E-Paper
Advertisement

Unique Village: ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. ఇక్కడి ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలియదు!

Unique Village: ప్రపంచంలోనే అరుదైన గ్రామం.. ఇక్కడి ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలియదు!
Advertisement

The Mystery of Rainless Village: మన దగ్గర ప్రతి ఏటా వర్షాలు పడుతాయి. తక్కువో.. ఎక్కువో.. వానలు రావడం మాత్రం పక్కా. కానీ, ప్రపంచంలో అసలు వర్షం పడని గ్రామం ఒకటి ఉంది. ఇంకా చెప్పాలంటే, అక్కడి ప్రజలకు వర్షం అంటే ఏంటో తెలియదు. కానీ, చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని చూసేందుకు, తమ కెమెరాల్లో బంధించేందుకు పాపులర్ ఫోటోగ్రాఫర్లు క్యూ కడుతుంటారు. ఇంతకీ ఆ గ్రామం ఏది? ఎందుకు ఇక్కడ వర్షం కురవదు? అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షం కురవని ఏకైక గ్రామం అల్ హుతైబ్ 

ప్రపంచంలో ప్రత్యేకమై ప్రాంతంగా గుర్తింపు తెచ్చుకుంది యెమెన్ దేశంలోని అల్ హుతైబ్. ఇక్కడ దాదాపు వర్షం పడదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజం. దీనికి కారణం అక్కడ ఉన్న భౌగోళిక కారణాలు. ఈ గ్రామం సముద్ర మట్టానికి చాలా ఎత్తులో, పర్వత ప్రాంతంలో ఉంది. ఈ గ్రామం మేఘాల కంటే ఎత్తులో ఉంటుంది.  మేఘాలు గ్రామం కింద ఉంటాయి. మేఘాలు పర్వతాల చుట్టూ చేరినా, గ్రామం ఉన్న ఎత్తుకు పైకి రావడం చాలా అరుదు. అందుకే ఇక్కడ వర్షం పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

ప్రత్యేకమైన వాతావరణం

Advertisement

అల్ హుతైబ్ వాతావరణం ప్రత్యేకంగా ఉంటుంది. ఉదయం సమయంలో సూర్యకాంతి స్పష్టంగా కనిపిస్తుంది. కింద భాగంలో మేఘాలు తేలియాడుతూ ఉండటం వల్ల ఈ ప్రాంతం అంతా అద్భుతంగా కనిపిస్తుంది.  రాత్రి వేళల్లో చల్లని గాలి వీచడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

గ్రామ ప్రజలకు నీళ్లు ఎలా?

ఈ గ్రామంలో నివసించే ప్రజలు తమ జీవన విధానాన్ని ఈ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నారు. నీటి అవసరాలను ఇతర మార్గాల ద్వారా సేకరించుకుంటారు. ముఖ్యంగా భూగర్భ జలాలు, నిల్వ చేసిన నీటిని వాడుకుంటారు. వర్షంపై ఆధారపడకుండా జీవించటం అలవాటు చేసుకున్నారు. వర్షాలు కురవకపోయినా, ఇక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడరు.

ప్రకృతి సౌందర్యంతో ప్రసిద్ధి చెందిన అల్ హుతైబ్  

Advertisement

ఈ గ్రామం తన ప్రకృతి సౌందర్యంతో ప్రసిద్ధి చెందింది. పర్వతాలపై నిర్మించిన రాతి ఇళ్లు, చుట్టూ మేఘాలు తేలియాడే దృశ్యం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ గ్రామం పర్యాటకులను, ఫోటోగ్రాఫర్లను బాగా ఆకర్షిస్తుంది. వర్షం లేకపోయినా జీవితం ఎలా కొనసాగుతుందో చూపించే ఒక అద్భుత ఉదాహరణగా అల్ హుతైబ్ కొనసాగుతోంది. ఈ గ్రామం దావూదీ బొహ్రా ముస్లిం సమాజానికి  ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు ఈ గ్రామాన్ని సందర్శిస్తుంటారు.  స్థానిక ప్రజలు వ్యవసాయం, పశుపోషణ లాంటి సంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తారు. ఆధునిక సదుపాయాలు తక్కువగా ఉన్నప్పటికీ, ప్రకృతితో మమేకమై జీవిస్తారు. మొత్తానికి, అల్ హుతైబ్ అందమైన, ప్రశాంతమైన, ప్రత్యేకతతో కూడిన గ్రామంగా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ప్రకృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికతతో విరాజిల్లుతోంది.

Read Also:  యుద్ధ సమయంలో సంపన్నులు తలదాచుకొనే దేశాలివే.. ఈ ప్రాంతాలు అంత సేఫా?

Related News

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

Big Stories

Advertisement
×