E-Paper
Advertisement

ప్రధాని చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం.. డేట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ!

ప్రధాని చేతుల మీదుగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ప్రారంభం.. డేట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ!
Advertisement

Hitech City Railway Station Opening: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అద్భుతంగా రీ డెవలప్ మెంట్ చేసిన  హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ ప్రారంభోత్సవానికి సిద్ధం అయ్యింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ రైల్వే స్టేషన్ ఇనాగరేష్ కానుంది. జూలై 17న ప్రధాని ఈ స్టేషన్ ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా తాజాగా అభివృద్ధి చేసిన పలు రైల్వే స్టేషన్లతో పాటు ఈ స్టేషన్‌ను కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలియడంతో ఐటీ ఉద్యోగులు, రోజూ వారీ రైలు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అత్యాధునిక సౌకర్యాలతో హైటెక్ సిటీ స్టేషన్

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పూర్తిగా ఆధునికీకరించారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు, విశాలమైన ఎంట్రెన్సులు, చక్కటి వెయిటింగ్ ఏరియా, కొత్త టికెట్ కౌంటర్లు, పరిశుభ్రమైన టాయిలెట్స్ లాంటి  సదుపాయాలను ఏర్పాటు చేశారు. రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేలా స్టేషన్‌ను తీర్చిదిద్దారు.

మల్కాజ్‌గిరి స్టేషన్‌ ను కూడా ప్రారంభించాలని డిమాండ్

Advertisement

ఇదే సమయంలో పునరాభివృద్ధి పనులు పూర్తయిన మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్‌ను కూడా జూలై 17న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేర్చాలని స్థానికులు, రైలు ప్రయాణికుల సంఘాలు కోరుతున్నాయి. హైటెక్ సిటీతో పాటు మల్కాజ్‌గిరి స్టేషన్‌ను కూడా ప్రారంభిస్తే ప్రజలకు వెంటనే ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని వారి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణికుల సంఘం ప్రతినిధులు రైల్వే మంత్రిత్వ శాఖతో పాటు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు తమ అభ్యర్థనను తెలియజేశారు. మల్కాజ్‌గిరి స్టేషన్‌లో అన్ని పనులు పూర్తయ్యాయని, ఆలస్యం చేయకుండా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

మల్కాజ్  గిరి స్టేషన్ ప్రారంభమైతే కొత్త బుకింగ్ కార్యాలయాన్ని రీ డెవలప్ మెంట్ చేసిన భవనంలోకి మార్చడం సులభమవుతుందని సంఘం ప్రధాన కార్యదర్శి నూర్ అహ్మద్ అలీ వెల్లడించారు. అలాగే మహిళల కోసం నిర్మించిన కొత్త మరుగుదొడ్లను కూడా వెంటనే ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు.

ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలు

Advertisement

హైటెక్ సిటీ, మల్కాజ్‌గిరి వంటి కీలక రైల్వే స్టేషన్లు ఆధునిక రూపంలో అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం లభించనుంది. టికెట్ బుకింగ్ నుంచి వేచి ఉండే సౌకర్యాల వరకు అన్ని సేవలు మరింత ఈజీగా అందనున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో రోజూ వేలాది మంది రైలు ప్రయాణికులకు ఈ అభివృద్ధి ఉపయోగపడనుంది.

అధికారిక ప్రకటనపై ఆసక్తి

జూలై 17న జరిగే కార్యక్రమంలో ఏయే స్టేషన్లు ప్రారంభం కానున్నాయనే అంశంపై అధికారిక ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. హైటెక్ సిటీ స్టేషన్ ప్రారంభం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా, మల్కాజ్‌గిరి స్టేషన్‌కు కూడా అవకాశం కల్పించాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు స్టేషన్లు ఒకేసారి ప్రారంభమైతే నగర రైల్వే ప్రయాణికులకు మరింత ప్రయోజనకరంగా మారనుంది.

Read Also: 10 వేల ఏళ్ల చరిత్రను కళ్లకు కట్టే ప్రయాణం.. జీవితంలో ఒక్కసారైనా ఈ సోలార్ రైలు ఎక్కాల్సిందే!

Related News

హిమాలయాల్లో రైల్వే అద్భుతం.. 2029 నాటికి మంచు కొండలను చీల్చుకుంటూ రైలు ప్రయాణం!

ఇండియన్ రైల్వేలో రారాజు.. ఈ ట్రైన్ వస్తే మిగతావన్నీ పక్కకు వెళ్లాల్సిందే!

అందాల రాణి క్లియోపాత్రా ఎలా చనిపోయింది? ఇప్పటికీ మిస్టరీనే!

అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!

500 ఏళ్ల నాటి సమాధి తెరవగానే వరుస మరణాలు.. రాజు శాపమే ప్రాణాలు తీసిందా?

బ్రిటిష్ ఇంజనీరింగ్ అద్భుతాలు.. దేశానికే గర్వకారణమైన 7 వింటేజ్ రైల్వే స్టేషన్లు!

ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక, ఇక్కడ సమాధులు కూడా కళాఖండాలే!

మాజీ ప్రేమికులు కలిసే స్పెషల్ మార్కెట్.. భార్యలే ‘వెళ్లి రా’ అంటారట!

Big Stories

Advertisement
×