Medaram Special Trains: దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయిన మేడారం సమ్మక్క సారళమ్మ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పరిసర రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహా జాతర జరగనున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికే పోటెత్తుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి మేడారం జాతరకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ములుగు వైపు వెళ్లే రూట్లన్నీ రద్దీగా మారుతున్నాయి. భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 28 జనసాధారణ్ రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్పెషల్ రైళ్లు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నుంచి బయల్దేరుతాయని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది.
ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు నడిచే మేడారం ప్రత్యేక రైళ్లు జనసాధారణ్ రైళ్లు అని రైల్వే అధికారులు తెలిపారు. వీటిలో రిజర్వేషన్ ఉండదన్నారు. ఈ రైళ్లలో అన్ని జనరల్ క్లాస్ కోచ్ లు ఉంటాయని వెల్లడించారు. ఈ రైళ్లను మేడారం వెళ్లే భక్తులు ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఈనెల 28, 30, ఫిబ్రవరి 1న సికింద్రాబాద్ -మంచిర్యాల- సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. సికింద్రాబాద్-మంచిర్యాల రైలు(07495) ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి ఉదయం 8.45 గంటలకు కాజీపేటకు, మధ్యాహ్నం 1.30 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటుంది. ఇదే రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు మంచిర్యాల-సికింద్రాబాద్ రైలు(07496) మంచిర్యాల నుంచి బయల్దేరి రాత్రి 8 గంటలకు కాజిపేటకు, రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ కు వస్తుంది. ఈ రైలు చర్లపల్లి, ఘట్ కేసర్, బీబీనగర్, భువనగిరి, ఆలేరు, పెంబర్తి, రఘునాథ్ పల్లి, కాజీపేట, వరంగల్, ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రాఘువపురం, రామగుండం, పెద్దంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
అటు జనవరి 29, 31న సికింద్రాబాద్- సర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ (07497/07498) నడుమ మేడారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్ నుంచి ఉదయం ఉదయం 5.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటాయి. అదే రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ లో బయల్దేరి రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాయి. ఈ రైళ్లు మౌలాలి, ఘట్ కేసర్, బీబీనగర్, కాజీపేటతో సహా పలు స్టేషన్లలో ఆగుతాయి.
To manage the heavy rush during Medaram Sammakka Saralamma Jathara – 2026, South Central Railway is operating 28 Jansadharan (Unreserved) Special Trains across key routes, ensuring safe, convenient, and smooth travel for devotees.#SouthCentralRailway#SCR pic.twitter.com/3wQIKWN6n8
— South Central Railway (@SCRailwayIndia) January 22, 2026
ఈ నెల 28 నుంచి 31 వరకు నిజామాబాద్- వరంగల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు నిజామాబాద్‌లో ఉదయం 7.05 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు వరంగల్‌లో బయల్దేరి అదే రాత్రి 10.30 గంటలకు నిజామాబాద్ చేరుకుంటాయి. మరోవైపు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఖమ్మం-కాజీపేట మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఖమ్మంలో ఉదయం 10 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 12.50 గంటలకు కాజీపేట చేరుకుంటాయి. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కాజీపేటలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఖమ్మం చేరుకుంటాయి. ఈ నెల 28, 29 తేదీల్లో ఆదిలాబాద్-కాజీపేట(07501) నడుమ ప్రత్యేక రైలు నడుస్తుంది.
Read Also: చర్లపల్లికి అమృత్ భారత్ వచ్చేస్తోంది, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఆగుతుందంటే?