోయే..బ్లూటూత్ స్పీకర్! ధర కూడా చాలా తక్కువ

పొరపాటున ఫోటోలు డిలీట్ అయ్యాయా? ఇలా రికవర్ చేసుకోండి!

ప్లే స్టోర్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసే ముందు ఈ విషయాలు చెక్ చేయండి!

Big Stories

Advertisement
×