E-Paper
Advertisement

థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

థాయ్‌లాండ్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Advertisement

Thailand Travel Tips| బీచ్‌లు, అందమైన ప్రకృతి దృశ్యాలు, టేస్టీ ఫుడ్, సందడిగా ఉండే మార్కెట్లు.. అబ్బబ్బా ఇవన్నీ ఆస్వాదించడానికే థాయ్‌లాండ్ వెళ్లడానికి చాలామంది భారతీయులు ఇష్టపడతారు. అయితే విదేశీ ప్రయాణంలో విమాన టికెట్లు, హోటల్ బుకింగ్‌లు చేసుకుంటే సరిపోదు. అక్కడి వాతావరణం, స్థానిక సంస్కృతి, ఇంటర్నెట్ సౌకర్యాలు, ఆరోగ్యరీత్యా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా తెలుసుకోవాలి. ముందుగానే కొన్ని విషయాలు సిద్ధం చేసుకుంటే ప్రయాణంలో ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. థాయ్‌లాండ్ వెళ్లేవారు తప్పక తెలుసుకోవాల్సిన ముఖ్యమైన టిప్స్ ఇవే!

1. దోమల నుంచి రక్షణ కోసం రెపెలెంట్ తీసుకెళ్లండి

థాయ్‌లాండ్‌లో ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో దోమల సమస్య ఎక్కువ. దోమల ద్వారా డెంగ్యూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. కాబట్టి మంచి క్వాలిటీ కలిగిన మస్కిటో రెపెలెంట్‌ వెంట తీసుకెళ్లండి. బయటకు వెళ్లే ముందు ఉత్పత్తిపై సూచించిన విధంగా ఉపయోగించండి. అవసరమైతే చేతులు, కాళ్లు కప్పే తేలికపాటి దుస్తులు ధరించండి.

2. ప్రయాణానికి ముందే ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోండి

Advertisement

కొత్త దేశంలో దారులు వెతకడానికి, హోటల్ బుకింగ్‌లు చూసుకోవడానికి ఇంటర్నెట్ అవసరం. భారత్ నుంచే ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ తీసుకోవచ్చు. లేదంటే థాయ్‌లాండ్ చేరుకున్నాక టూరిస్ట్ సిమ్ కొనుగోలు చేయవచ్చు. మీ ఫోన్‌కు అనుకూలంగా ఉంటే ఈ సిమ్ కూడా ఉపయోగించవచ్చు. ధరలు, డేటా పరిమితి, వ్యాలిడిటీ పోల్చి సరైన ఎంపిక చేసుకోండి.

3. స్థానికులతో మాట్లాడేందుకు కొన్ని థాయ్ పదాలు నేర్చుకోండి

ఎయిర్‌పోర్టులు, పెద్ద హోటళ్లలో ఇంగ్లిష్ మాట్లాడేవారు ఎక్కువగా కనిపిస్తారు. అయితే స్థానిక మార్కెట్లు, చిన్న దుకాణాల్లో భాష సమస్య ఎదురుకావచ్చు. అందుకే ట్రాన్స్‌లేషన్ యాప్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసుకోండి. థాయ్ భాషలో కొన్ని సాధారణ పదాలు నేర్చుకుంటే సంభాషణ సులభమవుతుంది. హోటల్ చిరునామా వంటి ముఖ్యమైన వివరాలను ఫోన్‌లో భద్రపరచుకోండి.

4. థాయ్‌లాండ్ సంస్కృతి, సంప్రదాయాలు

Advertisement

థాయ్‌లాండ్‌లో స్థానిక సంప్రదాయాలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇతరుల తలను తాకడం, కాళ్లను ఇతరులవైపు చూపించడం అనుచితంగా భావిస్తారు. కరెన్సీ నోట్లను కాళ్లతో తొక్కకండి. దేవాలయాలను సందర్శించేటప్పుడు అక్కడి నియమాలను పాటించండి. భుజాలు, మోకాళ్లు కప్పే దుస్తులు ధరించడం మంచిది. అవసరమైన చోట చెప్పులు తొలగించండి.

Also Read: గోవా కంటే బెటర్.. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఈ 4 ప్రదేశాలు బెస్ట్

5. ఎండ నుంచి రక్షణకు సన్‌స్క్రీన్ ఉపయోగించండి

థాయ్‌లాండ్‌లో ఎండ, ఉక్కపోత ఎక్కువ. బయట తిరిగేటప్పుడు SPF 50 బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ ఉపయోగించండి. సూచించిన సమయానికి మళ్లీ అప్లై చేయండి. టోపీ, సన్‌గ్లాసెస్ కూడా వెంట తీసుకెళ్లండి. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు నీడలో విశ్రాంతి తీసుకోండి.

Also Read: రైలు ప్రయాణంలో ఫ్యామిలీకి వేర్వేరు సీట్లు వచ్చాయా? ఇదిగో ముందుగానే ఇలా మార్చుకోండి

6. తేలికపాటి దుస్తులు, సౌకర్యవంతమైన షూస్ ఎంచుకోండి

కాటన్ లేదా లినెన్ దుస్తులు వేడి వాతావరణంలో సౌకర్యంగా ఉంటాయి. దేవాలయాలకు వెళ్లేందుకు శరీరాన్ని తగినంత కప్పే దుస్తులు తీసుకెళ్లండి. వర్షాల కోసం చిన్న గొడుగు లేదా తేలికపాటి రెయిన్ జాకెట్ ఉంచుకోండి. మార్కెట్లు, పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువగా నడవాల్సి రావచ్చు. అందుకే మంచి గ్రిప్ ఉన్న షూస్ ధరించండి. ఇవి జారిపడే ప్రమాదాన్ని తగ్గించి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.

Related News

ట్రైన్ క్యాన్సిల్ అయ్యిందా? నో టెన్షన్.. ఇలా చేస్తే డబ్బులు ఈజీగా రీఫండ్ అవుతాయి!

ఏపీ నుంచి కోల్‌కతాకు ప్రత్యేక రైళ్లు.. ఎప్పటి నుంచి ప్రారంభం అంటే?

6 రాష్ట్రాల మీదుగా 4,188 కి.మీ ప్రయాణం.. దేశంలో లాంగెస్ట్ ట్రైన్ జర్నీ ఇదే!

24 గంటల ప్రయాణం ఇక 16 గంటల్లోనే.. రెండో వందే భారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

రైలు ప్రయాణంలో విండో సీటు కావాలా? టికెట్ బుక్ చేసే ముందు ఇది తెలుసుకోండి

మారనున్న పానగల్ ఆలయ రూపురేఖలు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

రైలు ప్రయాణంలో మీ సీటు వేరే వ్యక్తి ఆక్రమించారా? గొడవ పడొద్దు.. వెంటనే ఈ పని చేయండి

Big Stories

Advertisement
×