E-Paper
Advertisement

సినీ ఇండస్ట్రీలో విషాదం.. 24 ఏళ్లకే నటి మృతి..!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. 24 ఏళ్లకే నటి మృతి..!
Advertisement

Actress Priya Vadana:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవా(Deva )కన్ను మూయగా.. ఆయన మరణించిన వారానికే.. ఆయన సోదరుడు సబేష్ (Sabesh)కుమారుడు, ప్రముఖ నటుడు కార్తీక్ సబేష్ (Karthik sabesh) 37 సంవత్సరాల వయసులోనే తుది శ్వాస విడిచారు. ఇక ఈ రెండు మరణాలు మరవకముందే దేవా శిష్యుడు, ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి (Krishna Raj Ramasamy) కన్నుమూసి అభిమానులను శోకసంద్రంలో ముంచేశారు. ఇలా వరుస విషాదాలు కోలీవుడ్ ను ఒంటరి చేస్తున్నాయి అనే బాధపడేలోపే మరో 24 సంవత్సరాల యువ నటి కన్నుమూయడం ఇండస్ట్రీలో మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి ఆ నటి ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

24 ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్న నటి..

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ నటిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న ప్రముఖ నటి ప్రియ వదన (Priya vadana) ఆకస్మిక మరణం తమిళ్ మీడియా వర్గాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రముఖ టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న ఈమె.. అక్టోబర్ 21న మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సహోద్యోగులు ఆశ్చర్యానికి గురవుతూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఇకపోతే ప్రియ వదన ఇంత చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియ రాలేదు. ఆమె మృతికి సంబంధించిన పలు వార్తలు మాత్రం తమిళ్ మీడియా వర్గాలలో చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

also read:హౌస్ లో దొంగలుగా మారిన స్నేహితులు.. ఆ ఇద్దరూ వీరి ముందు నెగ్గుతారా?

జర్నలిజంపై ఆసక్తి..

ప్రియ వదన విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి రాకముందే ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పనిచేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. అంతకుముందు మరో టీవీ ఛానల్ లో కూడా పనిచేసిన ఈమె.. జర్నలిజంపై ఆసక్తితోనే ఇలా న్యూస్ ఛానల్ లో పనిచేసినట్లు సమాచారం. బుల్లితెరపై తన కెరియర్ ను కొనసాగిస్తూనే.. సినిమాలలో కూడా అవకాశాలు అందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే ఇటీవల సూర్య (Suriya ) హీరోగా నటించిన కరుప్పు (Karuppu) చిత్రంలో ఒక చిన్న పాత్రలో కూడా కనిపించింది. ఈ సినిమా తర్వాత నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు అందుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు కానీ ఇంతలోనే ఆకస్మిక మరణ వార్త అందర్నీ కలచివేసింది.

ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం?

Advertisement

ఇక్కడ మరో దిగ్భ్రాంతి కరమైన విషయం ఏమిటంటే.. ఇటీవల ఆమె తన 24వ పుట్టినరోజు కూడా జరుపుకోవడం గమనార్హం. అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో కూడా పంచుకుంది. మరి అలాంటి ఈమె ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? ఎంతో భవిష్యత్తు ఉన్న ప్రియ వదన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అనే విషయాలు సోషల్ మీడియాలో చర్చకు దారితీసాయి. ఏదిఏమైనా ఈమె ఆకస్మిక మరణం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఆమె అకాల మరణం పలువురిని విషాదంలో ముంచేసింది.

Related News

ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Intinti Ramayanam: కమల్ కు కొత్త గర్ల్ ఫ్రెండ్.. ఆమె బ్యాగ్రౌండ్ ఇదే..?

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. ధీరజ్ పరిస్థితి దారుణం.. షాకిచ్చిన సేటు..

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతి పై అనుమానం.. రోహిణి ఇరుక్కుంటుందా..?చివర్లో షాకింగ్ ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి విడాకులు ఇస్తున్న కమల్.. శ్రీకర్ కు టెన్షన్.. అవని సూపర్ ప్లాన్..

Brahmamudi Serial Today Episode October 24th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రేఖ ప్లాన్ అట్టర్ ప్లాప్ – సుభాష్ సేఫ్

Podarillu Today Episode : అడ్డంగా దొరికిపోయిన జమున.. గుండె బద్దలు కొట్టే నిజం.. నారాయణ ఇచ్చిన ట్విస్ట్..

Big Stories

Advertisement
×